Bhagyashri Borse: రవితేజ ఎన్నో సినిమాలు చేశారు.. కానీ.. న్యూ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
Bhagyashri Borse Comments On Ravi Teja Mr Bachchan: రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ హీరోయిన్, న్యూ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే తెలుగు భాషపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు భాష, రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్, తెలుగు డబ్బింగ్‌పై భాగ్యశ్రీ బోర్సే పలు వ్యాఖ్యలు చేసింది.
Bhagyashri Borse Comments On Ravi Teja: ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంటోంది భాగ్య శ్రీ. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాలో గ్లామర్‌తో చాలా అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా పాటల్లో చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి.
అలాగే రవితేజ ఎనర్జీకి సరిపోయేలా డ్యాన్స్ చేస్తూ హాట్ షో చేసింది భాగ్యశ్రీ బోర్సే. దీంతో సరికొత్త నేషనల్ క్రష్‌గా భాగ్యశ్రీ బోర్సే మారిపోయినట్లు తెగ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.
తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది?
-ఇది నా మొదటి తెలుగు సినిమా. నా వాయిస్ అయితే ఆడియన్స్ మరింత రిలేట్ చేసుకుంటారని డైరెక్టర్ గారిని కోరాను. తెలుగు డబ్బింగ్ చెప్పడం మొదట్లో కాస్త డిఫికల్ట్ అనిపించింది. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్, టీం చాలా సపోర్ట్ చేసింది. దాదాపు వారం రోజుల్లో డబ్బింగ్ ఫినిష్ చేశాను. చాలా బాగొచ్చింది.
షూటింగ్‌లో ఎదురుకున్న ఛాలెంజ్ ఏమిటి?
-నేను నార్త్ అమ్మాయిని. తెలుగు భాషని మొదట్లో అర్ధం చేసుకోవడం కాస్త కష్టం అనిపించింది. ప్రతి డైలాగ్‌ని నా మాతృభాషకి ట్రాన్స్‌లేట్ చేసుకొని అర్ధం చేసుకున్నాను. అయితే కొద్ది రోజుల తర్వాత భాషపై పట్టు సాధించాను. ఆ తర్వాత అంత ఈజీ అయింది. తెలుగు భాష చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుంది. పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
హరీష్ శంకర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
- హరీష్ గారు చాలా పాషనేట్ డైరెక్టర్. హరీష్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ ఎక్స్‌పీరియన్స్. హరీష్ గారు, రవిగారికి ఎంతో అనుభవం ఉంది. నేను 'చందూ చాంపియన్'లో చిన్న క్యామియో తప్పితే సినిమాలు చేయలేదు. హరీష్ గారు, రవి గారు చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్‌తో ఎక్కడా డిఫికల్ట్‌గా ఫీల్ అవ్వలేదు. ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం.
రవితేజ గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
-రవితేజ గారు ఎన్నో సినిమాలు చేశారు. కానీ, ఇప్పటికీ ఆయన న్యూకమ్మర్‌లానే ఉంటారు. సెట్‌లో టైంకి ఉంటారు. ఎవరికీ ట్రబుల్ ఇవ్వరు. అందరినీ కేరింగ్‌గా చూసుకుంటారు. మనం ఏ స్టేజ్‌లో ఉన్నా మన క్రాఫ్ట్‌కి గౌరవం ఇవ్వాలని ఆయన్ని చూసి నేర్చుకున్నాను.
మిక్కీ జే మేయర్ గురించి?
-మిక్కీ గారు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. రెప్పల్, డప్పుల్, సితార్, జిక్కీ పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఎక్కడా విన్నా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. నా మొదటి సినిమాకే ఇంత అద్భుతమైన ఆల్బం రావడం చాలా ఆనందంగా ఉంది.
పాటల్లో మీ డ్యాన్స్ మూమెంట్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయ? ఈ రెస్పాన్స్ ఊహించారా?
-నాకు డ్యాన్స్ ఇష్టం. ఫ్రీ సమయంలో డ్యాన్స్ చేస్తుంటాను. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ఆడిటోరియం దద్దరిల్లింది. డ్యాన్స్ మూమెంట్స్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. కొన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిని మేకర్స్ అనౌన్స్ చేస్తారు.