Bigg Boss 8 Telugu Day 2 Highlights: గొడవలతో హాట్‍హాట్‍గా సాగిన ఈ సీజన్ ఫస్ట్ నామినేషన్స్.. ఎవరు నామినేట్ అయ్యారంటే..-bigg boss 8 telugu day 2 highlights nominations for first week elimination manikanta bebakka and prithvi in the list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Day 2 Highlights: గొడవలతో హాట్‍హాట్‍గా సాగిన ఈ సీజన్ ఫస్ట్ నామినేషన్స్.. ఎవరు నామినేట్ అయ్యారంటే..

Bigg Boss 8 Telugu Day 2 Highlights: గొడవలతో హాట్‍హాట్‍గా సాగిన ఈ సీజన్ ఫస్ట్ నామినేషన్స్.. ఎవరు నామినేట్ అయ్యారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 03, 2024 11:32 PM IST

Bigg Boss 8 Telugu Day 2 Highlights: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో తొలి నామినేషన్లు జరిగాయి. ఈ సందర్భంగా కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి. ఈ ప్రక్రియ హాట్‍హాట్‍గా సాగింది. తొలి వారం నామినేషన్లలో ఎవరు ఉన్నారో ఇక్కడ చూడండి.

Bigg Boss 8 Telugu Day 2 Highlights: గొడవలతో హాట్‍హాట్‍గా సాగిన ఈ సీజన్ ఫస్ట్ నామినేషన్స్.. ఎవరు నామినేట్ అయ్యారంటే..
Bigg Boss 8 Telugu Day 2 Highlights: గొడవలతో హాట్‍హాట్‍గా సాగిన ఈ సీజన్ ఫస్ట్ నామినేషన్స్.. ఎవరు నామినేట్ అయ్యారంటే..

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో తొలి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల తంతు జరిగింది. హౌస్‍లో రెండో రోజు చాలా హీట్ మధ్య ఈ ప్రక్రియ సాగింది. వాగ్వాదాలు, గొడవలతో రంజుగా నామినేషన్లు జరిగాయి. చీఫ్‍లు కావడంతో నిఖిల్, నైనిక, యష్మి గౌడ సేఫ్‍ జోన్‍లో నిలువగా.. మిగిలిన వారి మధ్య నామినేషన్ల పోరు జరిగింది. రెండో రోజు ఎలా సాగిందంటే..

యష్మి గౌడను చీఫ్‍గా నిఖిల్, నైనిక సెలెక్ట్ చేయడంపై సోనియా వాదన కొనసాగించింది. ఈ విషయంలో వారి మధ్య వాదన కొనసాగింది. ఆ తర్వాత రెండో రోజు ఆట మొదలైంది. పుష్ప మూవీలోని ‘ఏ బిడ్డ.. ఇది నా అడ్డా’ పాటతో హౌస్‍లో రెండో రోజు షురూ అయింది. కంటెస్టెంట్లు డ్యాన్స్ చేశారు. మధ్యాహ్నం మణికంఠ నిద్రించటంతో కుక్క అరుపును బిగ్‍బాస్ ప్లేచేశారు. ఇంకోసారి ఇలా పడుకోవద్దని అతడిని హౌస్‍మేట్స్ హెచ్చరించారు.

హౌస్‍మేట్స్‌కు పనులను అప్పగించారు చీఫ్స్ నిఖిల్, నైనిక, యష్మి. వంట విషయంలో బేబక్క పెట్టిన రూల్‍పై కిర్రాక్ సీత అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులను కంట్రోల్ చేసే రేషన్ మేనేజింగ్ సోనియాకు నిఖిల్ అప్పగించారు. కిచెన్‍లో వద్దని నిఖిల్ అనడంతో కిర్రాక్ సీత కోపం వ్యక్తం చేశారు.

