Committee Kurrollu OTT: అప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు.. ఇప్పుడు డిమాండ్ డబుల్: నిహారిక కొణిదెల-committee kurrollu ott demand doubled says movie producer niharika konidela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Committee Kurrollu Ott: అప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు.. ఇప్పుడు డిమాండ్ డబుల్: నిహారిక కొణిదెల

Committee Kurrollu OTT: అప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు.. ఇప్పుడు డిమాండ్ డబుల్: నిహారిక కొణిదెల

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 11, 2024 03:14 PM IST

Niharika Konidela on Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. తక్కువ బడ్జెట్ చిత్రంగా వచ్చి దుమ్మురేపుతోంది. అయితే, ఓటీటీ డీల్ విషయంపై ఈ మూవీ నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా మాట్లాడారు.

Committee Kurrollu OTT: అప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు.. ఇప్పుడు డిమాండ్ డబుల్: నిహారిక కొణిదెల
Committee Kurrollu OTT: అప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు.. ఇప్పుడు డిమాండ్ డబుల్: నిహారిక కొణిదెల

కమిటీ కుర్రోళ్ళు సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ వచ్చింది. మెగా డాటర్ నటి నిహారిక కొణిదెలకు నిర్మాతగా ఇది తొలి మూవీ కావటంతో ఆసక్తి ఏర్పడింది. అందులోనూ ఎక్కువ శాతం కొత్త నటీనటులతోనే విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వచ్చింది. 11 మంది హీరోలు అంటూ ప్రమోషన్లు మూవీ చేసింది. ఆగస్టు 9న రిలీజైన కమిటీ కుర్రోళ్ళు సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో అంచనాలకు మించి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ ఓటీటీ డీల్ గురించి నిహారిక మాట్లాడారు.

yearly horoscope entry point

అప్పుడు ముందుకు రాలేదు.. ఇప్పుడేమో

కమిటీ కుర్రోళ్ళు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీసుకునేందుకు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు ముందు ఇంట్రెస్ట్ చూపలేదని నిహారిక కొణిదెల తెలిపారు. రిలీజ్ తర్వాత ఇప్పుడు సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో తమ సినిమా ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందని తెలిపారు.

కమిటీ కుర్రోళ్ళు హక్కుల కోసం ఇప్పటికే భారీ మొత్తం ఆఫర్ చేస్తూ కొన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు సంప్రదించాయని నిహారిక వెల్లడించారు. ఈ మూవీకి ఓటీటీ డిమాండ్ డబుల్ అయిందని తెలిపారు. అయితే, ఈ సినిమా ఓటీటీ హక్కుల డీల్ ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది.

రెండు రోజుల కలెక్షన్లు ఇవే

కమిటీ కుర్రోళ్ళు సినిమా రెండు రోజుల్లో రూ.3.69కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. మొదటిరోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. మౌత్ టాక్ బాగా రావటంతో కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యధు వంశీ దర్శకత్వం వహించారు. గోదావరి విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యంగ్ యాక్టర్లతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కామెడీ, నటీనటుల పర్ఫార్మెన్స్, 1990లను జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఉన్న సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, ప్రసాద్ బెహరా, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యాం కల్యాణ్, రఘువరన్, శివకుమార్, అక్షయ్ శ్రీనివాస్, తేజస్వి రావ్, టీనా శ్రావ్య సహా మరికొందరు మెయిన్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి 11 మంది హీరోలు అంటూ ముందు నుంచి ప్రమోషన్లను చేస్తోందని మూవీ టీమ్. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.

కమిటీ కుర్రోళ్ళు స్టోరీలైన్

పశ్చిమ గోదావరిలోని పురుషోత్తమపల్లి అనే గ్రామంలో స్నేహితుల మధ్య కమిటీ కుర్రోళ్ళు సినిమా సాగుతుంది. శివ (సందీప్ సరోజ్), సూర్య (యశ్వంత్) సహా మరికొందరు స్నేహితులుగా ఉంటారు. అయితే, ఇంటర్మీడియట్ పూర్తయ్యాక గొడవలు వచ్చి విడిపోతారు. ఆ తర్వాత వచ్చే జాతరలో ఆ గొడవలు మరింత పెరుగుతాయి. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీబిజీగా ఉంటారు. అయితే, జాతర కోసం 12ఏళ్ల తర్వాత మళ్లీ అప్పటి స్నేహితులు గ్రామానికి వస్తారు. అప్పుడే గ్రామంలో ఎన్నికలు కూడా వస్తాయి. జాతరకు కూడా ఇబ్బంది తలెత్తుతుంది. 12ఏళ్ల తర్వాత ఒకే చోటికి వచ్చిన స్నేహితులు మళ్లీ కలిసిపోయారా? జాతరను జరిపించారా? ఎన్నికలు ఎలా జరుగుతాయి? అనేది కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో మెయిన్ పాయింట్లుగా ఉన్నాయి.

Whats_app_banner