Bigg Boss 8 Telugu Elimination: హౌస్ నుంచి శేఖర్ బాషా ఎలిమినేషన్!.. కారణం ఇదే.. ఓటింగ్‍లో ముందున్నా కానీ!
Bigg Boss 8 Telugu Elimination: బిగ్‍బాస్ 8 రెండో వారం ముగింపునకు వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో సమాచారం వెల్లడైంది. శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికి వచ్చేయనున్నారని టాక్. అందుకు కారణమేంటో కూడా సమాచారం బయటికి వచ్చింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. రెండో వారం వీకెండ్ కూడా వచ్చేసింది. నేడి (సెప్టెంబర్ 15) ఆదివారం ఎపిసోడ్‍లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండనుంది. అయితే, ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం పక్కా అయింది. హౌస్‍లో ఇతరుల కంటే కంటే కాస్తోకూస్తో ఎంటర్‌టైన్‍మెంట్ ఇస్తున్న ఆర్జే శేఖర్ బాషా ఈ వారం ఎలిమినేట్ అవనున్నారనే సమాచారం లీకుల ద్వారా బయటికి వచ్చేసింది. ఓటింగ్‍లో అతడు టాప్‍లో ఉన్నా ఎలిమినేట్ అయ్యేందుకు ఓ బలమైన కారణం ఉంది.
తండ్రి కావడంతో..
శేఖర్ బాషా తండ్రి అయ్యారు. ఆయన భార్య మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శనివారం ఎపిసోడ్‍లోనే నాగార్జున ప్రకటించారు. ఈ కారణంగానే శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నారట. బయటికి రావాలంటే ఎలిమనేషన్ ఒక్కటే ఆప్షన్. అందుకే ఎలిమినేట్ అయ్యేందుకే శేఖర్ బాషా నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. నేటి ఎపిసోడ్‍లో ఈ విషయంపై తేలనుంది.
ఓటింగ్‍లో ముందున్నా..
ఈ రెండో వారం ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. పృథ్విరాజ్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. ఆదిత్య, సీతలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే, సడెన్‍గా శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఓటింగ్ పరంగా చూస్తే శేఖర్ బాషానే ముందు ఉన్నారు. కానీ కొడుకు పుట్టడంతో అతడు బయటికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
బిస్‍బాస్ అభిమానులకు నిరాశ!
ఈ బిగ్‍బాస్ 8 సీజన్‍లో పెద్దగా ఎంటర్‌టైన్‍మెంట్ అందించే కంటెస్టెంట్స్ సరిగా లేరనే భావన ఏర్పడిపోయింది. శేఖర్ బాషానే అప్పుడప్పుడు తన మార్క్ పంచ్‍లతో నవ్వించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు పంచ్‍లు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇలా.. ఎంటర్‌టైన్‍మెంట్ పంతుతున్న శేఖర్ కూడా హౌస్‍లో నుంచి వెళ్లిపోతుండటంతో బిగ్‍బాస్ అభిమానులకు నిరాశనే మిగిల్చనుంది.
మళ్లీ వస్తారా!
శేఖర్ బాషా ఇప్పుడు బిగ్‍బాస్ నుంచి బయటికి వెళ్లినా.. మళ్లీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. కావాలనే బయటికి పోతున్నారు కాబట్టి మరో ఛాన్స్ దొరకొచ్చు. కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా అతడిని మళ్లీ హౌస్‍లోకి పంపొచ్చు. అందులోనూ అతడికి మంచి ఫేమ్ రావటంతో ఇందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అందుకు శేఖర్ బాషా అంగీకరిస్తారా లేదా అనేది కూడా ఓ అంశమే. మరి అప్పటికల్లా ఏం జరుగుతుందో చూడాలి.
ఇక, విష్ణుప్రియపై కామెంట్లు చేసిన విషయంలో సోనియాకు గట్టిగానే క్లాస్ ఇచ్చారు హౌస్ట్ నాగార్జున. ఇంట్లో పట్టించుకునే వాళ్లు లేరంటూ విష్ణును సోనియా అనడంపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాళ్ల కుటుంబం గురించి తెలుసా.. తెలిసినా అలా ఎలా మాట్లాడావంటూ సోనియాను ప్రశ్నించారు. అసలు ఆ మాటలకు అర్థమేంటని ఆగ్రహించారు. దీంతో సోనియా ఏమీ చెప్పలేక బిక్కముఖం వేశారు. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేయడం గురించి కూడా నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, యష్మి గౌడ ప్రవర్తనపై కూడా నాగ్ ఆగ్రహించారు.