Bigg Boss 8 Telugu Day 1: చీఫ్‍లుగా ముగ్గురు కంటెస్టెంట్లు.. చీఫ్ ఎంపికలో బిగ్‍బాస్ ఇచ్చిన ట్విస్టుతో తొలి రోజే గొడవలు-bigg boss 8 telugu day 1 highlights akhil nainika and yashmi gowda appoints as chiefs shekhar basha and soniya argument ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Day 1: చీఫ్‍లుగా ముగ్గురు కంటెస్టెంట్లు.. చీఫ్ ఎంపికలో బిగ్‍బాస్ ఇచ్చిన ట్విస్టుతో తొలి రోజే గొడవలు

Bigg Boss 8 Telugu Day 1: చీఫ్‍లుగా ముగ్గురు కంటెస్టెంట్లు.. చీఫ్ ఎంపికలో బిగ్‍బాస్ ఇచ్చిన ట్విస్టుతో తొలి రోజే గొడవలు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 03, 2024 12:08 AM IST

Bigg Boss 8 Telugu Day 1: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ తొలి రోజు ఇంట్రెస్టింగ్‍గా సాగింది. కెప్టెన్ లేకపోయినా.. ఆ స్థానంలో చీఫ్‍లు ఉంటారని బిగ్‍బాస్ చెప్పారు. ఏకంగా ముగ్గురు చీఫ్‍లు అయ్యారు. తొలి రోజే కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి.

Bigg Boss 8 Telugu Day 1: చీఫ్‍లుగా ముగ్గురు కంటెస్టెంట్లు.. చీఫ్ ఎంపికలో బిగ్‍బాస్ ఇచ్చిన ట్విస్టుతో తొలి రోజే గొడవలు
Bigg Boss 8 Telugu Day 1: చీఫ్‍లుగా ముగ్గురు కంటెస్టెంట్లు.. చీఫ్ ఎంపికలో బిగ్‍బాస్ ఇచ్చిన ట్విస్టుతో తొలి రోజే గొడవలు

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ తొలి రోజు (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ హాట్‍హాట్‍గా జరిగింది. హౌస్‍లో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా.. తొలి రోజు రెండు టాస్కులు మాత్రం ఆరుగురికే జరిగాయి. ముగ్గురు చీఫ్‍లుగా ఎంపికయ్యారు. కొన్ని గొడవలు జరిగాయి. అయితే, టాస్క్ ద్వారా కాకుండా మూడో చీఫ్ సెలెక్షన్ విషయంలో బిగ్‍బాస్ మెలిక పెట్టడంతో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. బిగ్‍బాస్ 8 తొలి రోజు ఎలా సాగిందో ఇక్కడ చూడండి.

మణికంఠకు సర్దిచెబుతూ..

గ్రాండ్‍ లాంచ్‍లో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ఐదుగురు నాగ మణికంఠ పేరు చెప్పారు. అయితే, అది ప్రాంక్ అని తేలింది. ఈ విషయంలో మణికంఠకు ఇతర కంటెస్టెంట్లు సర్దిచెప్పటంతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఆదిత్య ఓం, అభయ్ నవీన్, నిఖిల్ సహా మరికొందరు అతడితో మాట్లాడారు. విష్ణుప్రియ, మణికంఠ, పృథ్విరాజ్ కాసేపు మాట్లాడుకున్నారు. నిఖిల్, మణికంఠ మధ్య కూడా కాస్త వాగ్వాదం సాగింది.

బిగ్‍బాస్‍లో తొలి రోజు యాష్ కరో పాటతో షురూ అయింది. కంటెస్టెంట్లందరూ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత నిత్యావసర సరుకులను హౌస్‍లోకి పంపారు బిగ్‍బాస్. డైనింగ్ హాల్ దగ్గర కంటెస్టెంట్లు మాట్లాడుకున్నారు. పనులను పంచుకున్నారు.

సోనియా, శేఖర్ బాషా మధ్య గొడవ

కిచెన్‍లో కుక్కర్ సమస్య గురించి సోనియా ఆకుల, బెజవాడ బేబక్క మధ్య వాగ్వాదం జరిగింది. బేబక్క బాధ్యతగా లేరంటూ సోనియా అన్నారు. నారింజ పండ్లతో కొందరు క్యాచ్ ఆట ఆడడంతో సోనియా, ఆర్జే శేఖర్ బాషా మధ్య గొడవ జరిగింది. ఆడిన వాళ్లు పండ్లు తినడానికి వీల్లేదని, ఫుడ్‍ను అగౌరపరిచారని సోనియా అన్నారు. ఆడాను.. తింటాను అని శేఖర్ వాదించారు. తాము మనుషుల్లాగా తినాలనుకుంటున్నామని సోనియా అన్నారు. దీంతో కోపం తెచ్చుకున్న శేఖర్.. ‘నేను మనిషిని కాదా.. ఇది తింటే పుశువునా’ అంటూ అరిచారు.

