Bigg Boss Telugu 8 Launch Live: బిగ్‍బాస్ సీజన్ 8 లాంచ్.. హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది.. ప్రైజ్‍మనీ జీరోతో షురూ-bigg boss telugu 8 grand launch live updates nagarjuna as host this season contestants and guests special performances ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 Launch Live: బిగ్‍బాస్ సీజన్ 8 లాంచ్.. హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది.. ప్రైజ్‍మనీ జీరోతో షురూ

బిగ్‍బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ లైవ్ అప్‍డేట్లు

Bigg Boss Telugu 8 Launch Live: బిగ్‍బాస్ సీజన్ 8 లాంచ్.. హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది.. ప్రైజ్‍మనీ జీరోతో షురూ

05:40 PM ISTSep 01, 2024 10:28 PM Chatakonda Krishna Prakash
  • Share on Facebook

  • Bigg Boss Telugu 8 Grand Launch Live: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నేడు (సెప్టెంబర్ 1) మొదలైంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నేడు అట్టహాసంగా జరిగింది. హౌస్‍లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ఏడు జోడీలుగా ఉన్నారు. ఈ బిగ్‍‍బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ హైలైట్స్ ఇక్కడ చూడండి.

Sun, 01 Sep 202404:58 PM IST

ప్రైజ్‍మనీ జీరో.. కానీ

8వ సీజన్ ప్రైజ్‍మనీ జీరో అంటూ కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చారు బిగ్‍బాస్. అయితే, ఆట ఆడే కొద్ది అది పెరుగుతుందని అన్నారు. లిమిట్‍లెస్‍గా డబ్బు గెలిచే అవకాశం ఉందని చెప్పారు. కంటెస్టెంట్లు టాస్కులు చేసే కొద్దీ జీరో నుంచి ప్రైజ్‍మనీ పెరుగుతూ పోతుందని బిగ్‍బాస్ తెలిపారు.

Sun, 01 Sep 202404:57 PM IST

టెన్షన్ పెట్టిన అనిల్ రావిపూడి

తొలి రోజు ఓ కంటెస్టెంట్ బయటికి వెళ్లాలని అనిల్ రావిపూడి చెప్పారు. ఎక్కువ మంది నాగ మణికంఠ పేరు చెప్పారు. దీంతో మణికంఠ బాధపడ్డారు. అయితే, ఇది ప్రాంక్ అని అన్నారు అనిల్.

Sun, 01 Sep 202404:33 PM IST

గెస్టుగా అనిల్ రావిపూడి

బిగ్‍బాస్ గ్రాండ్ లాంచ్‍కు గెస్టుగా వచ్చారు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Sun, 01 Sep 202404:58 PM IST

14వ కంటెస్టెంట్‍గా నబీల్.. నైనికకు బడ్డీగా ..

వరంగల్‍కు చెందిన యూట్యూబర్ నబీల్ ఆఫ్రిది.. బిగ్‍బాస్ హౌస్‍లోకి 14వ కంటెస్టెంట్‍గా అడుగుపెట్టారు. డ్యాన్సర్ నైనిక, నబీల్ జోడీగా హౌస్‍లోకి వెళ్లారు.

Sun, 01 Sep 202404:14 PM IST

హౌస్‍లోకి నైనానిక

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో 13వ కంటెస్టెంట్‍గా అడుగుపెట్టారు డ్యాన్సర్ నైనిక. ఢీ షోతో ఈమె పాపులర్ అయ్యారు.

Sun, 01 Sep 202404:01 PM IST

తిరుమల వెంకన్నను చూసినట్లు

తిరుమలలో తిరుపతి వెంకన్నను చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అంటే అంతసేపు క్యూ కట్టి ఒక్కసారిగా చూస్తాం కదా అని యాంకర్ విష్ణు ప్రియ చెప్పింది.

Sun, 01 Sep 202403:58 PM IST

యాంకర్ విష్ణు ప్రియ ఎంట్రీ

పృథ్వీకి జోడీగా యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. నల్లంచు తెల్ల చీర పాటతో అదిరిపోయే డ్యాన్స్‌తో విష్ణు అదరగొట్టింది.

