OTT Malayalam Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న మీనా నటించిన మలయాళం క్యాంపస్ థ్రిల్లర్ మూవీ-ott malayalam thriller movie meena starrer anandhapuram diaries to stream on manorama max on september 20th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న మీనా నటించిన మలయాళం క్యాంపస్ థ్రిల్లర్ మూవీ

OTT Malayalam Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న మీనా నటించిన మలయాళం క్యాంపస్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Sep 17, 2024 03:55 PM IST

OTT Malayalam Thriller: ఓటీటీలోకి మలయాళం క్యాంపస్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. సీనియర్ నటి మీనా చాలా రోజుల తర్వాత నటించిన మలయాళం సినిమా ఇది. దీంతో ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఓటీటీలోకి వచ్చేస్తున్న మీనా నటించిన మలయాళం క్యాంపస్ థ్రిల్లర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేస్తున్న మీనా నటించిన మలయాళం క్యాంపస్ థ్రిల్లర్ మూవీ

OTT Malayalam Thriller: మలయాళం థ్రిల్లర్ మూవీ ఆనందపురం డైరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ వారమే మీనా నటించిన ఈ సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ సినిమాలకు కేరాఫ్ అయిన మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆనందపురం డైరీస్ ఓటీటీ రిలీజ్ డేట్

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సీనియర్ నటి మీనా నటించిన మూవీ ఆనందపురం డైరీస్. ఇదొక క్యాంపస్ థ్రిల్లర్ మూవీ. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడిన ఈ సినిమా ఇప్పుడు వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ సినిమాలో మీనా, శ్రీకాంత్, మనోజ్ కే జయన్, రోషన్ అబ్దుల్ రహూఫ్ లాంటి వాళ్లు నటించారు. చాలా రోజుల తర్వాత మలయాళం సినిమాలోకి మీనా అడుగుపెట్టడంతో ఈ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను మనోరమ మ్యాక్స్ దక్కించుకుందని గతంలోనే వెల్లడించినా.. స్ట్రీమింగ్ డేట్ పై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

అయితే మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఈ మధ్య కాలంలో చాలా మలయాళం సినిమాలు క్యూ కడుతున్నాయి. పవి కేర్‌టేకర్, స్వకార్యం సంభవబహుళం, మందాకిని, జననం 1947 ప్రణయం తుడర్ను, జై గణేష్ లాంటి సినిమాలు ఈ మధ్యే స్ట్రీమింగ్ కు వచ్చాయి.

ఆనందపురం డైరీస్ మూవీ గురించి..

ఈ ఆనందపురం డైరీస్ మూవీలో మీనా లీడ్ రోల్ పోషించింది. 40 ఏళ్ల వయసులోనూ లా చదువు పూర్తి చేయాలన్న ఆశతో మళ్లీ కాలేజీలో చేరే మహిళ చుట్టూ తిరిగే కథ ఇది. అయితే ఆ కాలేజీలో ఓ అమ్మాయి రేప్, హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారు? అందులో లీడ్ రోల్ పోషించే పాత్ర ఏంటి అన్నది సినిమాలో చూడాలి.

ఈ క్యాంపస్ థ్రిల్లర్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమాను జయ జోస్ రాజ్ డైరెక్ట్ చేశారు. శశి నాయర్ మూవీని నిర్మించారు. ఇందులో మీనా కాకుండా మనోజ్ కే జయన్, సిద్ధార్థ్ శివ, జాఫర్ ఇడుక్కి, సుధీర్ కరమన, రోషన్ అబ్దుల్ రహూఫ్, సూరజ్ తెలకాడ్ లాంటి వాళ్లు నటించారు.