Heroine: అతను ప్రైవేట్ పార్ట్స్ చూపించాడు.. టీచర్ నాదే తప్పంది.. మంచు విష్ణు హీరోయిన్ పోస్ట్
Celina Jaitly About Harassment In School: మంచు విష్ణు నటించిన సూర్యం మూవీలో హీరోయిన్‌గా చేసిన సెలీనా జైట్లీ తన చిన్ననాటి ఫొటో షేర్ చేస్తూ తనకు జరిగిన అసభ్యకర ప్రవర్తన గురించి చెప్పుకొచ్చింది. బాధితులదే తప్పు అంటారా అని ప్రశ్నించింది. ప్రస్తుతం సెలీనా జైట్లీ పోస్ట్ వైరల్ అవుతోంది.
(1 / 4)
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహిళా డాక్టర్ హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను చిన్నప్పుడు ఎదుర్కొన్న వేధింపులను సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా పంచుకుంది నటి సెలీనా జైట్లీ. (అన్ని ఫొటోలు @ Instagram)
(2 / 4)
సెలీనా జైట్లీ తన చిన్ననాటి ఫోటోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తాను అనేక సందర్భాల్లో వేధింపులకు, ప్రాణాంతక చర్యలకు గురయ్యానని తెలిపింది. బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది, టైట్ దుస్తులు వేసుకోవడం, కొంచెం పాశ్చాత్యంగా ఉండటం వల్లే తాను అలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది.
(3 / 4)
"బాధితురాలే ఎప్పుడూ దోషిగా నిలుస్తోంది. ఈ ఫోటో నా 6వ తరగతి అప్పటిది. అప్పుడే నా స్కూల్‌కు దగ్గరున్న యూనివర్శిటీ స్టూడెంట్స్ స్కూల్ బయట నాకోసం ఎదురుచూసేవాళ్లు. నా గురించి అసభ్యంగా మాట్లాడేవారు. కారుకూతలు కూసేవారు. నేను అది పట్టించుకోకపోవడంతై నాపై రాళ్లు విసిరారు. నా పక్కనున్న వాళ్లు అది చూసిన కూడా ఏం స్పందించలేదు" అని సెలీనా చెప్పింది.
(4 / 4)
"ఈ విషయం మా టీచర్‌కు చెబితే అదంతా నా వల్లే, నాదే తప్పని చెప్పింది. నేను వెస్ట్రన్ దుస్తులు వేసుకుంటున్నాను. జుట్టుకు నూనె పెట్టుకోకుండా లూజ్‌గా వదిలేస్తున్నాట. లూజ్ బట్టలు వేసుకోవట్లేదట. అందుకే వాళ్లు నాతో అసభ్యంగా ప్రవర్తించారని నన్నే తప్పుపట్టింది. ఓరోజు అయితే నేను స్కూల్‌కు వెళ్లడానికి ఆటో కోసం వెయిట్ చూస్తుండగా ఒకతను వచ్చి తన ప్రైవేట్ పార్ట్స్ నాకు చూపించాడు. అసలు వీళ్లంతా ఎందుకు ఇలా చేస్తున్నారు. టీచర్ చెప్పినట్లు నిజంగా నేనే తప్పు చేస్తున్నానా. బాధితురాలిదే తప్పా అని నాలో నేనే కొన్నాళ్లుగా మానసికంగా బాధపడ్డాను" అని సెలీనా జైట్లీ చెప్పుకొచ్చింది.
ఇతర గ్యాలరీలు