Sun, 01 Sep 202403:56 PM IST

లిమిట్‌లెస్ లవ్

11వ కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. హౌజ్‌లో లిమిట్‌లెస్‌గా ఏం కావాలని అతన్ని అడిగితే.. బయట నుంచి ఆడియెన్స్ లవ్ కావాలని చెప్పాడు.

Sun, 01 Sep 202403:48 PM IST

నో రేషన్

హౌజ్‌మేట్స్‌కు మరో పెద్ద షాక్ ఇచ్చాడు నాగార్జున. బ్యాడ్ న్యూస్ అని చెప్పి నో రేషన్ అన్నాడు నాగ్. అంటే ఏం తినాలంటే వాళ్లు ఆడి గెలిచి సంపాదించుకోవాలి అని నాగార్జున అన్నారు.

Sun, 01 Sep 202403:43 PM IST

నానితో ఆట

హౌజ్‌లోకి వెళ్లిన నాని, ప్రియాంక మూడు జోడీలకు టాస్క్ ఇస్తారు. కళ్లకు గంతలు క్టటుకుని ఒకరు గ్లాస్‌లో జ్యూస్ పిండాలి. వాళ్లను ఇంకొకరు డైరెక్ట్ చేయాలి.

Sun, 01 Sep 202403:37 PM IST

సూర్య ఎంట్రీ

ఇప్పుడు హౌజ్‌లోకి సూర్య వస్తున్నాడు అని నాగార్జున అన్నాడు. దాంతో నాని ఎంట్రీ ఇచ్చాడు. నాని ఏ సినిమా చేస్తే ఆ పాత్రలో ఉండిపోతాడు అని, సరిపోదా శనివారం సినిమాలో నాని సూర్యగా చేస్తున్నాడు అని నాగ్ చెప్పాడు. అదంతా మీ నుంచే నేర్చుకున్నాం అని నాని సమాధానం ఇచ్చాడు.

Sun, 01 Sep 202403:24 PM IST

సీతకు జోడీగా మణికంఠ

కిర్రాక్ సీతకు బడ్డీగా నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పుడే తన నాన్న చనిపోయాడని, ఆ తర్వాత తన తల్లి రెండో పెళ్లి చేసుకున్నట్లు మణికంఠ చెప్పాడు. తర్వాత కొన్నేళ్లకు తన తల్లి క్యాన్సర్‌తో మరణించినట్లు తెలిపాడు.

Sun, 01 Sep 202403:18 PM IST

నాగ్ కామెంట్స్

కిర్రాక్ సీత రాగానే.. కిర్రాక్ నీ పేరా.. లేక నీ పర్సనాలిటినా అని నాగార్జున అడిగారు. లేదు మనం చేసే పనులు కిర్రాక్ ఉండాలని అలా అని సీత చెప్పింది.

Sun, 01 Sep 202403:16 PM IST

బేబీ మూవీ నటి ఎంట్రీ

తొమ్మిదో కంటెస్టెంట్‌గా కిర్రాక్ సీతను ఏవీ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. కిర్రాక్ సీత బ్లాక్ బస్టర్ మూవీ బేబీలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది.

Sun, 01 Sep 202403:05 PM IST

టైటిల్ పట్టుకెళ్లిపోతా

నాతో ఫ్రెండ్లీగా ఉంటే ఓకే.. లేకుంటే టైటిల్ పట్టుకెళ్లిపోతా అని శేఖర్ బాషా చెప్పాడు. తర్వాత బేబక్క, శేఖర్ బాషా కలిసి హౌజ్‌లోకి వెళ్లిపోయారు. తన జోడీ ఎలా ఉంటుందంటే బక్కా.. బేబక్కా అని శేఖర్ బాషా అన్నాడు.

Sun, 01 Sep 202403:01 PM IST

బేబక్క జోడీగా శేఖర్ బాషా

బేబక్కకు బడ్డీగా ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. తన జీవితం గురించి ఏవీలో చెబుతూ అడుగుపెట్టాడు.

Sun, 01 Sep 202402:58 PM IST

బేబక్క ఎంట్రీ

హౌజ్‌లోకి యూట్యూబర్ బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది. ఫన్నీ ఏవీతో చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. రాగానే నాగార్జునను పొగడ్తలతో ముంచెత్తింది బేబక్క

Sun, 01 Sep 202402:51 PM IST

ఆర్జీవీ సర్‌ప్రైజ్

సోనియా ఆకులకు ఆర్జీవీ ద్వారా స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. సోనియా గురించి గొప్పగా చెబుతూ ఆర్జీవీ వీడియో ప్లే చేశారు.

