Bigg Boss 8 Telugu: ఆమె నీకు ఇష్టమంట: పృథ్విని అడిగిన సోనియా.. హౌస్‍లో కొత్త ట్రాక్‍లు.. మణిపై అరిచిన ప్రేరణ: వీడియో
Bigg Boss 8 Telugu New Promo: బిగ్‍బాస్ హౌస్‍లో కొత్త లవ్ ట్రాక్‍లు నడిచేలా కనిపిస్తున్నాయి. నేటి ఎపిసోడ్ రెండో ప్రోమోలో ఇది అర్థమవుతోంది. అలాగే, రేషన్ కోసం నిర్వహించిన గేమ్‍లో మణికంఠపై ప్రేరణ సీరియస్ అయ్యారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో మూడో వారం నడుస్తోంది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక రేషన్ కోసం కంటెస్టెంట్లు నేటి (సెప్టెంబర్ 17) ఎపిసోడ్‍లో పోరాడనున్నారు. అయితే, బిగ్‍బాస్ హౌస్‍లో కొత్త లవ్ ట్రాక్‍లు నడిచేలా ఉన్నాయి. 16వ రోజు నేటి ఎపిసోడ్‍కు సంబంధించిన రెండో ప్రోమోను కూడా స్టార్ మా తీసుకొచ్చింది. ఈ ప్రోమోలో ఏముందంటే..
నిఖిల్, సీత, యష్మి మధ్య..
యష్మిని ఫ్లర్ట్ చేస్తున్నావని నిఖిల్‍తో సీత మాట్లాడటంతో ఈ ప్రోమో మొదలైంది. “నీతో కాకుండా ఎవరి మాట్లాడా చెప్పు” అని నిఖిల్ అంటే.. యష్మితో అని సీత అన్నారు. యష్మితో తాను సరిగానే మాట్లాడనని, ఫ్లర్ట్ ఏం చేస్తానని నిఖిల్ అన్నారు. ఈ విషయాన్ని పిలిచి మరీ నేరుగా యష్మిని అడిగారు సీత.
నిఖిల్ ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశారా అని అతడి పక్కనే యష్మిని కూర్చోబెట్టి సీత అడిగారు. “నేను చాలాసార్లు కొట్టాను. ఆయన చాలాసార్లు కొట్టారు” అని యష్మి అనడంతో సీత, మణికంఠ గట్టిగా నవ్వారు. “నువ్వు యష్మితో చేసేది కూడా నా దృష్టిలో ఫ్లర్టింగే” అని విష్ణు అంటే.. “నేను సీతకు తప్ప ఎవరికీ పాడలేదు ఇలా” అని నిఖిల్ అన్నారు. దీంతో చేసుకోండి మీరూ.. మీరూ అంటూ అక్కడి నుంచి లేచివెళ్లిపోయారు యష్మి.
"నాకు నీ హార్ట్‌లో ఏముందని కూడా తెలియదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. నువ్వు చెప్పట్లేదు కూడా” అని సీత అన్నారు. నువ్వు అడగలేదు కూడా అని నిఖిల్ అన్నారు. ఇక్కడ మిస్ కమ్యూనికేషన్ వస్తుందని అభయ్ అని గట్టిగా నవ్వారు. మనసా.. మనసా అనే పాట బ్యాక్‍గ్రౌండ్ పెట్టి లవ్ ట్రాక్ నడుస్తుందనేలా స్టార్ మా చెప్పే ప్రయత్నం చేసేంది.
ఏం జరుగుతోంది ఇద్దరి మధ్య: సోనియా
“నీకు, యష్మికి ఏమవుతోందిరా” అని పృథ్విరాజ్‍ను సోనియా ప్రశ్నించారు. ఎందుకలా అడుగుతున్నావంటూ నవ్వుతూ అన్నారు పృథ్వి. “నీకు ఇష్టమంట కదా ఆమెంటే” అని సోనియా అన్నారు. ఆ తర్వాత యష్మిని చూపించి బ్యాక్‍గ్రౌండ్‍లో మనసా.. మనసా సాంగ్ వచ్చింది. దీంతో పృథ్వి, యష్మి మధ్య కొత్త ట్రాక్ ఉండనుందా అనే డౌట్ వస్తోంది.
మణిపై అరిచిన ప్రేరణ
రేషన్ గెలిచేందుకు “నత్తలా సాగకు.. ఒక్కటీ వదలకు” అనే రెండో టాస్కును కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ ఇచ్చారు. క్యాబేజీలను తలతో తోస్తూ ఈ గేమ్ ఆడారు. ఈ గేమ్‍కు సంచాలక్‍గా నాగ మణికంఠ వ్యవహరించారు. ఈ క్రమంలో ప్రేరణ, మణి మధ్య వాగ్వాదం జరిగింది.
క్యాబేజీలు లేవు అని ప్రేరణ అరవటంతో.. ఎన్ని ఉంటే అన్నే అని మణికంఠ అన్నారు. “నువ్వెవర్రా చెప్పడానికి” అని ప్రేరణ వాదనకు తిగారు. నేను సంచాలక్ అని మణి అంటే.. తొక్కలో సంచాలక్ అంటూ ప్రేరణ గట్టిగా అరిచారు. దీంతో థాంక్యూ అంటూ వెటకారంగా అన్నారు మణి.
మణికంఠ వెనుక నుంచి కౌగిలించుకోవటంపై యష్మి బాధపడినట్టు నేటి తొలి ప్రోమోలో ఉంది. టార్చర్ అనిపిస్తోందని పృథ్వితో చెప్పుకున్నారు. రేషన్ కోసం “ఫొటోపెట్టు.. ఆగేటట్టు” తొలి ఛాలెంజ్ ఇచ్చారు బిగ్‍బాస్. నబీల్, పృథ్వి మధ్య ఈ టాస్క్ హోరాహోరీగా సాగినట్టు అర్థమవుతోంది. ఈ రేషన్ టాస్కుల్లో ఎవరు గెలువనున్నారో నేటి ఎపిసోడ్‍లో తెలియనుంది.