చీఫ్‍లకే ఆ అధికారం

ఆ తర్వాత బిగ్‍బాస్ తెలుగు 8లో ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. చీఫ్‍లుగా ఉన్న నిఖిల్, నైనిక, యష్మి గౌడకు బిగ్‍బాస్ హారాలు ఇచ్చారు. ఇవి చీఫ్‍ల అధికారాలకు చిహ్నంగా ఉంటాయని చెప్పారు. గద్దెలపై కూర్చోవాలని సూచించారు. చీఫ్‍లు కావడంతో నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. ఎవరిని నామినేట్ చేయాలో ఆ శక్తిని చీఫ్‍లకే బిగ్‍బాస్ ఇచ్చారు. కంటెస్టెంట్లు ఒక్కొక్కరు వచ్చి.. ఇంట్లో ఉండేందుకు అనర్హులు అని ఎవరని అనుకుంటున్నారో ఇద్దరి పేర్లను చెప్పి, అందుకు కారణాలు చెప్పాలని బిగ్‍బాస్ సూచించారు. వారి ఫొటోలను రాయిపై అతికించి, నామినేట్ చేయాలని వివరించారు. ఆ తర్వాత ముగ్గురు చీఫ్‍ల్లో ముందుగా కత్తి తీసుకునే వారు.. కంటెస్టెంట్ చెప్పిన ఆ ఇద్దరిలో ఒకరి ఫొటోపై కత్తిగుచ్చి నామినేట్ చేయాలని చెప్పారు.

సోనియా, ప్రేరణ ఫైట్

బేబక్క, ప్రేరణను సోనియా ఆకుల నామినేట్ చేశారు. కిచెన్‍‍లో విషయంలో బేబక్క బాధ్యతరాహిత్యంగా ఉన్నారని చెప్పారు. కుక్కర్ గొడవ ఇక్కడ కూడా కొనసాగింది. ప్రేరణ తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇతరులకు అనసరమైన సలహాలు ఇస్తూ.. జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో సోనియా, ప్రేరణ మధ్య గొడవ సాగింది. ప్రవర్తన విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరిలో బేబక్కను నామినేట్ చేశారు యష్మి.

మణికంఠ, బేబక్కను నబీల్ నామినేట్ చేశాడు. తనతో మణికంఠ మాట్లాడడం లేదని చెప్పారు. దీనిని డిఫెండ్ చేసుకున్నాడు మణికంఠ. బేబక్క కూడా తనకు కనెక్ట్ కాలేదని చెప్పారు. ఈ ఇద్దరిలో మణికంఠ నామినేషన్‍ను యష్మి ఫైనల్ చేశారు.

శేఖర్ వర్సెస్ మణికంఠ

మణికంఠ, బేబక్కను శేఖర్ బాషా నామినేట్ చేశారు. గేమ్‍ను, కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని శేఖర్ అన్నారు. తాను ఈ విషయాన్ని అంగీకరించనని వాదించారు మణి. ఇద్దరూ బాగా వాగ్వాదం చేసుకున్నారు. కిచెన్ విషయంలో ఇతరులకు బేబక్క రూల్స్ పెడుతున్నారని శేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మణికంఠను నామినేట్ చేశారు చీఫ్ నైనిక.

సీతతో అఖిల్ గొడవ

పృథ్విరాజ్, నబీల్‍ను బేబక్క నామినేట్ చేశారు. పనుల్లో పృథ్వి హెల్ప్ చేయడం లేదని ఆమె కారణం చెప్పారు. ఈ విషయంలో పృథ్వి వాదించారు. అతడికి మద్దతుగా సీత మాట్లాడారు. దీంతో మధ్యలోకి రావొద్దని చీఫ్ నిఖిల్ అన్నారు. దీంతో తన ఇష్టమంటూ సీత వాదించారు. ఇలా నిఖిల్, సీత మధ్య గొడవ జరిగింది. గట్టిగా అరుచుకున్నారు. వారికి బేబక్క సర్దిచెప్పారు. నబీల్ యాక్టివ్‍గా లేరని బేబక్క కారణం చెప్పారు. తాను దీన్ని అంగీకరించలేదని నబీల్ వాదించారు. పృథ్విరాజ్‍ నామినేషన్‍ను నిఖిల్ ఫైనల్ చేశారు.

నామినేట్ అయింది వీళ్లే..

మొత్తంగా ఇప్పటి వరకు తొలి వారం నామినేషన్లలో బేబక్క, మణికంఠ, పృథ్విరాజ్ నిలిచారు. ఈ నామినేషన్ల ప్రక్రియ మూడో ఎపిసోడ్‍లోనూ కొనసాగనుంది. ఇంకా ఏడుగురు తమ నామినేషన్లను చెప్పాల్సి ఉంది. అయితే, సోనియా, విష్ణుప్రియ, శేకర్ బాషా కూడా నామినేషన్లలో ఉంటారని లైవ్ ద్వారా స్పష్టమైంది. దీంతో తొలివారం ఎలిమినేషన్‍కు బేబక్క, మణికంఠ, పృథ్విరాజ్, సోనియా, విష్ణుప్రియ, శేకర్ బాషా నామినేట్ అయ్యారు. నామినేషన్ల ప్రక్రియ రేపటి ఎపిసోడ్‍లో కొనసాగుతుంది.