ఫస్ట్ టాస్క్.. చీఫ్‍గా నిఖిల్

ఆ తర్వాత కంటెస్టెంట్లతో బిగ్‍బాస్ మాట్లాడారు. ఈ సీజన్‍లో కెప్టెన్లు ఉండరని, చీఫ్‍లు ఉంటారని చెప్పారు. టాస్కులో గెలిచిన యష్మీ గౌడ, నిఖిల్, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, నైనిక, నబీల్ అఫ్రిది.. చీఫ్‍గా అయ్యేందుకు అసలైన తొలి టాస్కులో పోటీ పడొచ్చని చెప్పారు. జోడీగా కాకుండా ఎవరికి వారు పోటీపడాలని చెప్పారు. ఈ గేమ్‍కు సంచాలకుడిగా అభయ్ నవీన్ వ్యవహరించారు.

‘పట్టుకొని ఉండండి.. వదలకండి’ అంటూ తొలి టాస్క్ ఇచ్చారు బిగ్‍‍బాస్. ఆ ఆరుగురు పోటీ పడ్డారు. ఓ బోనులో రంగుల తాళ్లను ఎక్కువ సేపు పట్టుకున్న వాళ్లు విన్నర్ అని బిగ్‍బాస్ చెప్పారు. స్పిన్నింగ్ వీల్‍లో వచ్చిన కలర్స్ తెంపడం, దాన్ని బట్టి కంటెస్టెంట్లు వేరే కలర్ తాడును పట్టుకోవడం లాంటి రూల్స్ చెప్పారు. ఈ టాస్కులో చివరికి నిఖిల్ మయక్కల్ గెలిచారు. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఫస్ట్ చీఫ్ అయ్యారు.

గేమ్‍ గతిని మార్చే శక్తి చీఫ్‍లకు ఈ సీజన్‍లో ఉంటుందని బిగ్‍బాస్ చెప్పారు. అయితే, ఓ అధికారాలు ఉంటాయో ఇప్పటికి వివరించలేదు.

ఐదుగురికి మరో టాస్క్.. రెండో చీఫ్‍గా నైనిక

ఇంటి చీఫ్ అవడానికి నైనిక, బేబక్క, శేఖర్, నబిల్, యష్మి గౌడకు మరో టాస్క్ ఇచ్చారు బిగ్‍బాస్. కోన్‍లను కాళ్ల మధ్యలో పెట్టుకొని గెంతుతూ ఎండ్ లైన్‍ వద్ద ఎనిమిదో కోన్లతో ముందుగా టవర్ నిర్మించిన వారు విన్నర్ అని ప్రకటించారు. ఈ టాస్కులో గెలిచిన నైనిక రెండో చీఫ్ అయ్యారు.

మూడో చీఫ్ సెలెక్షన్‍లో ట్విస్ట్

మూడో చీఫ్‍ను సెలెక్ట్ చేసేందుకు బేబక్క, శేఖర్, నబిల్, యష్మి గౌడకు టాస్క్ ఇవ్వలేదు బిగ్‍బాస్. ఇప్పటికే చీఫ్‍లు అయిన నిఖిల్, నైనిక మాట్లాడుకొని ఆ నలుగురిలో ఒకరిని ఎంపిక చేయాలని చెప్పారు. దీంతో నిఖిల్, నైనిక కాసేపు మాట్లాడుకున్నారు. ఎవరిని చీఫ్ చేయాలని కారణాలను చర్చించుకున్నారు.

చీఫ్‍గా వద్దనుకున్న వారి పేర్లపై తాళ్లను లాగి చీఫ్‍ కలను క్రష్ చేయాలని నిఖిల్, నైనికకు బిగ్‍బాస్ చెప్పారు. దీంతో వారు నబీల్, బేబక్క, శేఖర్ బాషా పేర్లను క్రష్ చేశారు. యష్మి గౌడను మూడో చీఫ్‍గా ఎంపిక చేశారు.

ఈ మధ్యలోనే గొడవలు జరిగాయి. తనను ఎందుకు వద్దనుకున్నారని నైనిక, నిఖిల్‍ను నబీల్ ప్రశ్నించారు. సైలెంట్‍గా ఉన్నాడనే కారణం చెబితే అతడు వాదించారు. బెజవాడ బేబక్క పెద్దగా వాదనకు దిగలేదు. చీఫ్ అయితేనే ఉంటానని ఏం లేదంటూ లైట్ తీసుకున్నట్టు మాట్లాడినా.. కాస్త అసంతృప్తిగా కనిపించారు. ఎక్కువగా కోప్పడుతున్నందుకు చీఫ్‍గా చేయలేదని శేఖర్ బాషాకు కారణంగా చెప్పారు అఖిల్, నైనిక. దీంతో శేఖర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోనియా ఫైర్

నబీల్‍ను చీఫ్‍గా తీసుకోకపోవడంపై నిఖిల్, నైనికను సోనియా ప్రశ్నించారు. నబీల్ అందరితో మాట్లాడుతూ, పనులు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగాడని గుర్తుచేశారు. యష్మి కొన్నిసార్లు కోపం చూపించారని సోనియా అన్నారు. దీంతో యష్మి వాదనకు దిగారు. కాసేపు యష్మి, సోనియా, నిఖిల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మొత్తంగా మూడో చీఫ్ సెలెక్షన్ విషయంలో బిగ్‍బాస్ పెట్టిన మెలికతో కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. నిఖిల్, నైనిక, యష్మి తొలి రోజే చీఫ్‍లుగా సెలెక్ట్ అయ్యారు.