OTT Family Movie: ఓటీటీలోకి నివేదా థామస్ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!-nivetha thomas family drama movie 35 chinna katha kaadu to stream on aha ott from these date ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Family Movie: ఓటీటీలోకి నివేదా థామస్ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

OTT Family Movie: ఓటీటీలోకి నివేదా థామస్ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 17, 2024 03:15 PM IST

35 Chinna Katha Kaadu OTT Release Date: 35- చిన్న కథ కాదు చిత్రం థియేటర్లలో విజయం సాధించింది. మంచి సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఓటీటీ డేట్ కూడా బయటికి వచ్చింది.

OTT Family Movie: ఓటీటీలోకి నివేదా థామస్ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
OTT Family Movie: ఓటీటీలోకి నివేదా థామస్ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

కంటెంట్ బాగుంటే బడ్జెట్‍తో సంబంధం లేకుండా ప్రేక్షకులు మూవీని ఆదరిస్తారనే చెప్పేందుకు ‘35 - చిన్న కథ కాదు’ చిత్రం మరో సాక్ష్యంగా నిలిచింది. హీరోయిన్ నివేదా థామస్ ఈ చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించారు. ఆమె నటనకు భారీ ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ 35 - చిన్న కథ కాదు చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి కూడా ముఖ్యమైన పాత్రలు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రశంసలను దక్కించుకోవటంతో పాటు కమర్షియల్‍గానూ మోస్తరు సక్సెస్ అయింది.

35 - చిన్న కథ కాదు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..

ఓటీటీ డేట్ ఇదే!

35 - చిన్న కథ కాదు సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ డేట్‍ను ఆహా లాక్ చేసిందట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మూడు వారాల్లోనే..

35 - చిన్న కథ కాదు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ దక్కించుకుంది. పాజిటివ్ టాక్ రావటంతో మంచి ధరకే ఈ మూవీని తీసుకుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూలు వచ్చినా భారీగా కలెక్షన్లు ఈ చిత్రానికి రాలేదు. ఓ మోస్తరుగా దక్కించుకుంది. అయితే, ఈ మూవీ థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే ఆహా స్ట్రీమింగ్‍కు తీసుకురావటం దాదాపు ఖరారైంది. సెప్టెంబర్ 6న ఈ చిత్రం థియేటర్లలోకి రాగా.. సెప్టెంబర్ 27న ఆహాలోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

35 - చిన్న కథ కాదు సినిమాను ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు నందకిశోర్ ఇమానీ. మ్యాథ్స్ సబ్జెక్టులో పాస్ మార్కులు తెచ్చుకునేలా తన కుమారుడికి ఓ తల్లి స్ఫూర్తి కలిగించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కథ సింపుల్‍గానే ఉన్నా.. హృదయాలను హత్తుకునేలా డైరెక్టర్ చూపించారు. మధ్య తరగతి కుటుంబ పరిస్థితులు, పిల్లల్లో ఉండే సందేహాలు, విద్యావ్యవస్థ ఇలా చాలా అంశాలను చూపించారు.

35 - చిన్న కథ కాదు మూవీలో నివేదా థామస్‍తో పాటు విశ్వదేవ్ రాచకొండ నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. ఉపాధ్యాయుడిగా నటించిన ప్రయదర్శి మరోసారి తన నటనతో మెప్పించారు. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్‍దేవ్ కూడా ఆకట్టుకున్నారు. అభయ్ శంకర్, గౌతమి, కృష్ణతేజ, భాగ్యరాజ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు.

35 - చిన్న కథ కాదు చిత్రాన్ని సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ప్రొడ్యూజ్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పించారు. ఈ మూవీ ప్రమోషన్లలోనూ రానా జోరుగా పాల్గొన్నారు. దీంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశారు.