Araku Trains : అరకు ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌, విశాఖ-కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు-east coast railway additional vistadome coaches to visakha kirandul trains in araku route ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Araku Trains : అరకు ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌, విశాఖ-కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు

Araku Trains : అరకు ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌, విశాఖ-కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు

HT Telugu Desk HT Telugu
Nov 27, 2024 09:58 PM IST

Araku Trains : అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అరకు టూరిస్ట్ రైళ్లకు అదనపు విస్టాడోమ్ కోచ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడించనున్నారు.

అరకు ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌, విశాఖ-కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు
అరకు ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌, విశాఖ-కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు

ప‌ర్యాట‌కులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. అరకు అందాల‌ను వీక్షించేందుకు రైళ్లకు అద‌న‌పు విస్టాడోమ్ కోచ్‌ల‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయిం తీసుకుంది. ఈ సీజ‌న్‌లో అర‌కు అందాల‌ను వీక్షించే ప‌ర్యాట‌కులు, ప్రయాణికుల సౌక‌ర్యార్థం, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడించాలని నిర్ణయించింది.

1. విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లు దేరే విశాఖపట్నం-కిరండూల్ (08551) రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ రైలు డిసెంబ‌ర్ 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 29, 31 తేదీల్లో అద‌న‌పు కోచ్‌తో ప్రయాణిస్తుంది.

2. కిరండూల్ నుంచి బ‌య‌లుదేరే కిరండూల్-విశాఖపట్నం (08552) రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ రైలు డిసెంబ‌ర్ 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 2025 జ‌న‌వ‌రి 1 తేదీల్లో అద‌న‌పు కోచ్‌తో ప్ర‌యాణిస్తుంది. ప‌ర్యాట‌కులు, ప్ర‌యాణికులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డీసీఎం సందీప్ తెలిపారు.

రైళ్ల రీనంబరింగ్

2025 మార్చి నుంచి అమలులోకి వచ్చే వాల్తేర్‌ డివిజన్ ఒరిజిన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబ‌ర్ల‌ను మార్చాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.

ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య:

1. విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన‌ 17488 నెంబ‌ర్‌ను సవ‌రించి 18521గా మార్చారు. ఈ స‌వ‌రించిన నెంబ‌ర్‌ 2025 మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది.

2 కడప-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన‌ 17487 నెంబ‌ర్‌ను సవ‌రించి 18522గా మార్చారు. ఈ స‌వ‌రించిన నెంబ‌ర్‌ 2025 మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది.

3. విశాఖపట్నం - బనారస్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన‌ 18311 నెంబ‌ర్‌ను సవ‌రించి 18523గా మార్చారు. ఈ స‌వ‌రించిన నెంబ‌ర్‌ 2025 మార్చి 2 నుండి అమలులోకి వస్తుంది.

4. బనారస్-విశాఖపట్నం బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన 18312 నెంబ‌ర్‌ను స‌వ‌రించి 18524గా మార్చారు. ఈ స‌వ‌రించిన నెంబ‌ర్‌ 2025 మార్చి 3 నుండి అమలులోకి వస్తుంది.

5. విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన స‌వ‌రించి 18513 గా మార్చారు. ఈ స‌వ‌రించిన నెంబ‌ర్‌ 2025 మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది.

6. కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన స‌వ‌రించి 18514గా మార్చారు. ఈ స‌వ‌రించిన నెంబ‌ర్‌ 2025 మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది.

7. విశాఖపట్నం-గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన‌ 22701 నెంబ‌ర్‌ను సవ‌రించి 22875గా మార్చారు. ఈ స‌వ‌రించిన నెంబ‌ర్‌ 2025 మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది.

8. గుంటూరు-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన‌ 22702 నెంబ‌ర్‌ను సవ‌రించి 22876గా మార్చారు. ఈ స‌వ‌రించిన నెంబ‌ర్‌ 2025 మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది.

జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం