నేటి రాశిఫలాలు 28-11-2024
సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం,
అయనము: దక్షిణాయనం
మాసం: కార్తీకము,
తిథి: బ.త్రయోదశి,
వారం: గురువారం,
నక్షత్రం: చిత్త ఉ.7.50 వరకు. తదుపరి హస్త
అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. అప్పుల నుండి గట్టెక్కుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభసూచన. పారిశ్రామిక వేత్తలకు, రాజకీయ నాయకులకు కలసివస్తుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.
ఈరోజు అంతగా బాగా లేదు. సమస్యలు తలెత్తుతాయి. ఓర్పుతో ఉండండి. నోరు జారవద్దు. అనుకున్నట్టు డబ్బు చేతికందదు. వ్యాపార కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. చికాకుగా ఉంటుంది. కళా, క్రీడారంగాల్లోనివారికి అందిన అవకాశాలు చేజారతాయి.
కొత్తవారితో పరిచయమవుతుంది. అనుకున్న పనులు చకచకా పూర్తవుతాయి. ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయ సూచన. కుటుంబంలో సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. అనారోగ్య సూచన. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. కళారంగం వారికి శ్రమాధిక్యం. వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి.
కొత్త పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తీరతాయి. ఇంటినిర్మాణ సమస్యలనుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు కలసివస్తుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.
పనులు చకచకా పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అందరి నుంచి సహకారం లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలు చేపడతారు. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.
ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. వివాదాలు తలెత్తవచ్చు. మాట అదుపు చేసుకోండి. శ్రమానంతరం పనులు పూర్తవుతాయి. వాహన కొనుగోలు యత్నాలు చేస్తారు. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
దీర్ఘకాల సమస్యల నుంచి గట్టెక్కుతారు. ధనవ్యయ సూచన. భూములు, వాహన కొనుగోలు యత్నం చేస్తారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. పనులు నెమ్మదిగా జరుగుతాయి. వివాదాలు తలెత్తవచ్చు. అప్రమత్తంగా ఉండండి.
కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణ చేపడతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన, స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు.
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయనాయకులకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులు,క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కొత్త పనులు పూర్తవుతాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి.
పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇంటి నిర్మాణ పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయనాయకులకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.