Brahmamudi September 17th Episode: బ్రహ్మముడి- మామను నిలదీసిన అపర్ణ- అమ్మమ్మకు తలొంచని కావ్య- కాళ్లు పట్టుకుంటానన్న రాజ్-brahmamudi serial september 17th episode kavya rejects indiradevi ple aparna ask seetharamayya brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 17th Episode: బ్రహ్మముడి- మామను నిలదీసిన అపర్ణ- అమ్మమ్మకు తలొంచని కావ్య- కాళ్లు పట్టుకుంటానన్న రాజ్

Brahmamudi September 17th Episode: బ్రహ్మముడి- మామను నిలదీసిన అపర్ణ- అమ్మమ్మకు తలొంచని కావ్య- కాళ్లు పట్టుకుంటానన్న రాజ్

Sanjiv Kumar HT Telugu
Sep 17, 2024 07:12 AM IST

Brahmamudi Serial September 17th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో కావ్య వెళ్లడం కరెక్టే అని చెప్పిన అపర్ణ అత్తమామలను నిలదీస్తుంది. కావ్య వెళ్లకుండా ఎందుకు ఆపలేకపోయారని అంటుంది. కావ్య ఇంటికి వెళ్లి పిలుస్తారు సీతారామయ్య, ఇందిరాదేవి. కానీ, కావ్య రాదు.

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఆత్మాభిమానం దెబ్బ తిని కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని అపర్ణకు స్వప్న చెబుతుంది. దాంతో కూలపడిపోయినట్లు అవుతుంది అపర్ణ. అందరూ పట్టుకోబోతుంటే ఆపుతుంది. కావ్య మంచి పని చేసింది. నా కోడలు అంటే ఆత్మాభిమానం కలది అని అపర్ణ అంటుంది.

పరువు పోకుండా కాపాడింది

భర్త మనసులో ప్రేమ లేదని చెబితే.. నువ్వెంత నీ లెక్కెంత అని పౌరుషంతో వెళ్లింది అని అపర్ణ అంటుంది. ఏ పౌరుషం వదినా.. అప్పటికీ రాజ్‌ను క్షమించమని అడగమని మా అమ్మ చెబుతూనే ఉంది. తన తప్పు ఏం లేదని చెప్పి వెళ్లింది అని రుద్రాణి అంటుంది. శభాష్. దటీజ్ కావ్య. తనేం తప్పు చేసిందని క్షమించమని అడగమన్నారు అత్తయ్య. తను కంపెనీ పరువు పోకుండా కాపాడటానికి వెళ్లింది. ఆడదానిగా ఇంత అనుభవం ఉన్న మీరు చెప్పాల్సిన మాటల ఇవి అని అపర్ణ అంటుంది.

వీడు తెగేదాక లాగుతున్నాడు. ఈ రుద్రాణి అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు. కావ్య అన్న మాట మీదే నిలబడింది. ఇదెక్కడికి దారితీస్తుందో అని రాజీ చేద్దామని అలా చెప్పాను అని ఇందిరాదేవి అంటుంది. రాజీ పడి బతకడానికి అది మీ పెద్ద కోడలు కాదత్తయ్యా.. నా కోడలు. నేనంటే మీ కొడుకు చేసిన దానికి రాజీ పడి, గొంతులోనే బాధను నిలదొక్కుకని బతుకుతున్నాను. నీతిగా నిజాయితీగా బతికే నా కోడలు రాజీ పడి క్షమించమని అడగనమడమేంటీ అని అపర్ణ అంటుంది.

అది ఒకవేళ క్షమించమని అడిగితే.. నేనే దాని చెంప పగులగొట్టుండే దాన్ని అని అపర్ణ అంటుంది. వదినా.. ఇలాగే నీతి, నిజాయితీ అని నిన్ను బోల్తా కొట్టించింది. తనకు ఏ ఫోన్ రాలేదు. నీ ముందు డ్రామా చేసింది. రాహుల్‌ను కంపెనీ నుంచి దూరం చేయడానికే ఇలా చేసింది అని రుద్రాణి అంటుంది. రాహుల్ ఆనాడే కంపెనీకి వెళ్లనని తెగేసి చెప్పి ఇంట్లోనే ఉంటున్నాడు కదా. మళ్లీ కొత్తగా కంపెనీకి వెళ్లకుండా కావ్య ప్రయత్నించడం ఏంటీ. ఒక గడ్డిపోచ కోసం మహావృక్షాన్నే కాదనుకుని వెళ్లేంతపిచ్చిదనువుకున్నావా నా కోడలు అని అపర్ణ అంటుంది.

బలవంతంగా కాపురం చేశావా

నేను, నా కొడుకు తలుచుకుంటే ఈ గడ్డిపోచను ఏరిపారేయడానికి మాకెంతో సేపు పట్టదు. నాకిప్పుడు నీ మీద కూడా కోపం రావట్లేదు. చెప్పుడు మాటలు విని కట్టుకున్న భార్య మనసు విరిగిపోయేలా చేసిన నా కొడుకుదే తప్పు. రేయ్.. చెప్పుడు మాటలు చెప్పేవాళ్లది తప్పుకాదురా. అది విని అజ్ఞానంలో బతకడమే తప్పు. వాళ్లను కూడా క్షమిస్తాను. నువ్ ఏమన్నావురా.. దానిపై నీకు ప్రేమ లేదా. బలవంతంగా పెళ్లి చేసుకున్నావా. బలవంతంగా కాపురం చేశావా అని రాజ్‌ను నిలదీస్తుంది అపర్ణ.

కావ్య నన్ను నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిందనేగా నీకోపం. ఆ కోపమే చూపించాల్సింది. ప్రేమ లేదని చెబితే ఆ పిచ్చిదేం కావాలిరా. నువ్ కావ్యను కావాలనే బాధపెట్టాలనే నీ మనసులో లేని మాటలు అనేసి వెళ్లగొట్టావా అని అపర్ణ అంటే.. నేనేం వెళ్లమనలేదు అని రాజ్ అంటాడు. మరి ఉండమన్నావా. నీకు తల్లి మీద ఉన్న ప్రేమ నీ కళ్లు మూసుకుపోయేలా చేసింది. నాకోసమే చేశావ్ కదా ఇదంతా. నా కోడలు నిర్దోషి. నా కోడలిని క్షమించమని అడిగి ఇంటికి తీసుకురా అపర్ణ అంటుంది.

నీకు నీ కోడలు ముఖ్యమైతే నాకు నా తల్లి ప్రాణాలే ముఖ్యం. కారణం ఏదైనా సరే నిన్ను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రాణాపాయ స్థితికి వచ్చావ్. మళ్లీ చెబుతున్నాను మమ్మీ కారణం ఏదైనా, కోట్లు పోయినా సరే నిన్ను నిర్లక్ష్యం చేయకూడదు. నేను వెళ్లి కళావతిని పిలిచే ప్రసక్తే లేదు అని వెళ్లిపోతాడు రాజ్. మంచిది.. నేనే వెళ్తాను. నా కారణంగానే నా కోడలు అన్ని మాటలు పడింది. మనసు విరిగిలా మాట్లాడింది. నేనే వెళ్లి తీసుకొస్తాను అపర్ణ వెళ్లబోతుంది.

ఎవరిపై నమ్మకం లేదు

ఆగమ్మా. నీ ఆరోగ్యం బాగాలేదు. అంత దూరం వెళ్లడం ఇంత రాత్రి వెళ్లడం మంచిదికాదు. రేపు ఉదయం నేను మీ అత్తయ్య వెళ్లి తీసుకొస్తాం అని సీతారామయ్య అంటాడు. మీరంతా నా కోడలు వెళ్లిపోయేటప్పుడు ఏం చేశారు మావయ్య గారు. నా మనవరాలు అని ప్రతి సారి వెనుకేసుకొచ్చే అత్తయ్య ఏం చేశారు. తండ్రి తర్వాత తండ్రి అయినా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు. నాకు ఎవరిపై నమ్మకం లేదు. మీ పెద్దరికాన్ని విమర్శిస్తున్నందుకు క్షమించండి అని అపర్ణ అంటుంది.

అపర్ణ మరి నా కోడలి ఆరోగ్యం గురించి మేము ఆలోచించాలి కదా. అత్తగా చెబుతున్నాను లోపలికి వెళ్లు. మీ మావయ్య మాటకు ఎదిరిద్దామనుకుంటున్నావా. నా కోడలు నా మాట విననప్పుడు.. తన కోడలు ఇంకేం వింటుంది. ఇప్పుడు నువ్వెళ్తే.. నీకేమైనా అయితే ఎవరు దోషులుగా నిలబడాలనుకుంటున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది. అలా అని కాదు. రేపు ఉదయమే వెళ్లి మేము తీసుకొస్తాం. కావ్య మన ఇంటికి తిరిగి వస్తుంది అని సీతారామయ్య హామీ ఇస్తాడు. దాంతో అపర్ణ లోపలికి వెళ్తుంది.

మరోవైపు ఈ అపర్ణ ఆంటీకి వేరే పనిలేదా. కష్టపడి కావ్యను తరిమేశాం. ముసలోళ్లిద్దరు వెళ్లి తీసుకొస్తే అంతా ఒక్కకాడికి వస్తుంది. రేపు వీళ్లు వెళ్లకుండా ఆపాలని రాహుల్ అంటాడు. కావ్య ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన బిర్యాని కాదు. ఆత్మాభిమానం ఉన్న కావ్య లాంటి ఆడది ఇంటికి రాదు. ఒక రాజ్ పిలిస్తే వస్తుంది. రాజ్ తప్పు ఒప్పుకుని అంగీకరిస్తేనే వస్తుంది. మా అమ్మ నాన్న వెళ్తా అన్న నేను అడ్డు చెప్పలేదు. వాళ్లు పిలిచినా రాదనే అని రుద్రాణి అంటుంది.

