Gundeninda Gudigantalu Today Episode: రోహిణి ఛాప్టర్ క్లోజ్- మీనా ప్రేమకు బాలు క్లీన్ బౌల్డ్ - ప్రభావతి రివేంజ్
Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 7 ఎపిసోడ్‌లో రోహిణికి పార్లర్ పెట్టుకోవడానికి ప్రభావతి ఇళ్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వడం బాలు సహించలేకపోతాడు. రోహిణికి డబ్బులు ఇచ్చినట్లే...మీనాకు కూడా ఇవ్వాలని పట్టుపడతాడు. మీనా వద్దని అంటుంది.
Gundeninda Gudigantalu Today Episode: బాలు, మీనాలను ఇబ్బంది పెట్టబోయి తానే బోల్తా పడుతుంది. రోహిణి. తన ఫాదర్ రిచ్ అంటూ బిల్డప్‌లు ఇవ్వడంతో ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న పదిహేడు లక్షలు మీ నాన్నను అడిగి తీసుకురమ్మని రోహిణిని ప్రభావతి పట్టుపడుతుంది. కాదంటే తన నాటకం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన రోహిణి పార్లర్ అమ్మి ఆ డబ్బులను ప్రభావతికి ఇస్తుంది. అయినా డబ్బు సరిపోకపోవడంతో తన నగలను అమ్మేస్తుంది.
ఇంకా డబ్బు అవసరం కావడంతో ఖాళీ బాండ్‌పేపర్స్‌పై సంతకం పెట్టి డబ్బు తీసుకోవడానికి సిద్ధపడుతుంది. స్నేహితురాలు వారిస్తున్న వినకుండా గుణా అనే ఫైనాన్షియర్ వద్ద డబ్బు తీసుకుంటుంది. గుణా నుంచి రోహిణి డబ్బు తీసుకోవడం శివ గమనిస్తాడు. తన ఫాదర్ రిచ్ అంటూ రోహిణి అడుతోంది నాటకం అని కనిపెట్టేస్తాడు.
పూల షాప్ పెట్టుకోవాలి...
పూల షాప్ పెట్టుకోవాలని ఉందని భర్త బాటుతో అంటుంది మీనా. భార్య పూల షాప్ పెట్టుకోవడానికి అవసరమైన డబ్బును తల్లి ప్రభావతి నుంచి రాబట్టాలని బాలు ప్లాన్ చేస్తాడు. రోహిణి కోసం పదిహేడు లక్షలు ఖర్చుపెట్టినప్పుడు ఈ కోడలికి కూడా ప్రభావతి డబ్బులు ఇవ్వాలిగా అంటూ లాజిక్‌లు మాట్లాడుతాడు బాటు.
భర్తకు షాకిచ్చిన మీనా...
అత్త ప్రభావతి దగ్గర నుంచి డబ్బు తీసుకొని షాప్ పెట్టాలనే ఆశలు తనకు లేవని మీనా అంటుంది. అయినా బాలు పట్టువీడడు. నువ్వు ఊ అను నేను పట్టుపట్టి షాప్ పెట్టిస్తానని అంటాడు.
భర్తను ఆటపట్టించడానికి సరదాగా ఊ అంటుంది మీనా. ఊరికే అంటే నిజంగానే మీనా ఊ అనడంతో బాలు కంగారుపడిపోతాడు. ఇప్పుడే నాకు అలాంటి ఆశలు లేవు అని అన్నావు...అప్పుడే మాట మార్చేశావా అంటూ మీనాతో అంటాడు బాలు. మీరు ఊ అనమన్నారు...అన్నాను అంతే అంటూ బాలుకు బదులిస్తుంది మీనా.
సొంత కారు కొనాలి...
మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా అని భర్తను అడుగుతుంది మీనా. రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని అయిపోవాలని లేదు కానీ...సొంత కారు ఉండాలి, అదీ కొత్త కారై ఉండాలని తన కలలను భార్య ముందు బయటపెడతాడు బాలు. తనకు కూడా పెద్దగా ఆశలు లేవని, తమ్ముడు, చెల్లెలు బాగా చదువుకొని జీవితంలో సెటిల్ కావాలని, అమ్మకు అప్పుడప్పుడు షాప్ పనుల్లో సాయం చేయడం మినహా పెద్దగా కోరికలేవి లేవని మీనా తన మనసులో మాట బయటపెడుతుంది. భార్య మంచి మనసుకు బాలు ఫిదా అవుతాడు.
అప్పు చెల్లించిన రోహిణి...
మరోవైపు నానా తంటాలు పడి పదిహేడు లక్షలు డబ్బు సర్ధుతుంది రోహిణి. సత్యం, బాలుతో పాటు మిగిలిన కుటుంబసభ్యులందరూ కలిసి ఆ డబ్బు తీసుకెళ్లి ఫైనాన్షియర్‌కు ఇస్తారు. ఇంటి పేపర్లను ఫైనాన్షియర్ సత్యం చేతికి ఇస్తాడు.
సత్యం భయం...
ప్రభావతి దగ్గర ఇంటి డాక్యుమెంట్స్ ఉంటే మరోసారి తాకట్టు పెడుతుందని సత్యం భయపడతాడు. భార్యకు ఇంటి పేపర్లు ఇవ్వడానికి అంగీకరించడు. ఆ డాక్యుమెంట్స్‌ను భద్రంగా దాచిపెట్టమని మీనాకు ఇస్తాడు. అది చూసి బాలు సంతోషపడతాడు. భర్త తీసుకున్న నిర్ణయంతో ప్రభావతి సహించలేకపోతుంది. ఇన్నాళ్లు పార్లర్ ఓనర్‌గా ఉన్న తాను ఇప్పుడే అదే పార్లర్‌లో ఎంప్లాయ్‌గా మారడం రోహిణి తట్టుకోలేకపోతుంది. మీనా వల్లే తనకు ఈ కష్టాలు వచ్చాయని పగతో రలిగిపోతుంటుంది. ఇంటి పేపర్లను మీనా దగ్గర నుంచి కొట్టేసి ఆమెను దెబ్బకొట్టాలని రోహిణి, మనోజ్ అనుకుంటారు.