Bigg Boss Telugu 8 Manikanta: కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది.. భయమేస్తోంది: బిగ్‍బాస్‍కు ఏడుస్తూ మొరపెట్టుకున్న మణికంఠ-bigg boss telugu 8 my confidence dying naga manikanta cries in fear of elimination after nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 Manikanta: కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది.. భయమేస్తోంది: బిగ్‍బాస్‍కు ఏడుస్తూ మొరపెట్టుకున్న మణికంఠ

Bigg Boss Telugu 8 Manikanta: కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది.. భయమేస్తోంది: బిగ్‍బాస్‍కు ఏడుస్తూ మొరపెట్టుకున్న మణికంఠ

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 04, 2024 11:56 PM IST

Bigg Boss Telugu 8 Manikanta: బిగ్‍బాస్ 8 ఫస్ట్ నామినేషన్లలో నాగ మణికంఠ హాట్ టాపిక్ అయ్యారు. అతడిని కొందరు కంటెస్టెంట్లు టార్గెట్ చేశారు. ముఖ్యంగా సంపతీ గేమ్ ఆడుతున్నావంటూ విమర్శించారు. నామినేషన్ల తర్వాత బిగ్‍బాస్‍తో మాట్లాడుతూ మణికంఠ మరోసారి ఏడ్చేశారు.

Bigg Boss Telugu 8 Manikanta: కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది.. భయమేస్తోంది: బిగ్‍బాస్‍కు ఏడుస్తూ మొరపెట్టుకున్న మణికంఠ
Bigg Boss Telugu 8 Manikanta: కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది.. భయమేస్తోంది: బిగ్‍బాస్‍కు ఏడుస్తూ మొరపెట్టుకున్న మణికంఠ

బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్‍లో సీరియల్ యాక్టర్ నాగ మణికంఠ మొదటి రోజు నుంచే ఎమోషనల్ అవుతూ వస్తున్నారు. గ్రాండ్ లాంచ్ రోజే ఎలిమినేషన్ అంటూ ప్రాంక్ చేయగా బాధ, కోపం రెండూ వెల్లగక్కారు. తన కష్టాలు చెప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో కష్టాలను వెల్లడించారు. ఈ సీజన్‍లో ఫస్ట్ నామినేషన్ల సందర్భంగా మణికంఠ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, సంపతీ గేమ్ ఆడుతున్నావంటూ అతడిపై పృథ్విరాజ్ సహా మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేట్ అయిన తర్వాత ఎలిమినేట్ అవుతానేమోననే భయంతో హౌస్‍లో మూడో రోజైన నేటి (సెప్టెంబర్ 4) ఎపిసోడ్‍లో బోరున ఏడ్చేశారు మణికంఠ.

అర్థం కావడం లేదు

తొలి వీక్ ఎలిమినేషన్ కోసం మణికంఠ నామినేట్ అయ్యారు. అతడిని నలుగురు నామినేట్ చేశారు. అయితే, ఇక తాను ఎలిమినేట్ అవుతానని భయం వేస్తోందని, ఎలా ఉండాలో అర్థం కావడం లేదని నామినేషన్ల ప్రక్రియ తర్వాత మణికంఠ ఏడ్చేశారు. జీవితంలో ఇది తన చివరి యుద్ధమని కన్నీళ్లు పెట్టుకున్నారు. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావడం లేదని బాధపడ్డారు. మణికంఠను ప్రస్తుత చీఫ్ నిఖిల్ ఓదార్చారు. ప్రశాంతంగా ఉండాలని, ఇంకా గేమ్ అవలేదు కదా అని చెప్పారు. శనివారం నామినేట్ అవుతానేమోనని మణికంఠ భయపడితే.. అతడికి నిఖిల్ ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో మణికంఠ విగ్ పెట్టుకున్నాడన్న విషయం బయటికి వచ్చింది.

ఆశలతో వచ్చా.. కానీ భయమేస్తోంది

బోరున ఏడ్చేస్తున్న మణికంఠతో బిగ్‍బాస్ మాట్లాడారు. అప్పుడు మరికొంత ఎమోషనల్‍గా అతడు కష్టాలను చెప్పారు. తాను జీవితంలో నిలదొక్కుకోవాలని ఎన్నో ఆశలతో బిగ్‍బాస్‍లోకి అడుగుపెట్టానని.. ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం చచ్చిపోయిందని మొరపెట్టుకున్నారు.

తాను ఒక్క చోట కూడా అబద్ధం చెప్పలేదని, అబద్ధం ఆడితే తనకు గిల్టీగా అనిపిస్తుందని మణికంఠ చెప్పారు. “నా భార్య నాకు కావాలి. నా అత్తమామల నుంచి గౌరవం కావాలి. నా స్టెప్ ఫాదర్ మళ్లీ కావాలి. నా పిల్ల కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను. ఇంత త్వరగా బయటపడిపోతానని అనుకోలేదు. చాలా నిలకడగా ఉంటానని అనుకున్నా. లుక్స్‌తో మెయింటెన్ చేద్దామనుకున్నా. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నాకు ఏమీ అర్థం కావడం లేదు” అని తీవ్రంగా ఏడ్చేశారు మణికంఠ.

తనను తాను మార్చుకోవడానికి బిగ్‍బాస్ మంచి ప్లాట్‍ఫామ్ అనుకున్నానని మణికంఠ చెప్పారు. బిగ్‍బాస్ కూడా స్కూల్ లాంటిదని అనుకున్నానని అన్నారు. అయితే, సాధించడానికి వచ్చి ఇంత త్వరగా ధైర్యం కోల్పోతే ఎలా అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు బిగ్‍బాస్. బలవంతుడివి కాబట్టే ఇక్కడి వరకు వచ్చావంటూ ధైర్యం చెప్పారు. తనకు ధైర్యం ఒకప్పుడు ఉండేదని, కానీ జీవితంలో చాలా కోల్పోయాక తాను ఇలా అయిపోయానని మణికంఠ చెప్పారు. అంతకు ముందు నామినేషన్లలోనూ.. తాను తల్లిదండ్రులను కోల్పోయానని.. చాలా కష్టాలు పడ్డానని అతడు చెప్పి ఏడ్చారు.

నామినేషన్లలో వీరే

తొలి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బేబక్క, మణికంఠ, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్విరాజ్ నామినేషన్లలో ఉన్నారు. వీరిలో ఓటింగ్ తక్కువగా వచ్చిన ఒకరు ఈ వీకెండ్‍లో హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. ఈ 8వ సీజన్‍లో అదే ఫస్ట్ ఎలిమినేషన్ కానుంది.