Gundeninda Gudigantalu Today Episode: బయటపడిన ప్రభావతి కొత్త మోసం- మీనాకు ఇంటి పేపర్స్ బాధ్యత- కోడలికి అత్త వార్నింగ్-gundeninda gudigantalu serial september 10th episode a responsibility for meena gundeninda gudigantalu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: బయటపడిన ప్రభావతి కొత్త మోసం- మీనాకు ఇంటి పేపర్స్ బాధ్యత- కోడలికి అత్త వార్నింగ్

Gundeninda Gudigantalu Today Episode: బయటపడిన ప్రభావతి కొత్త మోసం- మీనాకు ఇంటి పేపర్స్ బాధ్యత- కోడలికి అత్త వార్నింగ్

Sanjiv Kumar HT Telugu
Sep 10, 2024 08:50 AM IST

Gundeninda Gudigantalu Serial September 10th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో వడ్డీ ఎగ్గొట్టినందుకు బంగారు గాజులు తాకట్టు పెట్టిందని ప్రభావతి చేసిన మరో మోసాన్ని బయటపెడతాడు వడ్డీ వ్యాపారి. తర్వాత మీనాకు ఇంటి పేపర్స్ ఇస్తాడు సత్యం. ఇక తన లవ్ గురించి భయపడతాడు రవి.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఇక నుంచి ఇంటి పత్రాలు జాగ్రత్తగా చూసుకోండి అని వడ్డీ వ్యాపారి అంటాడు. వెళ్లబోతున్న సత్యంబాబు వాళ్లను ఆగమని గాజుల బాక్స్ తీస్తాడు. అది చూసి ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటీ వడ్డీ కడితే గిఫ్ట్ కూడా ఇస్తారా అని బాలు సెటైర్ వేస్తాడు. ఇంతలో ఆ బాక్సును ప్రభావతి లాక్కుంటుంది.

ఇందులో నీ చరిత్రలోని ఇంకో పేజీ దాచిపెట్టి ఉందేమో అని తల్లి నుంచి బాక్స్ లాక్కుని అందులో ఉన్న గాజులు చూస్తాడు బాలు. గాజులు గిఫ్ట్ ఇచ్చారు నాన్నా అని బాలు అంటాడు. అవును, ఇవి అమ్మ గాజులే అని మౌనిక, రవి అంటారు. దాంతో సత్యం షాక్ అవుతాడు. మరి అత్తయ్య చేతికి ఉన్న గాజులేంటీ అని మీనా డౌట్‌తో అడుగుతుంది. సంగతి ఏంటీ అని ప్రభావతి చేతి గాజులు చూస్తాడు బాలు. వాటిలో ఏవి ఒరిజినల్ అని బాలు అడుగుతాడు.

అడ్డుకున్న బాలు

దాంతో ఆయన ఇచ్చినవే ఒరిజినల్‌లా ఉన్నాయి. కానీ, రెండు సేమ్ డిజైన్స్ అని మీనా అంటుంది. ఈవిడేదో తరతరాలుగా గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్లు అడిగావ్. పూలమ్మేదానికి ఏం తెలిసే బంగారం గురించి. మనోజ్ పదరా మనం వెళ్దాం అని వెళ్లబోతుంది ప్రభావతి. కానీ, చేయి పట్టుకుని లాగుతాడు సత్యం. ఇవేంటో తేలని అని సత్యం అంటాడు. మనోజ్ వెళ్తానంటే ఉండమని అడ్డుకుంటాడు బాలు. గాజులు తీసుకుని రెండింటిని సత్యం క్లారిటీగా చూస్తాడు.

సరిగా పోల్చుకోలేకపోతున్నాను అని సత్యం అంటాడు. వాటిలో ఏవి మా నాన్నలా ఒరిజినల్.. మా అమ్మలా నకిలీవి అని వడ్డీ వ్యాపారిని బాలు అడుగుతాడు. మీ అమ్మ చేతిలో ఉన్నవే నకిలివీ. వడ్డీ ఎగ్గొట్టినందుకు గాజులు తాకట్టుపెట్టింది అని వడ్డీ వ్యాపారి చెబుతాడు. ఇన్నాళ్లు నిన్ను నమ్మి కాపురం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని సత్యం అంటాడు. ఛీ.. నాన్న దగ్గర కూడా దాచావేంటమ్మా అని రవి, మౌనిక చీదరించుకుంటారు.

