Gundeninda Gudigantalu Today Episode: బాలుపై రోహిణి చిందులు - ప్రభావతి దొంగబుద్ది బయటపెట్టిన వడ్డీ వ్యాపారి
Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 9 ఎపిసోడ్‌లో పార్లర్ కోసం ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న పదిహేడు లక్షలను రోహిణి తిరిగిస్తుంది. అంత డబ్బు ఒకేసారి రోహిణి తేవడం చూసి బ్యాంకుకు కన్నం వేసిందని బాలు అనుమానపడతాడు.
Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతికి పదిహేడు లక్షలు ఇవ్వడం కోసం తన పార్లర్‌తో పాటు బంగారం మొత్తం అమ్మేస్తుంది రోహిణి. అయినా డబ్బులు సరిపోకపోవడంతో గుణ అనే ఫైనాన్షియర్ దగ్గర ఖాళీ బాండ్ పేపర్స్‌పై సంతకం పెట్టి డబ్బులు తీసుకోవాలని అనుకుంటుంది. మీనా తమ్ముడు శివ దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బులతో గుణ ఫైనాన్స్ రన్ చేస్తుంటాడు. గుణ ఆఫీస్‌లోకి రోహిణి రావడం చూసి శివ షాకవుతాడు. రోహిణికి కనిపించకుండా ఆఫీస్‌లోనే దాక్కుంటాడు. విద్య వద్దని ఎంత వారించిన వినకుండా గుణ దగ్గర రోహిణి డబ్బు తీసుకుంటుంది.
శివ అనుమానం...
నేను మనిషి కంటే బాండ్ పేపర్స్‌ను నమ్ముతానని, తేడా వస్తే బాగుండదని చెప్పి రోహిణికి డబ్బిస్తాడు గుణ. రోహిణి వెళ్లిపోగానే శివ బయటకు వస్తాడు. రోహిణికి అంత డబ్బుతో అవసరం ఏమొచ్చింది?ఎందుకోసం అప్పు తీసుకొని ఉంటుందని శివ అనుమానపడతాడు.
బ్యాంకులో దొంగతనం జరిగిందా?
రోహిణి ఇంట్లో అడుగుపెట్టడంతోనే బాలు అంటూ గట్టిగా కేకలు వేస్తుంది. ఇంట్లో నీ ముద్దుల అత్త, పనికిమాలిన భర్త ఉండగా నాతో నీకు ఏం పని పడిందని పిలుస్తున్నావని రోహిణిపై బాలు సెటైర్లు వేస్తాడు. పదిహేడు లక్షల డబ్బు తీసి బాలు ముందు పెడుతుంది రోహిణి.
బాలు డబ్బు ముట్టుకోకుండా సీరియస్‌గా న్యూస్ పేపర్ తీసి ఏదో వెతుకుతుంటాడు. ఏం వెతుకుతున్నావని కొడుకును అడుగుతాడు సత్యం. రాత్రి బ్యాంకులో దొంగలు పడ్డారని న్యూస్ ఏమైనా వచ్చిందా అని వెతుకుతున్నానని బాలు పంచ్‌లు వేస్తాడు.
అత్త మాట నిలబెట్టడం కోసం...
ఈ డబ్బు కోసమేగా అత్తయ్యను దోషిని చేసింది? ఇళ్లును తాకట్టు పెట్టానని నాతో గొడవపడింది అంటూ బాలుకు డబ్బును చూపిస్తూ గొడవపడుతుంది రోహిణి. అత్తయ్య మాటను నిలబెట్టడం కోసం ఈ డబ్బు తెచ్చానని ప్రభావతిని సపోర్ట్ చేస్తూ రోహిణి మాట్లాడుతుంది. ఈ సారి ఏం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చావని రోహిణిని నిలదీస్తాడు బాలు.
ప్రభావతి సంబరం...
కోడలు నా పరువు నిలబెట్టింది అంటూ రోహిణిని చూసి మురిసిపోతుంది ప్రభావతి. రోహిణి బంగారం అంటూ సంబరపడుతుంది. రోహిణికి ఈ లక్షలు టీ బిస్కెట్లతో సమానమని గొప్పలు చెబుతుంది. మీనాను తక్కువ చేసి మాట్లాడుతుంది ప్రభావతి. మీనాను అడిగితే పువ్వులు రాలుతాయి...రూపాయి కూడా రాలదనిఅంటుంది.
రోహిణి తీసుకున్న డబ్బే తిరిగి ఇచ్చింది కదా...ఇంకా ఈ బోడి బిల్డప్‌లు ఎందుకు అని మౌనిక అంటుంది. మా డబ్బు మాకు తెచ్చిచ్చి...దానధర్మాలు చేసినట్లు ఫోజులు కొట్టొద్దని బాలు కూడా తల్లితో అంటాడు.
నోరు జారిన ప్రభావతి...
మీ నాన్నతో చెప్పి మనోజ్ చేత బిజినెస్‌పెట్టించావంటే ఇంకో ఉద్యోగం వెతుక్కోవాల్సిన పనిలేదని నోరు జారుతుంది ప్రభావతి. మనోజ్ జాబ్ చేయడం లేదని తెలిసి అందరూ షాకవుతారు. దాంతో మాట మార్చేసింది ప్రభావతి. డబ్బు తిరిగి ఇచ్చాను కదా...ఇంకా నా జోలికి రావొద్దని బాలుతో అంటుంది రోహిణి.
