Nunakkuzhi Review: నునాక్కుజి రివ్యూ- క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్- దృశ్యం డైరెక్టర్ ఓటీటీ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?-nunakkuzhi review in telugu jeethu joseph ott malayalam comedy movie nunakkuzhi explained in telugu zee5 nunakuzi review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nunakkuzhi Review: నునాక్కుజి రివ్యూ- క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్- దృశ్యం డైరెక్టర్ ఓటీటీ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Nunakkuzhi Review: నునాక్కుజి రివ్యూ- క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్- దృశ్యం డైరెక్టర్ ఓటీటీ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 17, 2024 06:07 AM IST

Nunakkuzhi Review In Telugu: దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం రీసెంట్ సూపర్ హిట్ మలయాళ డార్క్ కామెడీ మూవీ నునాక్కుజి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందో నునాక్కుజి రివ్యూలో తెలుసుకుందాం.

నునాక్కుజి రివ్యూ- క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్- దృశ్యం డైరెక్టర్ ఓటీటీ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
నునాక్కుజి రివ్యూ- క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్- దృశ్యం డైరెక్టర్ ఓటీటీ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: నునాక్కుజి

నటీనటులు: బసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ, నిఖిల విమల్, బైజు సంతోష్, సైజు కురుప్, మనోజ్ కే జయన్, సిద్ధిఖీ తదితరులు

కథ: కేఆర్ కృష్ణకుమార్

దర్శకత్వం: జీతు జోసెఫ్

నిర్మాతలు: సిద్థార్థ్ ఆనంద్ కుమార్, విక్రమ్ మెహ్రా

సంగీతం: విష్ణు శ్యామ్

సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్,

నిర్మాణ సంస్థ: సరీగమ, బెడ్ టైమ్ స్టోరీస్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5

Nunakkuzhi Movie Review In Telugu: మలయాళ డైరెక్టర్ జీతు జోసెఫ్‌కు తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వచ్చిన దృశ్యం, దృశ్యం 2, నెరు, 12th మ్యాన్ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఇవన్ని క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్‌ జానర్‌లో సాగుతుంటాయి. కానీ, తన స్టైల్‌కు విభిన్నంగా కామెడీ జానర్‌లో జీతు జోసెఫ్ తెరకెక్కించిన సినిమానే నునాక్కుజి.

ఆగస్ట్ 15న మలయాళం మంచి హిట్ కొట్టిన నునాక్కుజి మూవీ సెప్టెంబర్ 13 నుంచి జీ5 ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7 రేటింగ్ అందుకున్న ఈ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందో నునాక్కుజి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

తండ్రి మరణించడంతో ఎండీగా కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు ఎబీ జకారియా (బసిల్ జోసెఫ్). పెళ్లై మూడు నెలలు అయిన ఎబీకి కంపెనీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోడు. భార్యతోనే మాట్లాడుతుంటాడు. ఈ సమయంలోనే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చి కొన్ని లెక్కలు సరిగా లేవని ఎబీ ల్యాప్‌టాప్‌తో సహా కొన్ని వస్తువులు సీజ్ చేసి పట్టుకుపోతారు. అయితే, ఆ ల్యాప్‌ట్యాప్‌లో తన భార్యతో ఇంటిమేట్ అయిన వీడియో ఉంటుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ను కలిసి తన ల్యాప్‌ట్యాప్ తెచ్చుకునేందుకు ఎబీ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రష్మిత రంజిత్ (గ్రేస్ ఆంటోనీ) ప్లాట్‌లోకి దూరుతాడు. ఆ తర్వాత ఏమైంది? రష్మిత ప్లాట్‌లో ఎబీకి దూరాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు రష్మిత రంజిత్ ఎవరు? ఆమె కథ ఏంటీ తనకు తెలియకుండా ఎబీ పురుగుల మందు ఎందుకు తాగాల్సి వచ్చింది? డెంటిస్ట్ జయదేవన్ ఎవరు? అతని కథేంటీ? స్టార్ హీరో సుందర్ నాథ్ కహానీ ఏంటీ? వీళ్లంతా ఒక్కచోటికి ఎందుకు చేరారు? అసలు ఎబీకి తన ల్యాప్‌ట్యాప్ దొరికిందా? అనే విషయాలు తెలియాలంటే నునాక్కుజి చూడాల్సిందే.