ఇంటికి రా నీకుంటుందిలే అని బాలుతోపాటు అంతా వెళ్లిపోతారు. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభావతి.. కోడలు మీనావైపు కోపంగా చూస్తూ ఉండిపోతుంది. కట్ చేస్తే ఇంట్లో ఇంటి పేపర్స్ మొత్తం చూసిన సత్యం ఇది ఎప్పుడైనా చదివావా. ఇందులో ఇద్దరికీ సమానంగా హక్కు ఉంది. నువ్ భవిష్యత్తులో ఇలాంటివి ఏదేనా చేస్తావ్ అని నా పేరు రాశారు. నా భార్య ఇలా చేసింది అని చాలా బాధగా ఉంది. ఇంకెవరినీ నమ్మాలి అని సత్యం అంటాడు.

రోహిణి కంగారు

బాలు సెటైర్లు వేస్తూనే ఉంటాడు. నా భార్య పేపర్స్ తీసుకొచ్చిందిగా ఇంకెందుకు అమ్మను అంటావ్ అని మనోజ్ అంటాడు. దొంగ దొంగనే వెనుకేసుకొస్తాడురా ఇంటి దొంగ అని బాలు అంటాడు. ఏరా మనోజ్.. రోహిణి నీ దగ్గర ఏదైనా పెద్ద నిజం దాచిపెడితే నీకు ఎలా ఉంటుందిరా అని సత్యం ప్రశ్నిస్తాడు. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు. రోహిణి కూడా ఖాలీ బాండ్ పేపర్‌పై సైన్ చేసి వడ్డీకి డబ్బు తీసుకొస్తుంది కాబట్టి రోహిణి కంగారుపడుతుంది.

మీరు అన్నడి నిజమే. నమ్మినవాళ్లు మోసం చేస్తే ఎలా ఉంటుందో కల్పన ద్వారా చూశాను. తను డబ్బు తీసుకుని పారిపోయి మోసం చేస్తే.. రోహిణి డబ్బులిచ్చి ఇల్లు కాపాడింది. ఇంతకంటే రోహిణి నా దగ్గర దాచేది ఏముంటుంది అని మనోజ్ అంటాడు. మళ్లీ ప్రభావతిపై సెటైర్లు వేస్తాడు బాలు. అంతా అయిపోయిందిగా. ఇంకెందుకు అత్తను అంటున్నాడు అని రోహిణి అంటుంది. నీ మొగుడు చాతకాని వాడిలా నీపై ఆధారపడేలా ఉన్నాడు. ముందు ఆ 40 లక్షలు కూడా ఇవ్వమనండి అని బాలు అంటాడు.

అతను మీ అన్నయ్య కాస్తా రెస్పెక్ట్ ఇవ్వు అని రోహిణి అంటే.. అది అడిగితే రాదు.. మనసులోనుంచి రావాలి. అది మా నాన్నలాంటి వాళ్లను చూస్తేనే వస్తుంది అని బాలు అంటాడు. హాలో అని రోహిణి అంటే.. ఏంటీ ఫోన్‌లో మాట్లాడినట్లు హలో అంటున్నావ్. నాకు పేరుంది బాలు. కాస్తా రెస్పెక్ట్ ఇవ్వు అని బాలు అంటాడు. అది మనసులోనుంచి రావాలి అని రోహిణి తిరిగి పంచ్ ఇస్తుంది. అమ్మనా పార్లరమ్మో నా మాట నాకే తిప్పి చెప్పావా అని బాలు షాక్ అవుతాడు.

ఇల్లు మింగినావిడా

అన్నయ్య ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అందరిపై సెటైర్లు వేస్తే ఇలాగే తిరిగి వస్తుంది అని రవి అంటాడు. మీ అన్నయ్యకు ఎవరికి గౌరవం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తెలుసు రవి. వాళ్ల ప్రవర్తను బట్టే ఇస్తాడు అని మీనా అంటుంది. హేయ్ అని ప్రభావతి అంటే.. ఓయ్.. లెవ్వకు.. ఇప్పుడు నీకు మాట్లాడే హక్కు లేదు. ఇల్లు మింగినావిడా అని బాలు అంటాడు. ఇక నుంచి ఈ పత్రాలు భద్రంగా పెట్టాలి అని సత్యం అంటే.. అది నేను చూసుకుంటాను. ఇటు ఇవ్వండి అని ప్రభావతి అంటుంది.

