OTT Romantic Comedy Movie: ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ-ott malayalam romantic comedy movie little hearts to stream in sun nxt friday 29th november ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Comedy Movie: ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ

OTT Romantic Comedy Movie: ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ

Hari Prasad S HT Telugu

OTT Romantic Comedy Movie: ఓటీటీలోకి ఆరు నెలల తర్వాత ఓ మలయాళం రొమాంటిక్ కామెడీ స్ట్రీమింగ్ కు వస్తోంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ బుధవారం (నవంబర్ 27) రివీల్ చేసింది.

ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ

OTT Romantic Comedy Movie: మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. షేన్ నిగమ్, మహిమా నంబియార్ లీడ్ రోల్స్ లో నటించిన లిటిల్ హార్ట్స్.. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకీ రానుంది.

లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్

లిటిల్ హార్ట్స్ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 29) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది. జూన్ 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. కొన్నాళ్ల తర్వాత ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది.

ఇప్పుడు సుమారు ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ వస్తుండటం విశేషం. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అబీ ట్రీసా, ఆంటో జోస్ పెరీరా డైరెక్ట్ చేశారు. రాజేష్ పిన్నదన్ స్క్రిప్ట్ అందించాడు.

లిటిల్ హార్ట్స్ స్టోరీ ఏంటంటే?

ఈ లిటిల్ హార్ట్స్ మూవీ జూన్ 7న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ లిటిల్ హార్ట్స్ మూవీ మూడు ప్రేమ కథల చుట్టూ తిరుగుతుంది. సినిమాలో లీడ్ రోల్స్ అయిన సిబి (షేన్ నిగమ్), సోషా (మహిమా నంబియార్) లవ్ స్టోరీతోపాటు సిబి తండ్రి బేబీ లవ్ స్టోరీ, సోషా సోదరుడు షారోన్ (షైన్ టామ్ చాకో) లవ్ స్టోరీలే ఈ సినిమా కథ.

నిజానికి ఈ సినిమా చాలా వరకు లీడ్ రోల్స్ మధ్య లవ్ స్టోరీ కాకుండా మిగతా రెండు జంటల స్టోరీ చుట్టే ఎక్కువగా తిరగడం విశేషం. ప్రేమ అంటే ప్రేమే.. ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే అన్ని రకాల బంధాలూ సరైనవిగానే అనిపిస్తాయన్న సందేశంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ కాన్సెప్ట్ కొందరు ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది.

కానీ ఐఎండీబీలో మాత్రం 8.2 రేటింగ్ దక్కడం విశేషం. సాధారణంగా చాలా మంచి సినిమాలకే ఈ రేటింగ్ లభిస్తుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలలకు అంటే ఆగస్ట్ లోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. మలయాళం ఆడియోలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు నవంబర్ 29 నుంచి సన్ నెక్ట్స్ లోకీ రాబోతోంది.