Bigg Boss 8 Telugu Contestants: బిగ్‍బాస్ హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లు వీరే.. ఏడు జంటలుగా..-bigg boss 8 telugu full contestants list 14 housemates as 7 pairs yasmi gowda abhay naveen to vishnupriya bheemineni ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Contestants: బిగ్‍బాస్ హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లు వీరే.. ఏడు జంటలుగా..

Bigg Boss 8 Telugu Contestants: బిగ్‍బాస్ హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లు వీరే.. ఏడు జంటలుగా..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 03, 2024 12:23 AM IST

Bigg Boss 8 Telugu Contestants list: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. గ్రాండ్ లాంచ్ ద్వారా హౌస్‍లోకి వెళ్లారు. ఏడు జంటలుగా వీరు ఉన్నారు. ఫుల్ లిస్ట్ ఇక్కడ చూడండి.

Bigg Boss 8 Telugu Contestants: బిగ్‍బాస్ హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లు వీరే.. ఏడు జంటలుగా..
Bigg Boss 8 Telugu Contestants: బిగ్‍బాస్ హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లు వీరే.. ఏడు జంటలుగా..

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ మొదలైంది. ఈ రియాల్టీ షో నయా సీజన్ గ్రాండ్ లాంచ్ నేడు (సెప్టెంబర్ 1) అదిరేలా జరిగింది. 14 మంది కంటెస్టెంట్లు హౌస్‍లోకి అడుగుపెట్టారు. అయితే, ఈ సీజన్‍లో ఒక్కక్కొరుగా కాకుండా.. జోడీలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఏడు జంటలు ఉన్నాయి. గ్రాండ్ లాంచ్‍లో కంటెస్టెంట్లతో మాట్లాడి హౌస్‍లోకి పంపారు హోస్ట్ కింగ్ నాగార్జున. గ్రాంచ్ లాంచ్ ఎంటర్‌టైనింగ్‍గా సాగింది.

బిగ్‍బాస్ 8 తెలుగు 14 మంది కంటెస్టెంట్లు వీరే

1. యష్మి గౌడ - టీవీ సీరియల్ నటి

2. నిఖిల్ మలియక్కల్ - టీవీ సీరియల్ నటుడు

3. అభయ్ నవీన్ - సినీ నటుడు

4. ప్రేరణ - టీవీ సీరియల్ నటి

5. ఆదిత్య ఓం - సినీ నటుడు

6. సోనియా ఆకుల - సినీ నటి

7. బెజవాడ బేబక్క - యూట్యూబర్

8. ఆర్జే శేఖర్ బాషా - ఆర్జే

9. కిర్రాక్ సీత - సినీ నటి

10. నాగ మణికంఠ - టీవీ సీరియల్ నటుడు

11. పృథ్విరాజ్ - నటుడు

12. విష్ణుప్రియ భీమినేని - టీవీ యాంకర్

13. నైనిక - డ్యాన్స్ - ఢీ ఫేమ్

14. నబీల్ ఆఫ్రిది - యూట్యూబర్

 

ఏడు జోడీలు ఇలా..

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ హౌస్‍‍లోకి జోడీలుగా కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. ఆట కూడా ఇలానే ఆడే అవకాశం ఉంది. 14 మంది హౌస్‍మేట్స్.. ఏడు జంటలుగా ఉన్నారు. 1. యష్మి గౌడ - నిఖిల్, 2.అభయ్ నవీన్ - ప్రేరణ, 3.ఆదిత్య ఓం - సోనియా, 4.బెజవాడ బేబక్క - ఆర్జే శేఖర్ బాషా, 5.కిర్రాక్ సీత - నాగ మణికంఠ, 6.పృథ్విరాజ్ - విష్ణుప్రియ భీమినేని, 7.నైనిక - నబీల్ ఆఫ్రిది జోడీలుగా ఉన్నారు. ఇప్పటికి 14 మంది హౌస్‍లోకి వెళ్లగా.. కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరికొందరు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍కు గెస్టులుగా సరిపోదా శనివారం ప్రమోషన్ల కోసం నేచులర్ స్టాన్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ వచ్చారు. అలాగే, ‘35 ఇది చిన్న కథ కాదు’ మూవీ కోసం ఆ మూవీని సమర్పిస్తున్న దగ్గుబాటి రానా, ప్రధాన పాత్ర పోషించిన నివేదా థామస్ వెళ్లారు. హౌస్‍లోకి వెళ్లి కంటెస్టెంట్లతో సరదా టాస్కులు ఆడించారు.

చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడి హౌస్‍లోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చారు. ఒకరిని బయటికి పంపిస్తానంటూ టెన్షన్ పెట్టారు. నాగ మణికంఠను బయటికి పంపాలని ఐదు ఓట్లు వచ్చాయి. దీంతో అతడిని బయటికి తీసుకెళ్లేందుకు అనిల్ రెడీ అవటంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, ఇది ప్రాంక్ అని చెప్పటంతో టెన్షన్ వీడింది. ఇలా బిగ్‍బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. రేపటి నుంచి అసలు ఆట మొదలుకానుంది.

టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

బిగ్‍బాస్ 8వ సీజన్ స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం అవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో 24 గంటలు స్ట్రీమింగ్ అవుతుంది.