తెలుగు న్యూస్ / ఫోటో /
Araku Tour Package : మంచు కురిసే వేళలో 'అరకు' అందాలను చూసొద్దామా..! అతి తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!
- Telangana Tourism Araku Package : మంచు కురిసే వేళలో అరకు అందాలను అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ధరలోనే 4 రోజుల పాటు అరకు అందాలను చూడొచ్చు. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి…
- Telangana Tourism Araku Package : మంచు కురిసే వేళలో అరకు అందాలను అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ధరలోనే 4 రోజుల పాటు అరకు అందాలను చూడొచ్చు. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి…
(1 / 7)
అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. మంచు కురిసే వేళలో అద్భుతమైన అరకు అందాలను చూడొచ్చు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.
(2 / 7)
ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 20, 2024వ తేదీన అందుబాటులో ఉంది. (image source Twitter)
(3 / 7)
4 రోజులపాటు ఈ ట్రిప్ ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా… అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి చూడొచ్చు. (image source unsplash.com )
(4 / 7)
బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు. ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బొర్రా కేవ్స్, థిమ్సా డ్యాన్స్ ను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు.(image source unsplash.com )
(5 / 7)
నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.(image source unsplash.com )
(6 / 7)
హైదరాబాద్ - అరకు ట్రిప్ ధరలు : పెద్దవారికి రూ. రూ. 6,999గా ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు.(image source unsplash.com )
ఇతర గ్యాలరీలు