Mandakini OTT: ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ - ఫస్ట్ నైట్ రోజే భార్య లవ్ ఎఫైర్ భర్తకు తెలిస్తే..!
Mandakini OTT: మలయాళం కమెడియన్ అల్తాఫ్ సలీమ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ మందాకిని ఓటీటీలోకి వచ్చింది. మనోరమా మాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Mandakini OTT: మందాకిని ఈ ఏడాది మలయాళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది. కమెడియన్ అల్తాఫ్ సలీమ్ ఈ కామెడీ థ్రిల్లర్ మూవీతోనే హీరోగా మారాడు. వినోద్ లీలా దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనార్కలి మరిక్కర్ హీరోయిన్‌గా నటించింది.
ఎలాంటి అంచానాలు లేకుండా మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కథ, కామెడీతో పాటు లీడ్ యాక్టర్స్ నటన బాగుందంటూ సినిమాపై పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి. కోటి రూపాయల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన మందాకిని మూవీ ఐదు కోట్లపైగా వసూళ్లను రాబట్టింది.
ఓటీటీలోకి...
థియేటర్లలో నిర్మాతలకు లాభాల పంటను పండించిన మందాకిని మూవీ ఓటీటీలోకి వచ్చింది. మనోరమా మాక్స్ ఓటీటీలో ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రజెంట్ మనోరమా మాక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో మందాకిని నిలిచింది. ఈ మలయాళం మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ రెండో ఓటీటీపై ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్లు తెలిసింది.
మందాకిని కథ ఇదే...
అరోమల్ (అల్తాప్ సలీమ్), అంబిలికి (అనార్కలి మరిక్కర్) పెద్ధలు పెళ్లి జరిపిస్తారు. ఫస్ట్ నైట్ రోజు అరోమల్ ఫ్రెండ్స్ కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి అతడి చేత సీక్రెట్‌గా తాగించాలని ప్లాన్ చేస్తారు. అనుకోకుండా మద్యం కలిపిన కూల్ డ్రింక్‌ను అంబిలి తాగేస్తుంది.
తాగిన మత్తులో తన లవ్ ఎఫెర్ గురించి భర్తతో చెబుతుంది. సుజీత్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో తనను వంచించాడనే నిజం బయటపెడుతుంది. అంబిలి లవ్ ఎఫైర్ గురించి ఫస్ట్ నైట్ రోజే బయటపడటంతో అరోమల్ ఏం చేశాడు? అంబిలినిమోసం చేసిన సుజీత్‌పై అరోమల్‌తో పాటుఅతడి కుటుంబం ఎలా రివేంజ్ తీర్చుకున్నారు? అన్నదే ఈ మూవీ కథ.
ఇద్దరు దర్శకులు...
మందాకిని మూవీలో 2018 దర్శకుడు జూడ్ అంథోనీ జోసఫ్‌తో పాటు ది గ్రేట్ ఇండియన్ కిచెన్ డైరెక్టర్ జియో బేబీ ఓ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రేమమ్ సినిమాతో కమెడియన్‌గా అల్తాఫ్ సలీమ్ ఎంట్రీ ఇచ్చాడు. ఒరు అదార్ లవ్, ఆపరేషన్ జావా, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్, గోల్డ్, ప్రేమలుతో పాటు పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్‌గా, కమెడియన్‌గా కనిపించాడు.
మందాకినిలో ఫస్ట్ టైమ్ హీరోగా కనిపించాడు.కమెడియన్‌గానే కాకుండా దర్శకుడిగా నివీన్ పాల్‌తో ఓ సినిమా చేశాడు అల్తాఫ్ సలీమ్. నందుకలుడే నత్తిల్ ఒరిడవేలా పేరుతో2017లో ఓ మూవీని తెరకెక్కించాడు. కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అనార్కలి మరిక్కర్ కూడా మలయాళంలో విమానం, ఉయరే, అమలతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.
టాపిక్