OTT Telugu Releases: ఈవారం ఓటీటీల్లోకి 4 తెలుగు చిత్రాలు.. ఓ డిజాస్టర్, రెండు బ్లాక్‍బస్టర్లు, మరొకటి నేరుగా స్ట్రీమింగ్-ott telugu movies releases this week mr bachchan aay committee kurrollu netflix aha and etv win streaming date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Releases: ఈవారం ఓటీటీల్లోకి 4 తెలుగు చిత్రాలు.. ఓ డిజాస్టర్, రెండు బ్లాక్‍బస్టర్లు, మరొకటి నేరుగా స్ట్రీమింగ్

OTT Telugu Releases: ఈవారం ఓటీటీల్లోకి 4 తెలుగు చిత్రాలు.. ఓ డిజాస్టర్, రెండు బ్లాక్‍బస్టర్లు, మరొకటి నేరుగా స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 10, 2024 03:23 PM IST

OTT Telugu movies releases: ఓటీటీల్లో ఈ వారం అదిరిపోయే తెలుగు చిత్రాలు వచ్చేస్తున్నాయి. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ కూడా అడుగుపెడుతోంది. అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్‍లు అయిన మరో రెండు చిత్రాలు.. అలాగే ఓ సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.

OTT Telugu Movies: ఈవారం ఓటీటీల్లోకి 4 తెలుగు చిత్రాలు.. ఓ డిజాస్టర్, రెండు బ్లాక్‍బస్టర్లు.. మరొకటి నేరుగాస్ట్రీమింగ్
OTT Telugu Movies: ఈవారం ఓటీటీల్లోకి 4 తెలుగు చిత్రాలు.. ఓ డిజాస్టర్, రెండు బ్లాక్‍బస్టర్లు.. మరొకటి నేరుగాస్ట్రీమింగ్

ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈవారం (సెప్టెంబర్ రెండో వారం) ఇంట్రెస్టింగ్ సినిమాలు అడుగుపెట్టనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో తెలుగు చిత్రాలు చూడాలనుకునే వారికి పాపులర్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. రవితేజ హీరోగా నటించిన డిజాస్టర్ మూవీ మిస్టర్ బచ్చన్ ఇదే వారం వస్తోంది. తక్కువ బడ్జెట్‍తో వచ్చి బ్లాక్‍బస్టర్ అయిన రెండు చిత్రాలు కూడా అడుగుపెట్టనున్నాయి. మరో సినిమా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు రానుంది. ఇలా ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే నాలుగు తెలుగు సినిమాలు ఏవంటే..

మిస్టర్ బచ్చన్

హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం ప్లాఫ్‍గా నిలిచింది. ఆగస్టు 15న రిలీజైన ఈ యాక్షన్ డ్రామా మూవీ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఈ వారమే సెప్టెంబర్ 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. మిస్టర్ బచ్చన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

ఆయ్

రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఆయ్’ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. నార్నే నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్‍‍కుమార్, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 15నే థియేటర్లలోకి వచ్చింది. రూ.5కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.14కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్‍బస్టర్ అయింది. ఆయ్ చిత్రం సెప్టెంబర్ 12వ తేదీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆయ్ చిత్రానికి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు.

కమిటీ కుర్రోళ్ళు

కమిటీ కుర్రోళ్ళు చిత్రం కూడా తక్కువ బడ్జెట్‍తోనే వచ్చి అంచనాలకు మించి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ రూరల్ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ ఆగస్టు 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.5కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.17 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయింది. నిర్మాతగా తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నారు కొణిదెల నిహారిక. కమిటీ కుర్రోళ్ళు సినిమా సెప్టెంబర్ 12వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, త్రినాథ్ వర్మ లీడ్ రోల్స్ చేశారు.

బాలుగాని టాకీస్

బాలుగాని టాకీస్ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా ఆహాలో అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్ నడుపుకునే యువకుడు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. బాలుగాని టాకీస్ మూవీలో హీరోగా బాలకృష్ణ అభిమానిగా ఉంటారు. ఈ మూవీని సెప్టెంబర్ 13 నుంచి ఆహాలో చూడొచ్చు.