Bigg Boss 8 Telugu: కొత్త క్లాన్‍లలో ఎవరున్నారంటే? అందరూ సలాం పెడుతున్నారంటూ విష్ణుప్రియపై నాగార్జున పంచ్: వీడియో-bigg boss 8 telugu abhay naveen new new cheif of house with nikhil and weekend episode promo out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: కొత్త క్లాన్‍లలో ఎవరున్నారంటే? అందరూ సలాం పెడుతున్నారంటూ విష్ణుప్రియపై నాగార్జున పంచ్: వీడియో

Bigg Boss 8 Telugu: కొత్త క్లాన్‍లలో ఎవరున్నారంటే? అందరూ సలాం పెడుతున్నారంటూ విష్ణుప్రియపై నాగార్జున పంచ్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 15, 2024 12:17 PM IST

Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ 8 సీజన్‍లో నిఖిల్‍తో పాటు అభయ్ కొత్త చీఫ్‍గా ఎంపికయ్యారు. ఈ రెండు క్లాన్‍ల్లో ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా ఉంది. నేడు ఆదివారం ఎపిసోడ్ కావడంతో ఫన్ గేమ్‍లతో పాటు ఎలిమినేషన్ కూడా ఉండనుంది.

Bigg Boss 8 Telugu: కొత్త క్లాన్‍లలో ఎవరున్నారంటే? అందరూ సలాం పెడుతున్నారంటూ విష్ణుప్రియపై నాగార్జున పంచ్: వీడియో
Bigg Boss 8 Telugu: కొత్త క్లాన్‍లలో ఎవరున్నారంటే? అందరూ సలాం పెడుతున్నారంటూ విష్ణుప్రియపై నాగార్జున పంచ్: వీడియో

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఆదివారమైన నేడు (సెప్టెంబర్ 15) కంటెస్టెంట్‍లకు ఫన్ గేమ్స్ ఉండనున్నాయి. అలాగే, రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండనుంది. హౌస్‍లో రెండు కొత్త క్లాన్‍లు ఏర్పడ్డాయి. నైనిక, యష్మిను చీఫ్‍లుగా తీసేశారు హోస్ట్ నాగార్జున. దీంతో నిఖిల్ చీఫ్‍గానే ఉండగా.. అభయ్ కొత్త చీఫ్ అయ్యారు. దీంతో ఇద్దరి క్లాన్‍లోకి కంటెస్టెంట్లు రానున్నారు. నేటి ఎపిసోడ్‍లో క్లాన్‍ల్లోకి కంటెస్టెంట్ల రాకతో పాటు గేమ్స్, ఎలిమినేషన్ ఉండనున్నాయి. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన తొలి ప్రోమోను స్టార్ మా తీసుకొచ్చింది.

ఏ క్లాన్‍లో ఎవరు..

హౌస్‍కు ఇద్దరు చీఫ్‍లు ఫిక్స్ అయ్యారని, ఏ క్లాన్‍లో ఎవరు అని తేలాలని నాగార్జున చెప్పటంతో ఈ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత నిఖిల్ క్లాన్‍లోకి వెళతానని విష్ణుప్రియ చెప్పారు. తన గొయ్యి తానే తీసుకున్నానని విష్ణు సరదాగా అన్నారు.

నిఖిల్ ఎక్కువగా వింటూ ఉంటాడని, అందుకే అతడి క్లాన్‍లోకి వెళతానని శేఖర్ బాషా అన్నారు. దీంతో “నువ్వు మాట్లాడతానే ఉంటే.. వినే వాళ్లు కావాలి” అని అతడిపై నాగ్ జోక్ వేశారు. అభయ్ టీమ్‍లోకి వెళతానని నబీల్ అన్నారు. అయితే అతడిని నిఖిల్ అని అభయ్ అన్నారు. దీంతో అందరూ నవ్వారు.

క్లాన్‍లలో వీరేనా!

నిఖిల్, అభయ్ క్లాన్‍లలో ఎవరు ఉంటారో సమాచారం ఇప్పటికే లైవ్ ద్వారా బయటికి వచ్చింది. నిఖిల్ క్లాన్‍లో సోనియా, విష్ణుప్రియ, సీత, పృథ్వి, నైనిక ఉండనున్నారు. అభయ్ క్లాన్‍లో ఆదిత్య, యష్మి, మణికంఠ, నబీల్, ప్రేరణ ఉంటారని తెలుస్తోంది. ఈ విషయంపై నేటి ఎపిసోడ్‍లో క్లారిటీ రానుంది. శేఖర్ బాషా ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

విష్ణుప్రియపై నాగ్ పంచ్

'చిత్రం విచిత్రం' అంటూ కంటెస్టెంట్లకు ఓ గేమ్ పెట్టారు నాగార్జున. ఫొటోలను వస్తువులను చూసి అందులోని వాటితో సరైన పదాలు చెప్పాలనేలా ఓ గేమ్ ఇచ్చారు. యాపిల్, మిరపకాలను చూపిస్తే మెరుపుల్ అంటూ శేఖర్ ఏదో లాజిక్ చెప్పారు. మిరపకాయలోని మిర, యాపిల్‍లోని పిల్ కలిపి మెరుపుల్ అని అన్నారు. దీంతో పాయింట్ గోవిందా అని నాగార్జున చెప్పారు.

సెల్‍ఫోన్ అని ఓ ఫొటోకు సీత ఆన్సర్ ఇచ్చారు. దీంతో వెనుక నుంచి ఎవరో హెల్ప్ చేశారని నాగార్జున అన్నారు. విష్ణును అడిగారు. దీంతో “నాకు అంత బ్రెయిన్ ఉంటే నేను ఐఏఎస్ అయి ఉండేదాన్ని” అని విష్ణు అనడంతో నాగ్ షాక్ అయ్యారు. “దుబాయ్ షేక్ మీకు సలాం పెడుతోంది” అని ఓ ఫొటోకు ఆన్సర్‌గా విష్ణు ఏదో చెప్పారు. దీంతో టీమ్‍కు ఇంకో మైనస్ పాయింట్ అని నాగ్ చెప్పారు. “ఒక్క దుబాయ్ షేకే కాదు.. అందరూ నీకు సలాం పెడుతున్నారు ఇప్పుడు” అని విష్ణుపై నాగ్ సరదాగా పంచ్ వేశారు.

కాగా, రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా నేడు ఉండనుంది. నామినేషన్లలో ఎనిమిది మంది నిలువగా.. ఇప్పటికే నైనిక, నిఖిల్ సేవ్ అయ్యారు. అయితే, ఈ వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అవుతారని లీకులు వచ్చాయి. శేఖర్ భార్య కుమారుడికి జన్మనిచ్చారు. దీంతో అతడు బయటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.