Jr NTR: ‘నాతో ఓ సినిమా చేయండి’: ఆ దర్శకుడిని రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్-i am wishing to do tamil movie with director vetrimaran says jr ntr at devara promotional event in chennai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr: ‘నాతో ఓ సినిమా చేయండి’: ఆ దర్శకుడిని రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్

Jr NTR: ‘నాతో ఓ సినిమా చేయండి’: ఆ దర్శకుడిని రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 17, 2024 10:07 PM IST

Jr NTR - Devara Promotions: దేవర మూవీ తమిళ ప్రమోషనల్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‍కు హీరో ఎన్టీఆర్ హాజరయ్యారు. తన మార్క్ స్పీచ్‍తో అదగొట్టారు. అలాగే, తాను ఓ దర్శకుడితో డైరెక్ట్ తమిళ చిత్రం చేయాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు.

Jr NTR: ‘నాతో ఓ సినిమా చేయండి’: ఆ దర్శకుడిని రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్
Jr NTR: ‘నాతో ఓ సినిమా చేయండి’: ఆ దర్శకుడిని రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్

దేవర సినిమా ప్రమోషన్లను జోరుగా చేస్తోంది మూవీ టీమ్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా హైప్ ఉంది. ఇటీవలే ముంబైలో హిందీ కోసం ప్రమోషన్లను దూకుడుగా చేసింది యూనిట్. ట్రైలర్ లాంచ్ సహా కొన్ని ఇంటర్వ్యూలు ముంబైలో జరిగాయి. ఈ మూవీ తమిళ వెర్షన్ కోసం నేడు (సెప్టెంబర్ 17) చెన్నైలో ప్రెస్ మీట్ జరిగింది. హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ఈవెంట్‍లో పాల్గొన్నారు.

ఈ ఈవెంట్‍లో ఎన్టీఆర్ స్పీచ్ అదరగొట్టారు. అలాగే, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. డైరెక్ట్ తమిళ మూవీ ఎప్పుడు చేస్తారనే క్వశ్చన్ ఎదురుకాగా.. ఎన్టీఆర్ సమాధానమిచ్చారు.

నా ఫేవరెట్ డైరెక్టర్‌ను అడుగుతున్నా..

“మీ నుంచి డైరెక్ట్ తమిళ చిత్రాన్ని ఎప్పుడు ఆశింవచ్చు. అది వస్తే సెలెబ్రేట్ చేసుకుంటాం” అని ఎన్టీఆర్‌కు ప్రశ్న వచ్చింది. దీంతో నా ఫేవరెట్ డైరెక్టర్‌ను అడుగుతానంటూ వెట్రిమారన్ పేరు చెప్పారు ఎన్టీఆర్.

వెట్రిమారన్‍తో డైరెక్ట్ తమిళ మూవీ చేయాలనుందని ఎన్టీఆర్ చెప్పారు. తనతో ఓ చిత్రం చేయాలని ఆయనను రిక్వెస్ట్ చేశారు. “వెట్రిమారన్ సర్. నాతో ఓ సినిమా చేయండి. డైరెక్ట్‌ తమిళ చిత్రం చేద్దాం. తెలుగు డబ్బింగ్ చేద్దాం” అని ఎన్టీఆర్ అన్నారు.

ఆడుకాలం, విసారనై, వడాచెన్నై, అసురన్, విడుదలై లాంటి హార్డ్ హిట్టింగ్ తమిళ చిత్రాలు చేశారు దర్శకుడు వెట్రిమారన్. ప్రత్యేకంగా నిలిచారు. వెట్రిమారన్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలోనూ ఎన్టీఆర్ చెప్పారు. ఆయనతో చిత్రం చేయాలనుందంటూ ఇప్పుడు అన్నారు.

భాషలు వేరైనా.. సినిమా కలిపేసింది

టాలీవుడ్, కోలీవుడ్, సాండిల్‍వుడ్, బాలీవుడ్ లాంటివి లేవని.. సినిమా అంతటిని ఏకం చేసిందని ఎన్టీఆర్ అన్నారు. “మనం వేర్వేరు భాషలు మాట్లాడుతున్నాం. కానీ సినిమా అనే ఒక్క పదంతో మనంతా కలిసే ఉన్నాం. మనంతా వేరు కాదని సినిమాలు నిరూపిస్తున్నాయి” అని ఎన్టీఆర్ అన్నారు.

తారక్ అన్న నా బెస్ట్ ఫ్రెండ్

దేవర చిత్రంతో తారక్ అన్న (ఎన్టీఆర్) తనకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అన్నారు. ఎన్టీఆర్ ఎనర్జీ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. దేవర చిత్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడులో బాగా ఆడుతుందని తనకు పూర్తి నమ్మకం ఉందని అనిరుధ్ చెప్పారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన మూడు పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍పై కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. ఈ మూవీతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రెండు పాత్రలు చేశారు ఎన్టీఆర్. సైఫ్ అలీ ఖాన్ విలన్‍గా నటించారు. తమిళ నటుడు కలైయారాసన్ కూడా కీలకపాత్ర చేశారు. శృతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీరోల్స్ చేశారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా దేవరను తెరకెక్కించారు డైరెక్టర్ కొరటాల శివ. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ బ్యానర్లు భారీ బడ్జెట్‍తో రూపొందించాయి.