ఈ డబ్బుతో పాటు మనోజ్ మింగిన నలభై లక్షలు కూడా కావాలని బాలు పట్టుపడతాడు. అప్పటివరకు మీ జోలికి వస్తూనే ఉంటానని రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. వడ్డీ వ్యాపారికి డబ్బు ఇవ్వడానికి సత్యంబాబుతో పాటు కుటుంబసభ్యులందరూ వస్తారు. మా అందరిని ఎందుకు రమ్మన్నావని వడ్డీ వ్యాపారిని బాలు అడుగుతాడు.
ప్రభావతిని నమ్మలేం...
మీ అమ్మ ప్రభావతిని నమ్మలేమని, నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని మరొకరి దగ్గర తాకట్టు పెట్టి...నాకు పేపర్స్ ఇవ్వలేదని అబద్ధం ఆడిన ఆడుతుంది అని వడ్డీ వ్యాపారి అంటాడు. నేను నీకు ఎలా కనిపిస్తున్నావని వడ్డీ వ్యాపారిపై ప్రభావతి ఫైర్ అవుతుంది.
కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను మోసం చేసిన గొప్ప త్యాగమూర్తిలా కనిపిస్తున్నావని అతడు అవమానిస్తాడు. ఇదే నా భార్య అయితే జైలుకు పంపించేసేదానిని...నీ భర్త, పిల్లలు మంచివాళ్లు కాబట్టి బతికిపోయావు అని ప్రభావతితో అంటాడు వడ్డీ వ్యాపారి. మీనా వల్లే ఈ డబ్బు నాకు దక్కిందని ఫైనాన్షియర్ అందరి ముందు అంటాడు.
మోసం చేయవని గ్యారెంటీ ఎంటీ?
ఇంతమంచి కుటుంబాన్ని మోసం చేసిన నవ్వు రేపు నన్ను మోసం చేయవని గ్యారెంటీ ఏంటి అని ప్రభావతితో అంటాడు వడ్డీ వ్యాపారి. ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండమని బాలును హెచ్చరిస్తాడ. ఈ వడ్డీ వ్యాపారి కొద్ది రోజుల్లోనే అమ్మ ఎంత మాయలమారిదో భలే కనిపెట్టాడని బాలు పంచ్‌లు వేస్తాడు.
భర్తను, పిల్లలను మోసం చేసిన నిన్ను వడ్డీ వ్యాపారి పొగుడుతున్నాడని ప్రభావతితో సత్యం అంటాడు. వడ్డీ వ్యాపారితో పాటు బాలు, సత్యం మాటలను ప్రభావతి సహించలేకపోతుంది.
మీనా సంతకం కావాలి...
అప్పు ముట్టినట్లుగా పేపర్స్‌పై అందరి సంతకాలు తీసుకుంటాడు ఫైనాన్షియర్. ఆ డాక్యుమెంట్స్‌పై మీనా సంతకం కావాలని ఫైనాన్షియర్ అంటాడు. ప్రభావతి మాత్రం వద్దని అంటుంది. ఇంటి పేపర్స్‌తో మీనాకు ఏం సంబంధం లేదని గొడవ చేయబోతుంది. ఏ సంబంధం లేదని మీనా అనుకుంటే తిండి, నీళ్లు లేకుండా నువ్వు ఇప్పటికీ జైలులో ఉండేదానివని వడ్డీ వ్యాపారి అంటాడు.
ఇంటిపై నాకు ఎంత హక్కు ఉందో మీనాకు అంతే హక్కు ఉందని ప్రభావతితో ఖరాఖండిగా చెబుతాడు బాలు. కానీ మీనా మాత్రం సంతకం చేయడానికి ఆలోచిస్తుంటుంది. బలవంతంగా బాలు ఆమెతో సంతకం చేయిస్తాడు.
ఇంటి పేపర్స్‌ను ఫైనాన్షియర్ తీసి సత్యానికి ఇవ్వబోతాడు. వాటిని తాను అందుకునేందుకు ప్రభావతి ముందుకొస్తుంది. ఆమెవైపు కోపంగా చూస్తాడు సత్యం. ఇక నుంచి ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంకు లాకర్‌లో పెట్టాలని బాలు అంటాడు.
అప్పుడు మీ అమ్మ బ్యాంకుకు కన్నం వేస్తుందని ఫైనాన్షియర్ గాలి తీసేస్తాడు. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఫైనాన్షియర్‌పై మనోజ్ కోప్పడుతాడు. నలభై లక్షలు ఫ్రాడ్ చేసిన నీకు మాట్లాడే అర్హత లేదని ఫైనాన్షియర్ అంటాడు.
మీనా చేతికి ఇంటి డాక్యుమెంట్స్...
ఇంటి డాక్యుమెంట్స్‌ను భద్రంగా దాచిపెట్టమని మీనాకు ఇస్తాడు సత్యం. నా ఇంటి పత్రాలు మీనాకు ఎలా ఇస్తావని భర్తతో ప్రభావతి గొడవపడుతుంది. ఈ తాకట్టు నుంచి బయటపడటానికి కారణం మీనా అని సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది