Bigg Boss Telugu 8: నువ్వు బిగ్‍బాస్‍కు పనికిరావు: మణికంఠపై పృథ్విరాజ్ ఫైర్: వీడియో-bigg boss telugu 8 today promo your unfit for the show says prithviraj on naga manikanta during nominations video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: నువ్వు బిగ్‍బాస్‍కు పనికిరావు: మణికంఠపై పృథ్విరాజ్ ఫైర్: వీడియో

Bigg Boss Telugu 8: నువ్వు బిగ్‍బాస్‍కు పనికిరావు: మణికంఠపై పృథ్విరాజ్ ఫైర్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 04, 2024 04:45 PM IST

Bigg Boss Telugu 8 Today Promo: బిగ్‍బాస్ 8లో నామినేషన్ల సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నామినేషన్ల ప్రక్రియ మూడో ఎపిసోడ్‍కు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా మణింకంఠపై పృథ్విరాజ్ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.

Bigg Boss Telugu 8: నువ్వు బిగ్‍బాస్‍కు పనికిరావు: మణికంఠపై పృథ్విరాజ్ ఫైర్: వీడియో
Bigg Boss Telugu 8: నువ్వు బిగ్‍బాస్‍కు పనికిరావు: మణికంఠపై పృథ్విరాజ్ ఫైర్: వీడియో

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో తొలి నామినేషన్లలోనే రచ్చరచ్చ జరుగుతోంది. కొందరు కంటెస్టెంట్లు మాటల యుద్ధానికి దిగారు. దీంతో తొలి వారం ఎలిమినేషన్ కోసం చేపట్టిన నామినేషన్ల ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 4) మూడో రోజు ఎపిసోడ్‍లోనూ కొనసాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమోలను స్టార్ మా ఛానెల్ తీసుకొచ్చింది. నాగ మణికంఠను ఎక్కువ మంది టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఈ తరుణంలో పృథ్విరాజ్, మణికంఠ మధ్య వాగ్వాదం జరిగింది.

సింపతీ కోసం ప్రయత్నిస్తున్నావ్

తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి బిగ్‍బాస్ హౌస్‍లో అడుగుపెట్టినప్పటి నుంచే నాగ మణికంఠ చెబుతూ వస్తున్నారు. నామినేషన్లలోనూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే, ఈ విషయంపై పృథ్విరాజ్ ఫైర్ అయ్యారు. సింపతీ కోసం ప్రయత్నిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మణికంఠను పృథ్విరాజ్ నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల వార్ జరిగింది. “అరవకు నా మీద” అని పృథ్వి అంటే.. అరుస్తా అని ముఖం మీదే చెప్పేశారు మణి. బిగ్‍బాస్ హౌస్‍లో ఉండేందుకు పనికి రావంటూ మణికంఠ గురించి పృథ్వి అన్నారు. “నువ్వు సింపతీకార్డ్ ప్లేచేస్తున్నావ్. హౌస్‍లో ఉండేందుకు నువ్వు అన్‍ఫిట్. నువ్వో నెగెటివ్ పర్సన్” అని పృథ్వి అరిచారు. నేటి ఎపిసోడ్‍కు సంబంధించిన రెండో ప్రోమోలో వీరి గొడవ ఉంది.

అభయ్ నవీన్ కూడా..

మణికంఠను టార్గెట్ చేసినట్టుగా అభయ్ నవీన్ కూడా పంచ్ వేశారు. తాను గేమ్ ఆడేందుకే వచ్చానని మణికంఠ అంటే అభయ్ మధ్యలో కల్పించుకున్నారు. ఇది గేమ్ ప్లాన్ అని ఒప్పుకున్నావంటూ వెటకారంగా చప్పట్లుకొట్టారు అభయ్.

నా క్యారెక్టర్ ఇదే..

హౌస్‍లో ఏం చేసినా తాను చూస్తానని, అది తన పాయింట్ కాకపోయినా మాట్లాడతానని అభయ్ నవీన్ చెప్పటంతో ఈ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత బేబక్కను పృథ్వి నామినేట్ చేశారు. ఇది నాకౌట్ గేమ్ అని.. పోతే తర్వాతి వారంలో పోతామని పృథ్వి చెప్పారు. అయితే, తన క్యారెక్టర్ ఇదేనని బేబక్క కుండబద్దలు కొట్టారు. తాను తనలానే ఉంటానని చెప్పేశారు.

లాజిక్‍తో మాట్లాడాలని, ప్రూఫ్‍ ఉండాలంటూ ఆదిత్య ఓం చెప్పుకొచ్చారు. ప్రేరణ, సీత మధ్య కూడా వాదన గట్టిగానే జరిగింది. మామూలుగా చెప్పిన విషయంపై నీకెందుకు బాధ అని ప్రేరణ అంటే.. అందరి విషయం కాదని, తాను హర్ట్ అయ్యానని సీత చెప్పారు.

ఎవరినైనా, ఏదైనా అనే ముందు వాడే పదాలు సరిగా ఉండాలని సూచన చేశారు చీఫ్‍గా ఉన్న నిఖిల్ మలియక్కల్. సోనియా తన మార్క్ దూకుడు చూపారు. నేటి ఎపిసోడ్‍తో బిగ్‍బాస్ 8 తొలి వారం నామినేషన్ల ప్రక్రియ ఫినిష్ అవుతుంది. ఫస్ట్ ఎలిమినేషన్ కోసం సోనియా, విష్ణుప్రియ, శేఖర్ బాషా, బేబక్క, మణికంఠ, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు.

కర్రీల విషయంలో కిర్రాక్ సీత, బేబక్క మధ్య నామినేషన్లలోనూ వాదన జరిగింది. ఎలా మాట్లాడతావో చూద్దామని ఈ మూడు రోజులు చూశానని విష్ణుప్రియతో మణికంఠ అన్నారు. “అందుకు ఈ మూడు రోజులు నాతో తిరిగావా” అని విష్ణుప్రియ అన్నారు. ప్రతీదాన్ని రాజకీయం చేసేందుకు మణికంఠ ప్రయత్నిస్తున్నారని శేఖర్ బాషా అన్నారు. ఈ తతంగం నేటి తొలి ప్రోమోలో ఉంది.