CM Chandrababu : ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతి- సీఎం చంద్రబాబు-cm chandrababu review on sand policy ordered official allow people to carry sand from reaches ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతి- సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతి- సీఎం చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu
Nov 27, 2024 10:47 PM IST

CM Chandrababu : రాష్ట్రంలో ఇసుకకు పెరుగుతున్న డిమాండ్, సరఫరా, లభ్యత పెంపుదలపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.

ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతి- సీఎం చంద్రబాబు
ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతి- సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఇసుక కొరతపై ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఇసుక సరఫరాపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాలని ఆదేశించారు. ఇసుక లభ్యతపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇసుక లభ్యత, పారదర్శకంగా ఇసుక సరఫరా, అక్రమాల నియంత్రణ అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇసుక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో లభ్యత పెంచాలని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ లలో పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాలని జిల్లాస్థాయి శాండ్ కమిటీలు, అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక ధరల్ని కంట్రోల్ చేసేందుకు జిల్లా స్థాయిలో ధరలను మరల సమీక్షించాలని ఆదేశించారు. ఇసుక రీచ్ ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే కస్టమర్ల నుంచి వసూలు చేయాల్సిందిగా తెలిపారు. ఈ అంశంలో ఫిర్యాదులు వస్తే సహించబోమన్నారు. ఇసుకపై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం వ్యయం అతి తక్కువగా ఉండేలా చూడాలన్నారు.

ఇసుక సరఫరాపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సర్వియలెన్స్ కెమెరాలతో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు నడపాలన్నారు. పోలీసులు జిల్లాల్లో జరిగే ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అందే ఫీడ్ బ్యాక్ తో పాటు ఫిర్యాదులపై తదుపరి సమావేశంలో సమీక్షిస్తామన్నారు.

మారిటైమ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్

ఏపీని మారిటైమ్ హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం మారిటైమ్ పాలసీ -2024 విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏపీని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 1,053 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మారిటైమ్ పాలసీని రూపొందించాలని అన్నారు. బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని ‘‘వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్‌గా, వినూత్న విధానాలతో తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్ధవంతమైన పాలన ద్వారా సుస్థిర ఆర్ధిక వృద్ధి సాధించడం’’ రాష్ట్ర విజన్‌గా పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం