OTT Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వచ్చిన తెలుగు రివేంజ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో టాప్ రేటింగ్-ott revenge thriller telugu movie revu now streaming on aha video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వచ్చిన తెలుగు రివేంజ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో టాప్ రేటింగ్

OTT Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వచ్చిన తెలుగు రివేంజ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో టాప్ రేటింగ్

Hari Prasad S HT Telugu
Nov 14, 2024 12:19 PM IST

OTT Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ తెలుగు రివేంజ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. సడెన్ గా గురువారం (నవంబర్ 14) నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఐఎండీబీలో సినిమాకు మంచి రేటింగ్ ఉంది.

ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా.. ఐఎండీబీలో టాప్ రేటింగ్
ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా.. ఐఎండీబీలో టాప్ రేటింగ్

OTT Thriller Movie: ఓటీటీలోకి కొన్ని సినిమాలు ఆలస్యంగా వస్తుంటాయి. అలా మూడు నెలల తర్వాత ఇప్పుడో తెలుగు రివేంజ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లలోకి వచ్చిన రేవు అనే సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఐఎండీబీలో మాత్రం ప్రేక్షకులు మంచి రేటింగే ఇచ్చారు.

రేవు ఓటీటీ స్ట్రీమింగ్

తెలుగు యాక్షన్ డ్రామా రేవు మూవీ గురువారం (నవంబర్ 14) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "రేవు: ది బ్యాటిల్ ఫర్ ద సీ. మత్స్యకారులు, వాళ్ల ఆవిష్కరణ, విషాదం. వాళ్లు అధిగమిస్తారా? ఆహా వీడియోలో చూడండి" అనే క్యాప్షన్ తో ఈ రేవు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. సడెన్ గా ప్రత్యక్షమైన ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఏంటీ రేవు మూవీ?

రేవు మూవీని హరినాథ్ పులి డైరెక్ట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైంది. వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్ నిడదవోలు లాంటి వాళ్లు ఈ మూవీలో నటించారు. ఈ రేవు కథ మొత్తం పలువురు మత్స్యకారుల చుట్టూ తిరుగుతుంది.

సినిమాలో ప్రధాన పాత్రలైన అంకాలు, గంగయ్యతోపాటు మధ్యలో వచ్చే నగేశు.. వాళ్ల మధ్య చేపల వేటలో ఉండే పోటీ.. అది వాళ్ల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులేంటి అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

మ‌త్స్య‌కారుల జీవ‌న విధానాన్ని, వృత్తిప‌రంగా వారు ఎదుర్కొనే ఒడిదుడుల‌కు యాక్ష‌న్‌, రివేంజ్‌తో పాటు ఓ ల‌వ్‌స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ పులి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమా లొకేష‌న్స్‌, యాక్ట‌ర్లు, విజువ‌ల్స్ అన్ని చాలా నాచుర‌ల్‌గా ఉండేలా ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త‌ప‌డ్డాడు.

రేవులో హీరోల‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల విష‌యంలో ద‌ర్శ‌కుడు సినిమాటిక్‌గా ఆలోచించ‌కుండా వాస్త‌విక కోణంలో మ‌త్స్య‌కారులు ఎలాంటి అడ్డంకుల‌ను ఎదుర్కొంటార‌నే అంశాల‌ నుంచే స్ఫూర్తి పొందుతూ కొన్ని సీన్స్ రాసుకోవ‌డం బాగుంది.

రివేంజ్ డ్రామా..

ఫ‌స్ట్ హాఫ్ మొత్తం అంకాలు, గంగ‌య్య జీవితాలు, వారి మ‌ధ్య ఉండే గొడ‌వ‌ల చుట్టూ న‌డిపించారు ద‌ర్శ‌కుడు. చాలా డీటైలింగ్‌గా సీన్స్‌ను చూపిస్తూ వెళ్ల‌డంతో క‌థాగ‌మ‌నం నెమ్మ‌దిగా సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది. సెకండాఫ్‌లో రివేంజ్ డ్రామాగా మారిన త‌ర్వాతే క‌థ‌లో స్పీడు పెరుగుతుంది. నాగేశుతో పాటు అత‌డి కొడుకులు వేసే ఎత్తుల‌ను అంకులు, గంగ‌య్య క‌లిసి తిప్పికొట్టే సీన్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప‌ర్వాలేద‌నిపిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను డైరెక్ట‌ర్ డిజైన్ చేసుకున్న తీరు ఆక‌ట్టుకుంటుంది.

రా అండ్ ర‌స్టిక్ సినిమాల్ని ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను రేవు మెప్పిస్తుంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్న‌మైన అనుభూతిని అందిస్తుంది.ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఐఎండీబీలో మాత్రం రెండు వేల మందికిపైగా ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్ 9.1గా ఉండటం విశేషం. ఈ రేవు మూవీని ఆహా వీడియో ఓటీటీలో ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారో చూడాలి.

Whats_app_banner