Nivetha Thomas: కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది, దానికి పోలిక ఉండదు.. నివేదా థామస్ కామెంట్స్-nivetha thomas comments on k viswanath movies and 35 chinna katha kadu comparison to taare zameen par rana daggubati ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nivetha Thomas: కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది, దానికి పోలిక ఉండదు.. నివేదా థామస్ కామెంట్స్

Nivetha Thomas: కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది, దానికి పోలిక ఉండదు.. నివేదా థామస్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 02, 2024 12:37 PM IST

Nivetha Thomas About K Viswanath Movies Feeling: బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 35 చిన్న కథ కాదు. మొదటిసారిగా తల్లి పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతోన్న నివేదా థామస్ కళాతపస్వి కె విశ్వనాథ్ సినిమాలకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది, దానికి పోలిక ఉండదు.. నివేదా థామస్ కామెంట్స్
కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది, దానికి పోలిక ఉండదు.. నివేదా థామస్ కామెంట్స్

Nivetha Thomas Comments: బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్ చాలా గ్యాప్ తర్వాత నటించిన తెలుగు సినిమా 35 చిన్న కథ కాదు. నాని జెంటిల్‌మెన్, నిన్ను కోరి చిత్రాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నివేదా థామస్ మొదటిసారిగా తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాలో నివేదాతోపాటు ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ చేశారు.

సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి 35 చిన్న కథ కాదు సినిమాను నిర్మించారు. నంద కిషోర్ ఈ మూవీకి కథ, దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 6న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన విశేషాలను హీరోయిన్ నివేదా థామస్ పంచుకుంది.

ఇది ఎడ్యుకేషన్ స్టొరీనా?

-మ్యాథ్స్ అనేది చిన్న పార్ట్ మాత్రమే. ఇందులో చాలా మాస్ మూమెంట్స్ క్లాస్ రూమ్ నుంచే వస్తాయి. చాలా నోస్టాల్జియా మూమెంట్స్ ఉంటాయి. భార్యా, భర్త, పిల్లలు, టీచర్ స్టూడెంట్స్ ఇలాంటి బ్యూటీఫుల్ రిలేషన్షిప్స్ గురించి చాలా అందంగా చెప్పడం జరిగింది. ఇది కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ ఇస్తుంది.

35 చిన్న కథ కాదు టైటిల్ మార్కులని ఉద్దేశించి పెట్టినదేనా?

-అవును. మ్యాథ్స్‌లో పిల్లలకి చాలా ఫండమెంటల్ డౌట్స్ ఉంటాయి. ఇందులో మా పెద్దబ్బాయికి అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. కానీ మ్యాథ్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చాలా మంది రిలేట్ చేసుకునేలా ఉంటాయి.

ఈ సినిమాకి తారే జమీన్ పర్‌తో పోలిక ఉంటుందా?

-అస్సలు లేదండి. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. మదర్, సన్, టీచర్.. ఇవన్నీ ఉండటంతో ఆ పోలిక వచ్చిందని భావిస్తున్నాను. సినిమా చూసిన తర్వాత దానికి దీనికి పోలిక లేదని మీరే అంటారు.

-దర్శి క్యారెక్టర్ ఎలా ఉండనుంది?

-ఇందులో మ్యాథ్స్ టీచర్ చాణక్య క్యారెక్టర్ ప్లే చేశారు దర్శి. చాణక్య లాంటి టీచర్స్‌ని మన జీవితంలో చూసే ఉంటాం. స్కూల్స్ పోర్షన్ చాలా ఎంజాయ్ చేస్తారు.

గౌతమి, భాగ్యరాజా గారుతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

-గౌతమి గారితో నాకు ఇది రెండో సినిమా. ఆమె చాలా ఇన్వాల్‌గా ఉంటారు. ఇందులో ఆమె క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. భాగ్యరాజా గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో పిల్లల పాత్రలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో పిల్లలందరూ హీరోలే.

రానా దగ్గుబాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయడం ఎలా అనిపించింది?

-రానా గారికి ఈ సినిమా కథ ముందునుంచి తెలుసు. సురేష్ ప్రొడక్షన్‌తో ఆయన ఈ సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమాలకి వారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా జర్నీలో నాకు బ్రోచేవారెవరురా రోజులు గుర్తుకువచ్చాయి.

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ?

-ప్రస్తుతానికి ఏదీ సైన్ చేయలేదు. త్వరలోనే చెప్తాను.