Niharika Konidela: ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. నిహారిక కొణిదెల మూవీపై సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్-siddu jonnalagadda comments on niharika konidela in committee kurrollu trailer launch siddu jonnalagadda speech ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Niharika Konidela: ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. నిహారిక కొణిదెల మూవీపై సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్

Niharika Konidela: ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. నిహారిక కొణిదెల మూవీపై సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Jul 27, 2024 08:27 AM IST

Siddu Jonnalagadda Niharika Konidela Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పించిన సినిమా కమిటీ కుర్రోళ్లు మూవీపై టిల్లు స్క్వేర్ మూవీ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కమిటీ కుర్రోళ్లు ట్రైలర్ లాంచ్ ‌ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. నిహారిక కొణిదెల మూవీపై సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్
ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. నిహారిక కొణిదెల మూవీపై సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్

Siddu Jonnalagadda About Niharika Konidela Movie: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాకు య‌దు వంశీ దర్శకత్వం వహించారు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది.

ఇది వరకు రిలీజ్ చేసిన కమిటీ కుర్రోళ్లు టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు (జూలై 26) కమిటీ కుర్రోళ్లో మూవీ ట్రైలర్‌ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా నిర్వహించిన కమిటీ కుర్రోళ్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"నన్ను పిలిచి ఈ కమిటీ కుర్రోళ్లు చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారిక గారికి థాంక్స్. ఇది చిన్న చిత్రం కాదని అర్థమైంది. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి" అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపాడు.

"ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. యదు గారికి ఇది మొదటి సినిమాలా అనిపించడం లేదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక గారు మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు.. షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలు వస్తే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. పెద్ద హిట్ చేస్తారు" అని టిల్లు స్క్వేర్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చెప్పాడు.

ఇక ఈ ఈవెంట్‌లో కమిటీ కుర్రోళ్లు దర్శ‌కుడు య‌దు వంశీ మాట్లాడుతూ.. "మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు గారికి థాంక్స్. మా సినిమాలో నటించిన 11 మంది కూడా సిద్దు గారిలానే ఎంతో కష్టపడుతుంటారు. మా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సినిమా చూస్తే చాలా రీఫ్రెష్‌గా, నోస్టాల్జిక్‌గా అనిపిస్తుంది" అని తెలిపారు.

"నిహారిక గారు, ఫణి గారు లేకపోతే మూవీని ఇంత బాగా తీసేవాళ్లం కాదు. రమేష్ గారు మాకు ఎంతో అండగా నిలిచారు. మేం మంచి చిత్రాన్ని తీశాం. ఆగస్ట్ 9న మా సినిమా థియేటర్లోకి రానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి" అని కమిటీ కుర్రోళ్లు డైరెక్టర్ యదు వంశీ కోరారు.

నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. "మా కమిటీ కుర్రోళ్లు టీంకు కంగ్రాట్స్. చాలా మంచి చిత్రాన్ని తీశాం. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు గారికి థాంక్స్. ఎమోషనల్ క్యారీ అయ్యేట్టుగా.. అనుకున్నది అనుకున్నట్టుగా యదు సినిమాను తీశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి" అని అన్నారు.

Whats_app_banner