Bigg Boss 8 Telugu: వీకెండ్ ఎపిసోడ్‍లో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. ‘నువ్వు కూడా అమ్మాయివేగా’ అంటూ విష్ణుప్రియకు క్లాస్
Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ 8వ సీజన్‍లో ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ నేడు ఉండనుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. జడ్జిమెంట్ విషషయంలో నాగార్జున ఓ ట్విస్ట్ ఇచ్చారు. విష్ణుప్రియ, సోనియా ఫైట్‍ను హైలైట్ చేశారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. శనివారమైన నేడు (సెప్టెంబర్ 7) హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో మాట్లాడనున్నారు. వారు చేసిన తప్పులను ఎత్తిచూపటంతో పాటు కొన్ని గేమ్స్ ఆడించనున్నారు. నేటి ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా తీసుకొచ్చింది. హౌస్‍లో వినాయక చవితి సెలెబ్రేషన్స్ కూడా ఉండనున్నాయి. ఇక, సోనియాతో గొడవ విషయంలో విష్ణుప్రియకు క్లాస్ తీసుకున్నారు నాగార్జున. ఈ ప్రోమోలో ఏముందంటే..
గణబప్పా మోరియా.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ వీకెండ్ ఎపిసోడ్‍కు నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మా పండుగ ఇప్పుడే స్టార్ అయింది.. మిమ్మల్ని చూశాక” అంటూ విష్ణుప్రియ అన్నారు. అందకీ స్వీట్స్ చెప్పించానని నాగ్ చెప్పటంతో అందరూ గంతులేశారు.
ఇదే ట్విస్ట్
అఖిల్ క్లాన్ వీక్‍గా ఉందని నాగార్జున.. అంటే మారుస్తానని అతడు చెప్పారు. అయితే, ఏం మారుస్తావ్ మామ అంటూ నాగ్ అంటే అందరూ నవ్వారు. గత సీజన్లలో వారమంతా కంటెస్టెంట్లు వ్యవహిరించిన తీరుపై వీకెండ్ ఎపిసోడ్‍లో సాధారణంగా హోస్ట్ నాగార్జున జడ్జిమెంట్ ఇచ్చేవారు. అయితే, ఈ సీజన్‍లో ఆ పనిని ముందు కంటెస్టెంట్లే చేయాలంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగ్.
“ప్రతీ సీజన్‍లో శనివారం నేను వచ్చి వారమంతా జరిగిన దానికి జడ్జిమెంట్ ఇస్తా కదా. కానీ ఈ సీజన్ 8లో వేరేగా ఉంటుంది. ఈసారి మీ జడ్జిమెంట్‍తో మొదలువుతుంది” అని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. నడుములకు దిండు లాంటిది కంటెస్టెంట్లు కట్టుకున్నారు. కంప్లైట్స్ ఉన్న వారికి కత్తి గుచ్చి కారణాలు చెప్పాలనేలా నాగ్ చెప్పారు. మణికంఠ ప్రవర్తనపై శేఖర్ బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు.
విష్ణుప్రియకు క్లాస్
అడల్ట్ రేటెడ్ జోక్స్ వేయవద్దని విష్ణుప్రియను సోనియా వారించడం, ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన గొడవను నాగార్జున ప్రస్తావించారు. నిఖిల్, సోనియాపై విష్ణుప్రియ చేసిన కామెంట్లు ఈ ప్రోమోలో ఉన్నాయి. “ఈమె ఒకరే పుణ్యస్త్రీ.. మేం ఇక్కడ ఇలాంటి వారమా” అని సోనియాను ఉద్దేశించి విష్ణుప్రియ అనడంపై నాగ్ ప్రశ్నించారు. “నేను బాధపడ్డాను. ఏడ్వనంతా మాత్రానా..” అని విష్ణు అంటే.. బాధపడితే సోనియాను గుచ్చుతావా అని నిలదీశారు.
“నువ్వు కూడా అమ్మాయే కదా.. నీకు అర్థం కావాలి” అని విష్ణుప్రియకు నాగార్జున క్లాస్ తీసుకున్నారు. “పిడికిలి బిగించి అలా ఏంటి.. కోపం వచ్చిందా” అని సోనియాను నాగ్ అడిగారు. ఇప్పుడు బాగానే ఉందని ఆమె చెప్పారు. ఆ తర్వాత బేబక్క విషయంలో సోనియా ప్రవర్తనపై పంచ్ వేశారు. “అన్ని కుక్కర్లు ఒకేలా పని చేయవు. అలాగే అందరి ఎమోషన్లు ఒకేలా ఉండవు” అని నాగార్జున అన్నారు.
క్లాన్‍కు చీఫ్‍గా ఉన్న యష్మి గౌడపై కిర్రాక్ సీత కంప్లైట్ చేశారు. క్లాన్‍కు చీఫ్ ఎంత ముఖ్యమో.. హౌస్‍కు పాజిటివ్ వ్యక్తి అంత అవసరమని సీత అన్నారు. యష్మి వల్ల మొత్తం హౌస్‍లో సామరస్యం పోయిందని ఆమె చెప్పారు. “ఆట అదే కదా. ఇంకా ముందు ముందు చాలా చూస్తావ్” అని నాగార్జున అన్నారు. ఈ తతంగం ఎలా సాగిందన్నది నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది.