తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live November 28, 2024: ACB Trap in Warangal : ఫైల్ క్లియరెన్స్ కు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 28 Nov 202404:26 PM IST
తెలంగాణ News Live: ACB Trap in Warangal : ఫైల్ క్లియరెన్స్ కు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
- వరంగల్ జిల్లాలో లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. ఫైల్ క్లియర్ చేసేందుకు రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ కార్తీక్ ను వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు.
Thu, 28 Nov 202403:41 PM IST
తెలంగాణ News Live: Konda Surekha : కొండా సురేఖకు షాక్ - నాగార్జున కేసులో కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
- హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. ఆమెపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Thu, 28 Nov 202402:13 PM IST
తెలంగాణ News Live: TG SSC Exams 2025 : ఇంటర్నల్ మార్కులు రద్దు..! తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు
- Telangana SSC Exams 2025 : పదో తరగతి మార్కుల విధానంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.
Thu, 28 Nov 202412:08 PM IST
తెలంగాణ News Live: BRS Gurukula Bata : ఈనెల 30 నుంచి బీఆర్ఎస్ 'గురుకుల బాట' - కేటీఆర్ ప్రకటన
- రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమానికి సిద్ధమైంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.
Thu, 28 Nov 202411:46 AM IST
తెలంగాణ News Live: Siddipet : చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం.. జైలుకు వెళ్లొచ్చిన మారని తీరు.. మళ్లీ అరెస్టు
- Siddipet : చెడు వ్యసనాలకు బానిసలై ముగ్గురు యువకులు.. డబ్బు సంపాదించడం కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకొన్నారు. కూలీలకు, యువకులకు రెట్టింపు ధరకు గంజాయి విక్రయిస్తూ ఒకసారి జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.
Thu, 28 Nov 202410:15 AM IST
తెలంగాణ News Live: TG Rythu Runa Mafi : మరో 3 లక్షల మందికి రుణమాఫీ... 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు - కీలక ప్రకటన
- Telangana Rythu Runa Mafi : రుణమాఫీ కాని రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని 3 లక్షల మందికి రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 30వ తేదీన వారి ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్లు పేర్కొన్నారు.
Thu, 28 Nov 202408:04 AM IST
తెలంగాణ News Live: Hitech City Railway Station : కొన్ని రోజుల తర్వాత 'హైటెక్ సిటీ' రైల్వే స్టేషన్‌ను గుర్తుపట్టలేరు!
- Hitech City Railway Station : అమృత్ భారత్ పథకం కింద దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైల్వేస్టేషన్లను.. భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తోంది. ఈ పథకంలో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఈహించని విధంగా అభివృద్ధి చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
Thu, 28 Nov 202407:56 AM IST
తెలంగాణ News Live: Adilabad Winter: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా, కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- Adilabad Winter: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 9.9 డిగ్రీలు నమోదయ్యాయి. జిల్లాలో చలి పంజా విసురుతోంది. రెండు, మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
Thu, 28 Nov 202407:32 AM IST
తెలంగాణ News Live: TG Ayyappa Devotees : అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు!
- TG Ayyappa Devotees : ఆర్టీసీ ఉద్యోగులు వివాదాల్లో చిక్కుకున్నారు. అయ్యప్ప మాల ధరించిన డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు.
Thu, 28 Nov 202406:13 AM IST
తెలంగాణ News Live: Revanth Reddy : హాస్టళ్లలో వరుస ఘటనలు.. సీఎం రేవంత్ సీరియస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Revanth Reddy : తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఇటీవల వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Thu, 28 Nov 202404:55 AM IST
తెలంగాణ News Live: Medaram Master Plan : మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. 10 ముఖ్యమైన అంశాలు
- Medaram Master Plan : మేడారం.. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వన దేవతల క్షేత్రం. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో వనం కిక్కిరిసిపోతుంది. ఇటీవల నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిచనుంది.
Thu, 28 Nov 202403:23 AM IST
తెలంగాణ News Live: Bhupalapalli Murder: హార్వెస్టర్ యజమాని దారుణ హత్య, కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు
- Bhupalapalli Murder: వరి కోతల కోసం పొరుగు జిల్లాకు వచ్చి పని చేసుకుంటున్న ఓ హార్వెస్టర్ యజమానిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా చంపేశారు. కత్తులతో పొడిచి నడి రోడ్డుపై దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చండ్రుపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
Thu, 28 Nov 202401:51 AM IST
తెలంగాణ News Live: Pending Projects: పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి… లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్న ఉత్తమ్
- Pending Projects: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే నాలుగేళ్లలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేసి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Thu, 28 Nov 202401:04 AM IST
తెలంగాణ News Live: Karimnagar Police: చోరీకి గురై దొరికిన 1206 మొబైల్ ఫోన్లు …కరీంగనగర్‌లో CEIR వినియోగం బేష్..
- Karimnagar Police: మీ మొబైల్ ఫోన్ పోయిందా.. లేకుంటే ఎవరైనా కొట్టేశారు.. ఏమాత్రం చింతించకండి. సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే చాలు...CEIR (central equipment identity Register)విధానం ఉపయోగించిపోయిన ఫోన్ దొరకబట్టి ఇచ్చేస్తారు.