Bigg Boss 8 Telugu: యాటిట్యూడ్ చూపించొద్దు: యష్మిపై మణికంఠ ఫైర్.. నబీల్, ప్రేరణ గొడవ.. నామినేషన్లలో ఉన్నది వీళ్లే-bigg boss 8 telugu day 15 roundup fight between yashmi and manikanta check third week nominations list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: యాటిట్యూడ్ చూపించొద్దు: యష్మిపై మణికంఠ ఫైర్.. నబీల్, ప్రేరణ గొడవ.. నామినేషన్లలో ఉన్నది వీళ్లే

Bigg Boss 8 Telugu: యాటిట్యూడ్ చూపించొద్దు: యష్మిపై మణికంఠ ఫైర్.. నబీల్, ప్రేరణ గొడవ.. నామినేషన్లలో ఉన్నది వీళ్లే

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 16, 2024 11:33 PM IST

Bigg Boss 8 Telugu Day 15: మూడో వారం నామినేషన్ల తంతు కూడా గొడవ మధ్య సాగింది. యష్మి, మణికంఠ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నలుగురు కంటెస్టెంట్లు యష్మిని నామినేట్ చేశారు. ఈ వారం నామినేషన్లలో ఎవరెవరు ఉన్నారంటే..

Bigg Boss 8 Telugu: యాటిట్యూడ్ చూపించొద్దు: యష్మిపై మణికంఠ ఫైర్.. నబీల్, ప్రేరణ గొడవ.. నామినేషన్లలో ఉన్నది వీళ్లే
Bigg Boss 8 Telugu: యాటిట్యూడ్ చూపించొద్దు: యష్మిపై మణికంఠ ఫైర్.. నబీల్, ప్రేరణ గొడవ.. నామినేషన్లలో ఉన్నది వీళ్లే

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో మూడో వారం షురూ అయింది. నేటి సోమవారం (సెప్టెంబర్ 16) నామినేషన్ల ప్రక్రియ సాగింది. బేబక్క, శేఖర్ బాషా రెండు వారాల్లో ఎలిమినేట్ కాగా హౌస్‍లో 12 మంది ఉన్నారు. వారి మధ్య నామినేషన్ల తంతు ఎప్పటిలాగానే హాట్‍గా సాగింది. చీఫ్ పోస్ట్ కోల్పోయిన యష్మి తొలిసారి నామినేషన్లకు రాగా.. ఎక్కువ మంది టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు చీఫ్‍ల్లో ఒకరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

యష్మి ప్రవర్తన బాగోలేదంటూ..

చీఫ్‍లు అయిన అభయ్, నిఖిల్‍ను ముందుగా నామినేషన్ల ప్రక్రియ నుంచి పక్కన పెట్టారు బిగ్‍బాస్. ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఇది నడిచింది. కారణాలు చెప్పి తలపై చెత్త పోసి హౌస్‍మేట్లను నామినేట్ చేయాలని బిగ్‍బాస్ ఆదేశించారు. ముందుగా యష్మిని నామినేట్ చేశారు సీత. ఆమె ప్రవర్తన నచ్చలేదని చెప్పారు. పృథ్విని ఆ తర్వాత సీత నామినేట్ చేశారు. ప్రేరణ, యష్మిని విష్ణుప్రియ నామినేట్ చేశారు. యష్మి ప్రవర్తన, గేమ్ ప్లే సరిగా లేదని విష్ణు కారణం చెప్పారు. మణికంఠ కూడా యష్మిని నామినేట్ చేసి ఇలాంటి విషయాలే చెప్పారు. మొత్తంగా యష్మి ప్రవర్తనపై ఉన్న అసంతృప్తిని వెల్లడించారు.

మణికంఠ, యష్మి ఫైట్

మణికంఠ ముందుగా యష్మిని నామినేట్ చేశారు. గత నామినేషన్ల సమయంలో పక్షపాతంతో ఉన్నట్టు అనిపించిందని, చీఫ్‍గా, సంచాలక్‍గా ఉన్న సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావని అనిపించిందని యష్మితో మణి చెప్పారు. మైక్రో మేనేజ్‍మెంట్ చేస్తున్నావని అన్నారు. చీఫ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటూ గట్టిగట్టిగా అరిచారు యష్మి.

దీంతో మణికంఠ కూడా వినాలంటూ అరిచారు. “నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నా. నేను మాట్లాడేటప్పుడు వినండి. నేను మంచిగా మాట్లాడా. యాటిట్యూడ్ చూపించొద్దు” అని మణికంఠ అన్నారు. సంబంధం లేకున్నా ప్రతీ విషయంలో దూరిపోతున్నారని, ఒత్తిడి తెస్తున్నారని మణి చెప్పారు. తాను కరెక్ట్‌గానే ఉన్నానని యష్మి సర్దిచెప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగింది. మణికి క్లారిటీ లేదని యష్మి చాలాసార్లు అన్నారు.

ఫ్రెండ్‍గా డ్రామా చేశావని మణి గురించి యష్మి చెప్పారు. ఫేస్ అంటూ అరిచారు. వాగ్వాదంలో ఓ అభ్యంతరకర వ్యాఖ్య చేశారు యష్మి. దమ్ము లేదా అంటూ పొగరుగా కామెంట్లు చేశారు. ఇద్దరి మధ్య ఫైట్ విపరీతంగా జరిగింది. పృథ్విని కూడా మణి నామినేట్ చేశారు. తన వంతు వచ్చినప్పుడు మణికంఠను యష్మి నామినేట్ చేశారు. తాను హౌస్‍లో ఉన్నంత కాలం మణిని నామినేట్ చేస్తూనే ఉంటానని అన్నారు.

గట్టిగా అరుచుకున్న నబీల్, ప్రేరణ

నైనికను సోనియా నామినేట్ చేశారు. చీఫ్‍గా ఫెయిలయ్యావని గతంలోనే చెప్పానని, మళ్లీ తప్పులు చేశావనేలా సోనియా అన్నారు. చాలా ఓవర్ కాన్ఫిడెంట్‍గా ఉన్నారని విమర్శించారు. నబీల్, ప్రేరణ మధ్య కూడా గొడవ గట్టిగానే జరిగింది. ఓ దశలో ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. గట్టిగా అరవాలంటే నేనూ చేస్తానంటూ నబీల్ మొత్తుకున్నారు. ఇద్దరూ కాస్త వింతగా ప్రవర్తించారు.

నామినేషన్ల ప్రక్రియ ఫినిష్

మిగిలిన కొందరు కంటెస్టెంట్ల మధ్య కూడా వాదనలు ఎక్కువగానే జరిగాయి. గత రెండు వారాల్లో నామినేషన్లు రెండు ఎపిసోడ్లలో సాగాయి. ఈసారి సోమవారం ఎపిసోడ్‍లోనే ఫినిష్ అయ్యాయి. తొలిసారి యష్మి నామినేషన్లలోకి రాగా.. నలుగురు ఆమెను నామినేట్ చేశారు.

చీఫ్‍లకు ట్విస్ట్

రెండు క్లాన్‍లు సమానంగా ఉన్నందుకు చీఫ్‍లుగా ఉన్న నిఖిల్, అభయ్‍లో ఒకరు నామినేషన్లలోకి రావాలని బిగ్‍బాస్ చెప్పారు. దీంతో తానే నామినేట్ అవుతానని అభయ్ చెప్పారు.

నామినేషన్లలో వీరే

బిగ్‍బాస్ 8 మూడో వారం ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది నామినేషన్లలో ఉన్నారు. యష్మి గౌడ, నైనిక, పృథ్విరాజ్, ప్రేరణ, మణికంఠ, కిర్రాక్ సీత, విష్ణుప్రియ, అభయ్ నామినేషన్లలో ఉన్నారు.