విశ్లేషణ:

అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ హోటల్‌కు వెళ్లడం, అక్కడ పెద్ద గొడవ జరగడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ఇద్దరిని బైక్‌పై చూపిస్తూ వచ్చే పాటతో సినిమా కథను చెప్పి చెప్పినట్లుగా దాదాపుగా రివీల్ చేశారు. కానీ, క్లైమాక్స్ వస్తేకానీ అది అర్థం కాదు. ఎబీ కంపెనీ బాధ్యతలు తీసుకోవడం, ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ జరగడం, ల్యాప్‌ట్యాప్ సీజ్ చేయడం, అందులో భార్యతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో ఉండటం అంతా ఫాస్ట్‌గా సాగిపోతుంది.

మరోవైపు రష్మిత రంజిత్ డివోర్స్, డెంటిస్ట్‌పై రివేంజ్ తీర్చుకోవడం వంటివి చూపిస్తూ కథలోని లీనమయ్యేలా చేశారు. ఆ తర్వాత ల్యాప్‌ట్యాప్‌ను దక్కించుకునేందుకు ఎబీ చేసే ప్రయత్నాలు, పురుగుల మందు తాగిన ఎబీని కాపాడేక్రమంలో రష్మిత ఇరుక్కోవడం, వారిని ఎస్సై ఇంట్రాగేట్ చేయడం, మరోవైపు హీరో సుందర్ స్వామినాథన్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మేనల్లుడు సినిమా కథ చెప్పడం సన్నివేశాలతో బోర్ కొట్టకుండా అలా సాగిపోతుంది.

క్లైమాక్స్ ట్విస్ట్

అయితే, ఆద్యం కామెడీ, నవ్వు తెప్పించే డైలాగ్స్‌తో సినిమా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్‌గా సాగుతుంది. కానీ, మధ్యలో ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్‌కు గురయ్యే ట్విస్టులు ఏం రావు. అదొక్కటే మైనస్. అయితే, క్లైమాక్స్‌లో వచ్చే ఒక్క ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే షాక్‌కు గురయ్యేలా చేసి, ఆ వెంటనే నవ్వుతెప్పిస్తుంది. కోర్ట్ సీన్స్ చాలా కామెడీగా సాగుతుంది. కోర్ట్ వ్యవహారాలు, పోలీసుల ఇంట్రాగేషన్, హీరోల కథలపై జడ్జ్‌మెంట్, ఫ్యాన్స్ వంటివాటని డార్క్ కామెడీతో చాలా బాగా చూపించారు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక డైరెక్టర్ కమ్ యాక్టర్ బసిల్ జోసెఫ్ నటనతో ఇరగదీశాడు. అతని నటన సినిమాకే మెయిన్ హైలెట్. అలాగే, ప్రతి ఒక్కరు నటనతో చాలా బాగా చేశారు. అందుకే పెద్దగా స్టోరీ లేకున్నా వారి నటనతో ఎంగేజ్ అవుతాం. అయితే, ఊహించని ట్విస్టులతో క్రైమ్ థ్రిల్లర్స్ తెరకెక్కించే జీతూ జోసెఫ్ అంచనాలను అందుకోలేడనే చెప్పాలి. తన జానర్ వదిలేసి డార్క్ కామెడీ అనే ఫ్రెష్ జానర్‌ను తన స్థాయిలో కాకున్నా బాగానే రక్తికట్టించారు.

రేటింగ్: 2.5/5