Niharika Konidela: తక్కువ చేసి మాట్లాడితే జనమే కౌంటర్లు ఇస్తున్నారు.. నిహారిక కొణిదెల కామెంట్స్
Niharika Konidela In Committee Kurrollu Success Meet: తక్కువ చేసి మాట్లాడితే జనమే కౌంటర్స్ ఇస్తున్నారు అని నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిహారిక కొణిదెల సమర్పిస్తూ నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ సక్సెస్ మీట్‌లో ఈ కామెంట్స్ చేశారు.
Niharika Konidela At Committee Kurrollu Success Meet: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పిస్తూ నిర్మించిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా మూవీ కమిటీ కుర్రోళ్లు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే శనివారం (ఆగస్ట్ 10) కమిటీ కుర్రోళ్లు సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ కమిటీ కుర్రోళ్లు సక్సెస్ మీట్‌లో నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా చిత్రాన్ని రమేష్ గారు భుజానికెత్తుకుని నడిపించారు. పెట్టిన ప్రతీపైసా తెరపై కనిపిస్తుందని అంతా అంటున్నారు. వంశీ గారు మా అందరినీ నమ్మి సినిమాను రిలీజ్ చేసినందుకు థాంక్స్" అని నిహారిక కొణిదెల చెప్పారు.
"అంకిత్ కొయ్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. కథ వినమని అన్నాడు. వంశీ కథను వినాలని తీసుకున్నదే ది బెస్ట్ నిర్ణయం. నాకంటే ఎక్కువగా అంకిత్, రమేష్ గారు ఈ కథను నమ్మారు. మాతో పాటు సపోర్ట్‌గా నిలిచిన అంకిత్‌కు థాంక్స్. మంచి చిత్రాన్ని తీస్తే సరిపోదు. అది జనాల వరకు వెళ్లాలి. అలా జనాల వరకు తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్" అని నిహారిక కొణిదెల తెలిపారు.
"ఇది పీపుల్స్ సినిమా అయింది. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది" అని నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమ సినిమాను తక్కువ చేసి మాట్లాడితే జనాలే బుద్ధి చెప్పేలా ఉన్నారు అన్నట్లుగా నిహారిక కొణిదెల కామెంట్స్ ఉన్నాయి.
అలాగే ఈ కార్యక్రమంలో నిర్మాత జయ అడపాక మాట్లాడుతూ.. "మా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి మీడియా ముందు నుంచి సపోర్ట్‌గానే ఉంటోంది. మంచి కంటెంట్‌తో ముందుకు వస్తే ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ మళ్లీ నిరూపించారు. సినిమాను హిట్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. టీంకు కంగ్రాట్స్" అని తెలిపారు.
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. "కమిటీ కుర్రోళ్లు మూడేళ్ల క్రితం మొదలైంది. కథ విన్న వెంటనే నాకు తెలిసిన నిర్మాత వద్దకు తీసుకెళ్లాను. అలా తిరిగి తిరిగి నిహారిక గారి వద్దకు కథ వచ్చింది. ఈ చిత్రం మీద నమ్మకం కంటే భయం ఎక్కువగా ఉండేది. ఒక వేళ ఇది సక్సెస్ కాకపోయి ఉంటే.. ఇలాంటి ప్రయోగం ఇంకెవ్వరూ చేయకపోయేవాళ్లు. కొత్త వాళ్లను పెట్టి తీయాలనుకునే నిర్మాతలు భయపడేవాళ్లు" అని అన్నారు.
"సినిమాలో నటించిన ఈ కొత్త వాళ్లందరికీ అడగక ముందే పేమెంట్లు వచ్చాయి. ఇలాంటి చిత్రాన్ని హిట్ చేయకపోయి ఉంటే ఇంకెవ్వరూ ఇలాంటి సాహసాలు అయితే చేసి ఉండేవారు కాదు. సినిమా ముందుకు తీసుకొచ్చిన వంశీ గారికి థాంక్స్. ఈ మూవీ టీంని, సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది" అని అంకిత్ కొయ్య పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, కమిటీ కుర్రోళ్లు సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.