అర్హత లేకుండా చేశాడు

మరుసటి రోజు ఉదయం కావ్య దగ్గరికి సీతారామయ్య, ఇందిరాదేవి వెళ్తారు. వాళ్లను చూసి కనకం కంగారుపడి కావ్య, కృష్ణమూర్తిని పిలుస్తుంది. ఏమ్మా ఇంట్లోకి పిలవవా. అ్పపుడే నీకు పరాయి వాళ్లం అయిపోయామా అని ఇందిరాదేవి అంటుంది. మీకు ఎక్కడికైనా వచ్చే అధికారం ఉంది అని కావ్య అంటుంది. దాంతో లోపలికి వస్తారు ఇందిరాదేవి, సీతారామయ్య. ఎలా ఉన్నావని అడిగే అర్హత లేకుండా చేశాడమ్మా మా మనవడు అని సీతారామయ్య అంటాడు.

కోమా నుంచి వచ్చిన అపర్ణ నా కోడలు ఎక్కడ అని అడుగుతుంది అని ఇందిరాదేవి అంటుంది. నా మనవడు తప్పు చేశాడు. ఇప్పుడు పట్టింపులకు పోయేపరిస్థితి కాదు. రాజ్‌ను క్షమించి ఇంటికి వచ్చేయమ్మా అని సీతారామయ్య అంటాడు. నాకు అత్తయ్య పక్కనే ఉండాలని ఉంది. కానీ, మీ మనవడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇలాంటప్పుడు నేను ఎలా రాగలను అని కావ్య అంటుంది. ఆ ఇంట్లో ఎవరి మొహంలో సంతోషం లేదు. మా ఇంటికి మహాలక్ష్మి వెళ్లిపోయినట్లుంది. నువ్ ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు అని అంటారు.

నీ కూతురు పుట్టింట్లో ఉండటం నీకు బాధగా లేదా. నువ్వైనా చెప్పు అని ఇందిరాదేవి అంటుంది. అత్తింట్లో మనసు ముక్కలైన కూతురు పుట్టింట్లో ఉండటం నాకు మాత్రమే ఇష్టమా. తను వస్తానంటే మొదట సంతోషించేది నేనే అని కనకం అంటుంది. నువ్ ఇంటికి వస్తే అన్ని సమస్యలు తీరుతాయని ఇందిరాదేవి అంటుంది. మీరు కోరుకున్నట్లే నేను వస్తాను. కానీ, ఆ ఇంట్లో నా స్థానమేంటీ. నా భర్త మనసులో నాకు స్థానం లేదని తెలిసాకా కూడా నేను అక్కడికి వస్తే నా స్థానమేంటో చెప్పండి అమ్మమ్మ అని కావ్య అడుగుతుంది.

తప్పు చేసిన భర్త

తనలో మార్పు వచ్చిందని సంతోషించాను. కానీ, అదంతా తన తల్లి సంతోషం కోసమే అని చెప్పాక.. నేను అక్కడికి వచ్చి సాధించేదేముంది. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. ఒకే మాట మీద నిలబడ్డారు. కానీ, నమ్మి మోసపోయింది నేను. మనసులు కలవని వ్యక్తితో కాపురం చేశాను తెలిసాకా నామీదే అసహ్యం వేస్తుంది. ఇలాంటి కాపురాన్ని ఏమంటారో మీకే బాగా తెలుసు అని కావ్య అంటుంది. నీ మనసును ఎంత ముక్కలు చేశాడో అర్థమైంది. ఇక్కడికి రావాల్సింది నేను మీ అత్త కాదు. తప్పు చేసిన నీ భర్త రాజ్ అని ఇందిరాదేవి అంటుంది.

తన తప్పును తెలుసుకుని వాడే నిన్ను పిలుస్తాడు. మీ మనుసును గెలుచుకుని నిన్ను ఇంటికి తీసుకువస్తాడు అని సీతారామయ్య అంటాడు. నాకు ఆ నమ్మకం లేదని అంటుంది కావ్య. అది జరిగినప్పుడు నువ్వే నమ్ముతావ్ అని ఇందిరాదేవి చెబుతుంది. ఇద్దరూ వెళ్లిపోతారు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని కావ్య తల్లిని అడుగుతుంది. భర్త ప్రేమ కావాలని కోరుకోవడం తప్పు కాదే. నువ్వెంత బాధపడుతున్నావో అర్థమైందని కనకం అంటుంది.

దుగ్గిరాల ఇంటికి సీతారామయ్య, ఇందిరాదేవి వస్తారు. కట్ చేస్తే.. కనకం ఇంటికి రాజ్ వెళ్తాడు. మా ఇంటి మహాలక్ష్మీ మీ ఇంటికి వెకేషన్‌కు వచ్చింది. ఎక్కడ సేదతీరుతుంది అని వెటకారంగా అడుగుతాడు రాజ్. రాజ్‌ను చూసి కావ్య పట్టించుకోదు. నువ్ రాకపోతే కాళ్లు పట్టుకుని అయినా తీసుకెళ్తాను అని రాజ్ అంటాడు.