Sun, 01 Sep 202402:50 PM IST

ఆర్జీవీ హీరోయిన్ ఎంట్రీ

హీరో ఆదిత్య ఓంకి బడ్డీగా ఆర్జీవీ హీరోయిన్‌ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. రాగానే తెలంగాణ స్లాంగ్‌తో అదరగొట్టింది. సోనియా దిశా, కరోనా వైరస్ సినిమాల్లో నటించింది.

Sun, 01 Sep 202402:45 PM IST

ఆదిత్య ఓం ఎంట్రీ

ఐదో కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓం ఏవీ ప్లే చేశారు. తన జీవితంలో జరిగిన మంచి చెడు విషయాలను చెప్పాడు ఆదిత్య. సినిమాల తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Sun, 01 Sep 202402:43 PM IST

నో కెప్టెన్సీ

నలుగురు కంటెస్టెంట్లకు నాగార్జున టాస్క్ ఇచ్చారు. అందులో బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఉంది. ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని చెబితే ప్రేరణ వెళ్లి సెలెక్ట్ చేస్తుంది. అందులో నో కెప్టెన్ అని రాసి ఉంటుంది. దాంతో సీజన్‌కే కెప్టెన్సీ లేదని నాగ్ చెప్పాడు.

Sun, 01 Sep 202402:35 PM IST

నానిని ఇరికించిన నాగ్

బిగ్ బాస్ స్టేజీపైకి నాని, ప్రియాంక మోహన్ తర్వాత ఎంట్రీ ఇస్తారు. ప్రియాంక ముందు నానిని ఇరికిస్తాడు నాగార్జున. ఇప్పటివరకు 29 మంది హీరోయిన్లతో వర్క్ చేశావు. ప్రియాంకకు ఎన్ని మార్కులు ఇస్తావని నాగ్ అడిగితే.. అమ్మో నన్ను ఇరికించారు కదా అని నాని అన్నాడు.

Sun, 01 Sep 202402:31 PM IST

రానాతో టాస్క్

హౌజ్‌లోకి రానా, నివేదా థామస్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడున్న కంటెస్టెంట్స్‌కు వారితో టాస్క్ ఆడించారు. బాటిల్‌ను ఫ్లిప్ చేసి పక్కన టేబుల్ పై ఉన్న ప్లేట్ జరపాలి. చాలా ఫన్నీగా ఈ గేమ్ ఆడారు.

Sun, 01 Sep 202402:22 PM IST

పదో తరగతి ఫెయిల్

హౌజ్‌లోకి రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చాడు. రాగానే తన సినిమాల గురించి నాగ్ అడిగారు. కొత్తగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నట్లు చెప్పాడు రానా. 35 చిన్న కథ కాదు మూవీ గురించి రానా తెలిపాడు. టెన్త్ క్లాస్‌లో 35 మార్కులు రాక ఫెయిల్ అయినట్లు తెలిపాడు రానా.

Sun, 01 Sep 202402:10 PM IST

హీరోయిన్ ఎంట్రీ

అభయ్ నవీన్‌కు బడ్డీగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ క్వాలిటీస్‌లో వాగుడు కాయ్, తెలివి, ఫైటర్ అని వచ్చాయి.

Sun, 01 Sep 202402:05 PM IST

మూడో కంటెస్టెంట్‌ ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మూడో కంటెస్టెంట్‌గా సినీ నటుడు అభయ్ నవీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అభయ్ నవీన్‌ది సిద్ధిపేటకు చెందిన అతని పేరు విష్ణు అని చెప్పాడు. తనకు సంబంధించిన ఏవీని ప్లే చేశారు. ఇతను పెళ్లి చూపులు మూవీతో పాపులర్ అయ్యాడు.

Sun, 01 Sep 202401:58 PM IST

మొదటి పెయిర్

హౌజ్‌లోకి మొదటి జోడీ ఎంట్రీ ఇచ్చింది. యశ్మీ, నిఖిల్ వెళ్లి హౌజ్ ను చుట్టారు.

Sun, 01 Sep 202401:54 PM IST

విలన్‌గా పేరు తెచ్చుకోవాలి

కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో లేడి విలన్‌గా చేసిన యశ్మీకి జోడీగా సీరియల్ హీరో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. తనకు విలన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని తెలిపాడు నిఖిల్.

