Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్.. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను ఇలా కాపాడుకోండి-bigg boss 8 telugu voting lines now open vote for your favorite contestant to save them from exit the show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్.. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను ఇలా కాపాడుకోండి

Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్.. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను ఇలా కాపాడుకోండి

Hari Prasad S HT Telugu
Sep 17, 2024 09:24 AM IST

Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ కాగా.. ఓటింగ్ లైన్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. వాళ్లలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ను ఇలా కాపాడుకోవచ్చు.

బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్.. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను ఇలా కాపాడుకోండి
బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్.. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను ఇలా కాపాడుకోండి (Disney+ Hotstar Telugu X)

Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ 8 తెలుగు ఈసారి చాలా ఇంట్రెస్టింగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఎప్పుడూ లేని విధంగా ఫైట్లతో షోని రక్తి కట్టిస్తున్నారు. ఈసారి హౌజ్ లోకి 14 మంది ఎంటరవగా.. ఇప్పటికే బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా వెళ్లిపోయారు. మిగిలిన 12 మందిలో మూడో వారానికిగాను 8 మందిని నామినేట్ చేశారు. వీళ్లలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ను కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూడండి.

బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్

బిగ్ బాస్ 8 తెలుగు సోమవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్లో మూడో వారానికిగాను 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వీళ్లలో ఎవరు ఉంటారో, ఎవరు హౌజ్ వదిలి వెళ్లిపోతారో ఆడియెన్స్ వేసే ఓట్లను బట్టి తేలుతుంది. దీంతో సోమవారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు.

శుక్రవారం (సెప్టెంబర్ 20) రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గానే ఉంటాయి. శనివారం, ఆదివారం జరిగే వీకెండ్ షోలో హోస్ట్ నాగార్జున ఎవరు ఎలిమినేట్ అయ్యారో వాళ్ల పేరును అనౌన్స్ చేస్తాడు. తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ హౌజ్ వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే 8 మంది కంటెస్టెంట్లలో ఎవరికి ఓటేయాలంటే ఏం చేయాలి? ఆ ఓట్లు ఎలా వేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం.

మీ ఓట్ ఇలా వేయండి..

బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం కోసం నామినేట్ అయిన వాళ్లలో అభయ్ నవీన్, నాగ మణికంఠ, నైనిక, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, సీత, యష్మి ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ఒక్కొక్కరికి ఒక్కో నంబర్ కేటాయించారు. ఆ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు వాళ్లకు ఓటు వేయవచ్చు.

ఈ 8 మందిలో ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్లు హౌజ్ వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ లోకి వెళ్లి బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓటు వేయవచ్చు. ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్లు సేఫ్ జోన్ లో ఉంటారు. అందుకే ఎవరైతే హౌజ్ లో కొనసాగాలని మీరు అనుకుంటారో వాళ్లకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాల్సి ఉంటుంది.

ఏ కంటెస్టెంట్‌కు ఏ నంబర్ అంటే..

ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన 8 మందిలో ఒక్కొక్కరికి ఒక్కో నంబర్ ఇచ్చారు. ఎవరైతే హౌజ్ లో కొనసాగాలని మీరు భావిస్తారో ఆ నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే వాళ్లకు మీ ఓటు పడుతుంది. హాట్‌స్టార్ యాప్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు.

అభయ్ నవీన్ - 7997983701

నాగ మణికంఠ - 7997983705

నైనిక - 7997983706

ప్రేరణ - 7997983708

విష్ణుప్రియ - 7997983713

పృథ్వీరాజ్ - 7997983709

సీత - 7997983710

యష్మి - 7997983714