Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 12 సినిమాలు- చూడాల్సినవి 8- హారర్, మలయాళం, క్రైమ్ థ్రిల్లర్స్ స్పెషల్!
New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 9) ఒక్కరోజు సినిమాలు వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 12 స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో ఏకంగా 8 చాలా స్పెషల్‌గా చూడాల్సినవిగా ఉన్నాయి. వీటిలో హారర్, తెలుగు డబ్బింగ్ మలయాళ, తమిళ సినిమాలు సైతం అట్రాక్ట్ చేయనున్నాయి.
ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
ఈ వారంలో దాదాపుగా 20కిపైగా సినిమాలు ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం ఉండగా.. వాటిలో ఇవాళ ఒక్కరోజే (ఆగస్ట్ 9) 12 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో హారర్, తెలుగు డబ్బింగ్ మలయాళం, క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. మరి ఇంట్రెస్టింగ్ అయిన ఆ 8 సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
భారతీయుడు 2 (తెలుగు సినిమా)- ఆగస్ట్ 9
ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా (హిందీ చిత్రం)- ఆగస్ట్ 9
కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 9
మిషన్ క్రాస్ (కొరియన్ మూవీ)- ఆగస్ట్ 9
ఇన్‌సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 9
రొమాన్స్ ఇన్ ది హౌజ్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 10
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
లైఫ్ హిల్ గయి (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 9
ఖాటిల్ కౌన్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 9
ఆహా ఓటీటీ
7/జీ (తమిళ మూవీ)- ఆగస్ట్ 9
డెరిక్ అబ్రహాం (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- ఆగస్ట్ 10
గ్యారా గ్యారా (హిందీ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఆగస్ట్ 9
గుడ్‌చడీ (హిందీ సినిమా)- జియో సినిమా ఓటీటీ- ఆగస్ట్ 9
టర్బో (మలయాళ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్ట్ 9
అన్నపూరణి (తమిళ సినిమా)- సింప్లీ సౌత్ ఓటీటీ- ఆగస్ట్ 9 (ఇండియాలో స్ట్రీమింగ్ లేదు)
తహతహలాడుతున్న ఆడియెన్స్
ఇలా నేడు 12 సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టాయి. వాటిలో ఎక్కువగా అందరి దృష్టి భారతీయుడు 2 సినిమాపై ఉంది. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమానే ఎక్కువగా చూసేందుకు ఆడియెన్స్ తహతహలాడుతున్నారు.
హారర్-యాక్షన్ థ్రిల్లర్స్
తర్వాత తాప్సీ నటించిన బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా ఇంట్రెస్టింగ్‌గా మారింది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్, తమిళ హారర్ సినిమా 7/జీ, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ టర్బో సినిమా సైతం చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
క్రైమ్ థ్రిల్లర్- కామెడీ ఎంటర్టైనర్
ఇక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గ్యారా గ్యారా కూడా ఓటీటీలో చూసే స్పెషల్ సిరీస్ అనుకోవచ్చు. అలాగే హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ గుడ్‌చడీ కూడా ఇంట్రెస్టింగ్ మూవీ కానుంది. ఇలా 6 సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో మొత్తంగా 7 చూడాల్సినవిగా ఉన్నాయి.
రెండ్రోజుల్లో 8 స్పెషల్
ఇవే కాకుండా నయనతార కాంట్రవర్సీ మూవీ అన్నపూరణి కూడా చాలా స్పెషల్ అయినప్పటికీ ఇండియా ఓటీటీలో స్ట్రీమింగ్ లేదు. కాబట్టి ఈ చిత్రాన్ని స్పెషల్‌గా భావించలేం. కాగా రేపు (ఆగస్ట్ 10) రెండు సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో డెరిక్ అబ్రహాం చాలా ఇంట్రెస్టింగ్ మూవీ కానుంది. దీంతో కలుపుకుంటే రెండ్రోజుల్లో 8 సినిమాలు చూడాల్సినవిగా ఉన్నాయి.