Sun, 01 Sep 202401:52 PM IST

సీరియల్ హీరో ఎంట్రీ

ఈ సీజన్‌లో సోలో ఎంట్రీ లేదని, తన బడ్డీస్‌ను సెలెక్ట్ చేసుకోవాలని యశ్మీకి నాగ్ చెప్పారు. దాంతో ఒక రెడ్ కలర్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంది. యశ్మీ. దాని నుంచి సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు.

Sun, 01 Sep 202401:49 PM IST

బిర్యానీ టెస్ట్

యశ్మీకి బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దాంతో ఆమెకు బిర్యానీ టాస్క్ ఇచ్చారు. ఐదు బిర్యానీలు ఉంచి.. అవి ఏ రకమైన బిర్యానీలో గెస్ చేయమని నాగార్జున చెప్పారు. కానీ, యష్మీ అన్ని టేస్ట్ చేసి తప్పుగా చెప్పింది.

Sun, 01 Sep 202401:47 PM IST

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లక్కీ

యశ్మీని లవర్ ఉన్నాడా అని నాగార్జున అడిగారు. దానకి గతంలో ఉన్నాడని, ఇప్పుడు లేడని, తను విడిపోడానికి తానే కారణం అని యశ్మీ గౌడ చెప్పింది. దాంతో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చాలా లక్కీ అని నాగార్జున అన్నాడు.

Sun, 01 Sep 202401:44 PM IST

ఫస్ట్ కంటెస్టెంట్ ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఫస్ట్ కంటెస్టెంట్‌గా యశ్మీ గౌడ ఎంట్రీ ఇచ్చింది. రాగానే నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పి రెడ్ రోజెస్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ పూలను తనకు ఇవ్వాల్సిందిగా కోరితే.. నాగార్జున అలాగే చేశాడు.

Sun, 01 Sep 202401:42 PM IST

హౌజ్ గురించి చెప్పిన నాగ్

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ హౌజ్ ఎలా ఉంటుందో నాగార్జున చెప్పారు. అందులో కంటెస్టెంట్ల ఆటలు, పాటలు, గొడవలు ఎలా ఉంటాయో వివరించారు.

Sun, 01 Sep 202401:39 PM IST

అడవిలా హౌస్

బిగ్‍బాస్ సీజన్ 8 హౌస్‍ను ప్రేక్షకులకు సూచించారు నాగార్జున. ఈ సీజన్ కోసం హౌస్.. అడవి థీమ్‌లో ఉంది. జంవుతుల బొమ్మల థీమ్‍తో రూమ్‍లు, కొన్ని వస్తువులు ఉన్నాయి. పచ్చదనం కూడా ఉంది.

Sun, 01 Sep 202401:33 PM IST

నాగార్జున గ్రాండ్ ఎంట్రీ

బిగ్‍బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్‍లో నాగార్జున ఎంట్రీ అదిరింది. దేవర ఫియర్ సాంగ్‍కు డ్యాన్స్‌తో ఆయన ఎంట్రీ ఇచ్చారు. లిమిట్‍లెస్ అంటూ ఈ షోను మొదలుపెట్టేశారు.

Sun, 01 Sep 202401:31 PM IST

బిగ్‍బాస్ 8 షురూ

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ మొదలైంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభమైంది.

Sun, 01 Sep 202401:03 PM IST

లిమిట్‍లెస్ అంటూ..

బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్ లిమిట్‍లెస్ అంటూ కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్నారు హోస్ట్ నాగార్జున. ఈ సీజన్‍లో ఫన్, ఎంటర్‌టైన్‍మెంట్, ట్విస్టులు, టర్నులకు లిమిట్ ఉండదని చెబుతూ వస్తున్నారు. హైప్ ఉన్న ఈ సీజన్ కాసేపట్లో గ్రాండ్ లాంచ్‍తో షురూ కానుంది.

Sun, 01 Sep 202412:45 PM IST

బిగ్‍బాస్‍లో సోషల్ మీడియాలో పోస్టులు

8వ సీజన్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే పోస్టులను బిగ్‍బాస్‍లో చూపిస్తామని హోస్ట్ నాగార్జున చెప్పారు. తనకు నచ్చిన పోస్టులను బిగ్‍బాస్‍లో ప్రదర్శిస్తానని అన్నారు.

