Telugu Cinema News Live September 10, 2024: OTT Comedy Family Drama: రావు రమేశ్ సినిమా రిలీజ్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో వస్తోందంటే..
10 September 2024, 20:22 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Maruthi Nagar Subramanyam OTT: మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రానికి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. అంచనాలకు మంచి ఈ చిత్రానికి కలెక్షన్లు రావటంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
- Jai Mahendran OTT Series Release Date: జై మహేంద్రన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది.
- Jr NTR on Devara: దేవర మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్. ఈ సందర్బంగా ఈ మూవీలో హైలైట్ ఏంటో చెప్పారు.
- OTT Horror Thriller: ఓటీటీలోకి మరో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం.ఈ మూవీ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
- Devara Trailer Released: దేవర సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ మోడ్‍లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. విజువల్స్ స్టన్నింగ్‍గా అదిరిపోయాయి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో అనిరుధ్ రవిచందర్ దుమ్మురేపారు.
- Devara Promotions: దేవర సినిమా ప్రమోషన్లను ముంబైలో జోరుగా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఓ బాలీవుడ్ హీరోయిన్‍తో కలిసి ఇంటర్వ్యూ చేశారు ఎన్టీఆర్.
- OTT Romantic Drama: లవ్ సితార చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమాలో శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
Kangana Ranaut Bungalow: బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత సినిమాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదల వాయిదా పడిపోయిన విషయం తెలిసిందే.
- OTT Movie: ఓటీటీలోకి మూడేళ్ల తర్వాత ఓ మలయాళం హిట్ మూవీ తెలుగులో వస్తుండటం విశేషం. ఈ స్పోర్ట్స్ డ్రామా నవంబర్, 2021లో థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి తెలుగులో రాబోతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీయే వెల్లడించింది.
- OTT Telugu movies releases: ఓటీటీల్లో ఈ వారం అదిరిపోయే తెలుగు చిత్రాలు వచ్చేస్తున్నాయి. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ కూడా అడుగుపెడుతోంది. అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్‍లు అయిన మరో రెండు చిత్రాలు.. అలాగే ఓ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.
- OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పటికే మంగళవారం (సెప్టెంబర్ 10) ఓ కామెడీ, మరో క్రైమ్ థ్రిల్లర్ మలయాళం సినిమాలు ఓటీటీలోకి రాగా.. తాజాగా ఈ డార్క్ కామెడీ కూడా అడుగు పెట్టింది.
Bigg Boss Telugu 8 September 10th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్ రెండో రోజు కూడా జోరుగా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 10 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సోనియా భద్రకాళిలా పోజులిచ్చింది.
- Devara History: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. మంగళవారం (సెప్టెంబర్ 10) సాయంత్రం ట్రైలర్ రిలీజ్ రిలీజ్ చేయనున్నారు.
OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 25 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏకంగా 15 వరకు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. అందులోనూ రెండు హారర్ సినిమాలతోపాటు క్రైమ్, కామెడీ, పొలిటికల్, స్పై థ్రిల్లర్ మూవీస్, ఇంట్రెస్టింగ్ కానున్నాయి.
- The GOAT Failure: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.. షార్ట్ గా ది గోట్.. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తెలుగులో ఫ్లాపవడానికి కారణమేంటో చెప్పాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. దీనికి ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తో అతడు లింకు పెట్టడం విశేషం.
Nindu Noorella Saavasam September 10th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లోను రణ్‌వీర్ ఇంట్లోకి మనోహరి వెళ్తుంది. తన కూతురుని ఎక్కడ వదిలేసానో చెబితే నువ్ కనుక్కోగలవ్, రణ్‌వీర్‌ను పంపించేయగలవు అని బాబ్జీతో అంటుంది మనోహరి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్లో..
- OTT Kannada Movie: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ కన్నడ ఆంథాలజీ డ్రామా వచ్చేస్తోంది. జులై 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.6 రేటింగ్ ఉండటం విశేషం. ఈ వారమే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Mathu Vadalara 2 Sri Simha About Prabhas Rajamouli: మత్తు వదలరా 2 సినిమాతో సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడు, యంగ్ హీరో శ్రీ సింహా. మత్తు వదలరా 2 టీజర్, ట్రైలర్‌పై ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి ఏం చెప్పారో తాజాగా ప్రమోషన్స్‌లో చెప్పాడు శ్రీ సింహా.
- Most Films in a year: ఒక ఏడాదిలో ఏ హీరో అయినా గరిష్ఠంగా ఎన్ని సినిమాలు చేయగలడు? ఐదు, పది, ఇరవై.. ఏడాదికి కాదు కదా మూడు, నాలుగేళ్లకు ఒక సినిమా తీస్తున్న ఈ రోజుల్లో ఇది అసాధ్యం. కానీ ఓ హీరో మాత్రం ఒకే ఏడాది ఏకంగా 35 సినిమాలు చేశాడంటే నమ్మగలరా?
- Horror Mystery OTT: ఓటీటీలోకి నాలుగేళ్ల తర్వాత ఓ హారర్ మిస్టరీ మూవీ రాబోతుండటం విశేషం. 2020లో రిలీజైన ఈ ఇంగ్లిష్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. థియేటర్లలో అంతంతమాత్రమే ఆడిన ఈ సినిమాకు ఓటీటీలో ఎంతమేర ఆదరణ దక్కుతుందో చూడాలి.
Gundeninda Gudigantalu Serial September 10th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో వడ్డీ ఎగ్గొట్టినందుకు బంగారు గాజులు తాకట్టు పెట్టిందని ప్రభావతి చేసిన మరో మోసాన్ని బయటపెడతాడు వడ్డీ వ్యాపారి. తర్వాత మీనాకు ఇంటి పేపర్స్ ఇస్తాడు సత్యం. ఇక తన లవ్ గురించి భయపడతాడు రవి.
- OTT Malayalam Movies: ఒకే రోజు రెండు వేర్వేరు ఓటీటీల్లోకి రెండు సూపర్ హిట్ మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో ఒకటి కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా కాగా.. మరొకటి క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచి ఈ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
- Karthika deepam 2 serial today september 10th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ ఈ పరిస్థితికి రావడానికి కారణం దీప అంటూ శ్రీధర్ చిందులు వేస్తాడు. తనని నోటికొచ్చినట్టు తిడతాడు. కార్తీక్ ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు.
Brahmamudi Serial September 10th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో రాజ్ కంట్రోల్‌లో లేడని ఇంటికి తీసుకొస్తాడు సుభాష్. అక్కడ రాజ్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి. దాంతో వచ్చిన ఫోన్ కాల్ గురించి, వెళ్లడం గురించి కావ్య చెబుతుంది. రాజ్ నమ్మడు, భార్యగా పనికిరావంటాడు.
Bigg Boss Telugu 8 September 9th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం నామినేషన్స్ కూడా చాలా హాట్ హాట్‌గా సాగాయి. ముఖ్యంగా ఈ నామినేషన్స్‌లో సోనియా వర్సెస్ కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియ అన్నట్లుగా సాగింది. అయితే, విష్ణుప్రియపై సోనియా దారుణంగా పర్సనల్ అటాక్ చేసింది.