Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా అలా బెదిరిస్తున్నారు: నాగ్‍కు విష్ణుప్రియ కంప్లైట్.. సోనియాతో మళ్లీ వాగ్వాదం: వీడియో-bigg boss 8 telugu latest promo shekar basha threatening with jokes vishnu priya complaints to nagarjuna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా అలా బెదిరిస్తున్నారు: నాగ్‍కు విష్ణుప్రియ కంప్లైట్.. సోనియాతో మళ్లీ వాగ్వాదం: వీడియో

Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా అలా బెదిరిస్తున్నారు: నాగ్‍కు విష్ణుప్రియ కంప్లైట్.. సోనియాతో మళ్లీ వాగ్వాదం: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 08, 2024 05:45 PM IST

Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ 8 హౌస్‍లో ఫస్ట్ సండే కాస్త సరదాగా, కాస్త సీరియస్‍గా సాగినట్టు అర్థమవుతోంది. శేఖర్ బాషాపై నాగార్జునకు కంప్లైట్ చేశారు విష్ణుప్రియ. సోనియాతో ఆమె ఫైట్ కొనసాగింది. నేటి ఎపిసోడ్ రెండో ప్రోమోలో ఏముందంటే..

Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా అలా బెదిరిస్తున్నారు: నాగ్‍కు విష్ణుప్రియ కంప్లైట్.. సోనియాతో మళ్లీ వాగ్వాదం: వీడియో
Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా అలా బెదిరిస్తున్నారు: నాగ్‍కు విష్ణుప్రియ కంప్లైట్.. సోనియాతో మళ్లీ వాగ్వాదం: వీడియో

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఫస్ట్ ఆదివారం ఎపిసోడ్ నేడు (సెప్టెంబర్ 8) ఉండనుంది. కంటెస్టెంట్లతో సండే స్పెషల్‍గా సరదాగా ఆటలు ఆడించనున్నారు హోస్ట్ కింగ్ నాగార్జున. అలాగే, ప్రతీ కంటెస్టెంట్ ఒకరిపై అభ్యంతరాలు తెలుపాలనేలా చెప్పారు. అలాగే, డేంజర్ జోన్‍లో ఉన్న ఐదుగురి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండనుంది. నేటి ఆదివారం ఎపిసోడ్‍కు సంబంధించిన రెండో ప్రోమోను కూడా స్టార్ మా ఛానెల్ తీసుకొచ్చింది.

శేఖర్‌పై నిఖిల్

ఓ కంటెస్టెంట్‍కు ఒక యానిమల్ డెడికేట్ చేసి.. వారిపై ఉన్న అభ్యంతరాలు తెలపాలనే టాస్క్‌ ఇచ్చారు నాగార్జున. దోమ ఉన్న బోర్డును శేఖర్ బాషా మెడలో వేశారు నిఖిల్. శేఖర్ వేసే జోకుల తలపై నుంచి వెళ్లిపోతున్నాయని, సీరియస్‍గా ఉన్నప్పుడు కూడా జోక్స్ చేస్తున్నారని నిఖిల్ అన్నారు. దోమ.. అంటే దో..మ.. ఇద్దరు తల్లులతో సమానం అంటూ మరో జోక్ వేశారు శేఖర్. కరెక్టుగా ఇచ్చావని నిఖిల్‍తో నాగ్ అన్నారు.

జోక్‍లతో బెదిరిస్తున్నారు

నామినేట్ చేసినందుకు శేఖర్ బాషా పిచ్చిపిచ్చి జోక్‍లు చెప్పారని విష్ణుప్రియ అన్నారు. ఇంకోసారి నామినేట్ చేస్తావా అని బెదిరిస్తున్నారని అని నాగ్‍కు విష్ణుప్రియ కంప్లైట్ చేశారు. దీంతో అందరూ నవ్వారు. ఈ టెక్నిక్ ఏదో బాగుందని నాగార్జున సరదాగా అన్నారు.

జోక్‍గా తీసుకుంటుందనుకున్న విషయాలను నైనిక చాలా పర్సనల్‍గా తీసుకుంటోందని కిర్రాక్ సీతపై నైనిక అసంతృప్తి వ్యక్తం చేశారు. నమ్మదగిన వ్యక్తి కాదని తేలు ఉన్న బోర్డును మెడలో వేశారు. చెత్త బుట్టులో బాటిల్‍ను బయటికి తీసిన విషయంలోనే ఇలా అంటూ సీత అన్నారు.

తనను తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోలేదంటూ బేబక్కకు తెలివి తక్కువ ట్యాగ్ వేశారు పృథ్విరాజ్. దీంతో అప్పుడే ఎలా డిసైడ్ చేస్తారని.. బిగ్‍బాస్ 100 రోజులు ఎందుకని, ఒక్క రోజులోనే చేయాలని బేబక్క ఫైర్ అయ్యారు.

కొనసాగిన సోనియా, విష్ణు ఫైట్

విష్ణు మెడలో కన్నింగ్ అంటూ నక్క బోర్డ్ వేశారు సోనియా. పరోక్షంగా విష్ణు రెచ్చగొడుతున్నారని సోనియా అన్నారు. తాను అప్పుడే సారీ చెప్పినా.. అడల్ట్ రేటెడ్ జోక్స్ వేయవద్దని సోనియా అనడం కరెక్ట్ కాదని విష్ణు చెప్పారు. వీరిద్దరి మధ్య ఫైట్ కొనసాగింది.

శేఖర్ బాషాకు చిరాకు అంటూ దోమ బోర్డ్ డెడికేట్ చేశారు నాగ మణికంఠ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని శేఖర్ అన్నారు. నాగార్జున జోక్ వద్దన్నా.. అతడు అదే పని చేశారు. మణికంఠ ఎక్కడో మూలకు కూర్చొని ఎవరైనా వెళితే చి..రాకు అని ఒక్కడే ఉంటున్నాడని మరో ఆటో పంచ్ వేశారు శేఖర్. దీంతో నాగార్జున గట్టిగా నవ్వారు.

జీరోతో ప్రైజ్‍మనీతో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ షురూ అయింది. కంటెస్టెంట్లు ప్రతీ వారం ఆడే ఆటను బట్టి ప్రైజ్‍మనీ పెరుగుతుందని నేటి ఎపిసోడ్‍కు సంబంధించిన తొలి ప్రోమోలో నాగార్జున చెప్పారు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ మధ్య ఓ గేమ్ పెట్టారు నాగ్. హీరోల పేరు చెబితే వారు నటించిన సినిమాలను పేర్లను చెప్పాలని కంటెస్టెంట్లకు టాస్క్ ఇచ్చారు. ఈ ఆట సరదాగా సాగింది. నామినేషన్లలో డేంజర్ జోన్‍లో ఉన్న బేబక్క, నాగమణికంఠ, విష్ణుప్రియ, శేకర్ బాషా, పృథ్విరాజ్ మధ్య ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండనుంది. బేబక్క ఎలిమినేట్ అవుతారనే అంచనాలు ఉన్నాయి. నేటి ఎపిసోడ్‍లో ఈ విషయం తేలనుంది.