Sun, 01 Sep 202412:25 PM IST

నేడు హౌస్‍లోకి 14 మంది

బిగ్‍బాస్ 8వ సీజన్ హౌస్‍లోకి నేడు 14 మంది కంటెస్టెంట్లు వెళ్లనున్నారు. కంటెస్టెంట్ల ఇంట్రడక్షన్లు, డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఉండనుంది.

Sun, 01 Sep 202411:59 AM IST

మూడు బెడ్రూమ్‍లు

బిగ్‍బాస్ తెలుగు 8 హౌస్‍లో మూడు బెడ్రూమ్‍లు ఉంటాయని తెలుస్తోంది. జంతువుల పేర్లతో ఉండే ఈ రూమ్‍ల డిజైన్, అందులోని వస్తువులు కూడా అదే విధంగా ఉంటాయని లీకుల ద్వారా బయటికి వచ్చింది.

Sun, 01 Sep 202411:44 AM IST

మొదట్లోనే ట్విస్ట్

బిగ్‍బాస్ 8వ సీజన్‍లో తొలి వారమే ట్విస్ట్ ఉంటుందని ప్రోమో ద్వారా అర్థమవుతోంది. హౌస్‍లోకి వెళ్లిన ఓ కంటెస్టెంట్‍ బయటికి వెళ్లాలని.. లక్కీ డ్రాలో వారి ప్లేస్‍లో ఇంకొకరు వస్తారని గెస్టుగా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పడం ప్రోమోలో ఉంది.

Sun, 01 Sep 202411:11 AM IST

కంటెస్టెంట్లు ఎవరు?

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో కంటెస్టెంట్లుగా ఎవరు రానున్నారనేది ఆసక్తికరంగా మారింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍లో కంటెస్టెంట్లను నాగార్జున పరిచయం చేయనున్నారు. ఆ తర్వాత వారు హౌస్‍లోకి వెళ్లనున్నారు. యాంకర్ విష్ణుప్రియ, నటుడు అభయ్ నవీన్, టీవీ యాక్టర్లు నిఖిల్ మలియక్కల్, నాగమణికంఠ, ఆర్జే శేఖర్ బాషా, యూట్యూబర్ బెజవాడ బేబక్క సహా మరికొందరు పేర్లు లీకుల ద్వారా బయటికి వచ్చాయి. కంటెస్టెంట్లు ఎవరో గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍లో తెలిసిపోనుంది.

Sun, 01 Sep 202412:12 PM IST

నాని, రానా సహా గెస్టులు వీరే

సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్ కోసం బిగ్‍బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍లో కనిపించనున్నారు హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్. గతంలో ఓ సీజన్‍లో బిగ్‍బాస్‍కు హోస్ట్‌గానూ నాని చేశారు. 35 - చిన్న కథకాదు మూవీ ప్రమోషన్ కోసం నివేదా థామస్, రానా దగ్గుబాటి వచ్చారు. ఈ చిత్రంలో నివేదా లీడ్ రోల్ చేస్తుండగా.. రానా సమర్పిస్తున్నారు. స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ లాంచ్ ఈవెంట్‍కు గెస్టుగా రానున్నారు.

Sun, 01 Sep 202410:50 AM IST

సోలో ఎంట్రీ లేదు: హోస్ట్ నాగార్జున

బిగ్‍బాగ్ 8 సీజన్‍కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు. గ్రాండ్ లాంచ్ ప్రోమోను నేడు రివీల్ చేసింది స్టార్ మా ఛానెల్. ఈ సీజన్ బిగ్‍బాస్ హౌస్‍లోకి కంటెస్టెంట్లు ఒంటరిగా వెళ్లకూడదని నాగార్జున చెప్పారు. జోడీగానే అడుగుపెట్టాలన్నారు. సోలో ఎంట్రీ లేదని చెప్పారు. ఇది ఇంట్రెస్టింగ్‍గా ఉండనుంది.

Sun, 01 Sep 202410:46 AM IST

బిగ్‍బాస్ గ్రాండ్ లాంచ్.. టైమ్ ఇదే

చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నేడు (సెప్టెంబర్ 1) మొదలుకానుంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నేటి సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.