పోవే అవతలికి. ఇంకా నీకు పత్రాలు ఇస్తానని ఎలా అనుకుని అడుగుతున్నావ్ అని మీనాను పిలుస్తాడు. పక్కకు తప్పుకుంటావా ప్రభావతమ్మా.. నీ పోస్ట్ ఊస్ట్ అయిపోయిందని బాలు అంటాడు. ఇంటి పత్రాలు నువ్వే భద్రంగా దాచిపెట్టమ్మా అని మీనాకు ఇస్తాడు సత్యం. దాంతో రోహిణి, ప్రభావతి షాక్ అవుతారు. నా ఇంటి పత్రాలు దానికిస్తారేంటీ అని ఫైర్ అవుతుంది ప్రభావతి. ఈ ఇంటిని విడిపించిందే మీనా. ఇవి తన దగ్గరే ఉండటమే న్యాయం అని సత్యం అంటాడు.

అన్ని లక్షలు పెట్టి విడిపించింది రోహిణి. పైగా తను ఇంటి పెద్ద కోడలు. ఇంట్లో ఎక్కువగా సంపాదించేదే తను అని ప్రభావతి అంటాడు. ఇద్దరి కలిసే చేశారు కదా. దొందు దొందే అని బాలు సెటైర్లు వేస్తాడు. నువ్ కోడళ్ల మధ్య విభేదాలు పెట్టకు. ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు అని సత్యం అంటాడు. పార్లరమ్మకు ఇస్తే వీడు లక్ష మాయం చేసినట్లు చేస్తాడు. పార్లరమ్మకు ఇస్తే.. ఆ పౌడర్ లాగే కాసేపటికి మాయం అయిపోతాయ్ అని బాలు అంటాడు.

మీనాకు బాధ్యతలు

దాంతో రవి, మౌనిక, మీనా నవ్వుతారు. మీనా నవ్వు చూసి కోపంగా చూస్తుంది ప్రభావతి. ఇక నేను నిన్ను ఏ విషయంలో నమ్మను. మీనాకే ఇస్తాను అని సత్యం అంటే.. వద్దు మావయ్య అత్తయ్యకే ఇవ్వండి అని మీనా చెబుతుంది. ఏంటే నా పత్రాలు నాకే బిక్ష వేస్తున్నావా.. ఇస్తున్నారు కదా తీసుకో అని ప్రభావతి కోపంగా అంటుంది. తర్వాత మీనాకు పేపర్స్ ఇస్తాడు సత్యం. జాగ్రత్త మీనా ఇంట్లో నేరస్థులు పెరిగిపోయారు అని బాలు అంటాడు.

పత్రాలను తీసుకెళ్లి బీరువాలో పెడుతుంది మీనా. అక్కడికి వచ్చి నీ కళ్లు చల్లుబడ్డాయా. అనుకున్నది సాధించావ్. పత్రాలు నీ చేతికి వచ్చేలా చేశావ్. పత్రాలు మాత్రమే నీ చేతికి వచ్చాయి. కానీ, ఇల్లు కాదు. ఆ త్రాలపై నా పేరే ఉంది అది గుర్తిపెట్టుకో. నువ్ ఎంత ట్రై చేసినా నీకు ఇలాంటి సొంత ఇల్లు సంపాదించలేవు కదా అని ప్రభావతి అంటుంది. నేను అద్దింట్లో పుట్టాను, పెరిగాను. సొంతిల్లు కట్టుకోవాలని కనీసం ఆశపడలేదు కూడా. ఏది శాశ్వతం కాదు అని మీనా బదులిస్తుంది.

మావయ్య గారికి మీకు ఇవ్వమని చెప్పాను. అయినా మీరు నన్నే నిందిస్తున్నారు. ఈ పత్రాలు ఇక్కడ ఉండకపోవడమే మంచిది అని ప్రభావతికి ఇస్తుంది పత్రాలు ఇస్తుంది మీనా. ఏంటే అహం చూపిస్తున్నావా. నీ చేతితో ఇస్తే తీసుకుంటానా. నాకంతా సిగ్గు లేదనుకున్నావా. వాటంతట అవే నాకు వస్తాయి. నిన్ను చూసి ఏదో ఒకరోజు అంతా నవ్వుతారు. బాలు గాడు సపోర్ట్ చేస్తున్నాడని బాగా రెచ్చిపోతున్నావ్. ఏదో ఒకరోజు వాడే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు అని ప్రభావతి అంటుంది.

మర్డర్ చేసేదాకా

రవి, తన లవర్ ఐస్ క్రీమ్ తిని రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుకుంటారు. తమది అట్రాక్షన్ కాదు లవ్ అనుకుంటారు. మనం పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాలి. అటు మీ అమ్మ నాన్న నన్ను మర్డర్ చేసేదాకా వదిలేవారు కాదు అని రవి అంటాడు. దాంతో రవి లవర్ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.