Vastu Tips for Money: అప్పుల బాధలు తట్టుకోలేక పోతున్నారా- ఇంట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేయండి చాలు-try these simple vastu remedies for good luck in life and financial prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Money: అప్పుల బాధలు తట్టుకోలేక పోతున్నారా- ఇంట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేయండి చాలు

Vastu Tips for Money: అప్పుల బాధలు తట్టుకోలేక పోతున్నారా- ఇంట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేయండి చాలు

Ramya Sri Marka HT Telugu
Published Nov 23, 2024 02:21 PM IST

Vastu Tips for Money: అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? వాస్తు శాస్త్రం మీకు సహాయపడుతుందేమో చూడండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఆనందం, ఆర్థిక శ్రేయస్సు లభిస్తాయి.

ఆర్థిక వృద్ధి కోసం వాస్తు చిట్కాలు
ఆర్థిక వృద్ధి కోసం వాస్తు చిట్కాలు

కష్టపడి సంపాదించిన డబ్బంతా ఊరికే ఖర్చు అయిపోతుందా. ఎంత ఆదా చేసినా అప్పుల బాధ నుంచి బయటపడలేక పోతున్నారా. అయితే వాస్తు శాస్త్రం మీకు సహాయపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. వాస్తు దోషాలు ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. అన్నిండా అడ్డంకులు, ఆర్థిక సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి వ్యాధులను కలిగిస్తుంది. వాస్తులో లోపాల కారణంగా మనిషి ఎంత కష్టపడి పనిచేసినా విజయం దక్కించుకోలేదు. తరచూ కుటుంబ కలహాలతో ఇబ్బంది పడతాదు. ఫలితంగా ఇంట్లో ఆర్థిక పురోగతి, ఆనందం నశిస్తాయి. ఇలాంటి పరిస్థితులో మీరుంటే వాస్తు శాస్రం మీకు సహాయపడుతుందని ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు ముకుల్ రస్తోకి చెబుతున్నారు. కొన్ని పరిహారాలను పాటించడం ఇంట్లో కొన్ని మార్పులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి జీవితంలో పురుగతి, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయట. ఆ పరిహారాలేంటో తెలుసుకుందాం..

ఇంట్లో ఎలాంటి మార్పులు చేస్తే అప్పుల బాధ నుంచి బయటపడచ్చు?

  1. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మామిడి చెట్టు, అశోక చెట్టు లేదా వేప చెట్టు నాటాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. గుమ్మానికి దగ్గరగా ఈ చెట్లు ఉండటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి.
  2. సాయంత్రం పూట భగవంతుడికి పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర రాగి కుండలో గంగాజలం, నీరు ఉంచాలి. పూజ చేసిన తర్వాత దాన్ని ఇంట్లో అన్ని మూలలా చల్లుకోవాలి.
  3. రాత్రి పడుకునేటప్పుడు పసుపు ముద్దను పసుపు వస్త్రంలో కట్టి దిండు కింద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక వృద్ధి, అదృష్టం పెరగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
  4. మంగళవారం రోజు హనుమంతునికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆయనకు బెల్లం శనగల ప్రసాదం సమర్పించాలి. ఆ తర్వాత దాన్ని పంచి పెట్టాలి. ఇలా చేయండం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
  5. వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం ఇంటి నిర్మాణ లోపాలు. ముఖ్యంగా ఇంటి మరుగుదొడ్డి నిర్మాణం వాస్తు ప్రకారం లేకుంటే అనారోగ్యం, ఆర్థిక సమస్యలు తప్పవు. ఇంటి ప్రధాన ద్వారం పైన మరుగుదొడ్డి నిర్మించకూడదు.
  6. చెత్త డబ్బాను, చీపుర్లను వీలును బట్టి ఖాళీ స్థలాన్ని బట్టి మనం పెట్టుకుంటారు. కానీ నిజానికి వీటిని సరైన స్థలంలో పెట్టకపోతే ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చిపెట్టుకున్నట్టే అంటున్నారు వాస్తు నిపుణులు. హిందూ సంప్రదాయం ప్రకారం చీపురు లక్ష్మీ దేవితో సమానం. కనుక దీన్ని ఎప్పుడూ ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచకూడదు. అలాగే చెత్త డబ్బాను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తుల బాధ ఎక్కువ అవుతుంది.
  7. ఇంటి ఆగ్నేయ దిశలో వీలైనంత వరకూ పూల మొక్కలు మరీ ముఖ్యంగా ఎరుపు రంగు అంటే మందారం, గులాబీ వంటి మొక్కలను నాటాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
  8. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఇంటికి చాలా ముఖ్యమైన నైరుతి దిశలో శ్రీమహావిష్ణువు చిత్రాన్ని ఉంచాలి. అందులో లక్ష్మీ దేవి తన పాదాల దగ్గర ఉంటే మరీ మంచిది.
  9. ఇంటి వంటగది, ఈశాన్య మూల ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే అగ్నికి మూలంగా చెప్పుకునే వంటగదిని అగ్ని కోణంలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి.
  10. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బ్రహ్మ స్థానం గుండా ఎలాంటి మురికీ నీరు పారకూడదు.
  11. . ఇంట్లో పూజ గదిలో పరమేశ్వరుడు కుటుంబ సమేతంగా ఉన్న ఫొటోను ఉంచాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు ఉండవనీ ఆర్థికంగా కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner