Gundeninda Gudigantalu Today Episode: రివర్సైన రోహిణి బిల్డప్‌లు -మీనా చేతికి ఇంటి డాక్యుమెంట్స్
Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 6 ఎపిసోడ్‌లో ప్రభావతికి ఇవ్వాల్సిన డబ్బు కోసం తన పార్లర్‌తో పాటు బంగారం మొత్తం అమ్మేస్తుంది రోహిణి. మీనావల్లే తాను ఆడిన నాటకం మొత్తం రివర్స్ అయ్యిందని కోపంతో రగిలిపోతుంది.
Gundeninda Gudigantalu Today Episode: మీనా కారణంగా తన బ్యాక్‌గ్రౌండ్ గురించి అత్త దగ్గర ఇచ్చిన బిల్డప్‌లు ఎక్కడ బయటపడతాయోనని రోహిణి. కంగారు పడుతుంది ఇళ్లు తాకట్టు పెట్టి బ్యూటీపార్లర్ పెట్టిన విషయం రవి, మీనాకు తెలియడంతో రోహిణి షాకవుతుంది. పార్లర్ ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం ఇంటికే ఖర్చు పెడతానని చెప్పడంతో నమ్మి రోహిణికి డబ్బిచ్చినట్లు ప్రభావతి అసలు నిజం అందరికి చెబుతుంది. తాకట్టు డబ్బు విషయంలో రోహిణి, ప్రభావతిలతో బాలు గొడవపడతాడు.
రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన వర్ధన్...
తాకట్టు డబ్బును వెంటనే మీ నాన్నను అడిగి తీసుకురమ్మని రోహిణితో అంటుంది ప్రభావతి. దాంతో రోహిణి టెన్షన్ పడుతుంది. ఈ టెన్షన్‌లో ఉండగా వర్ధన్ ఫోన్ చేసి రోహిణిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. నువ్వు చీట్ చేసి మనోజ్‌నుపెళ్లిచేసుకున్న సంగతి బయటపెడతానని బెదిరిస్తాడు. తన హాస్పిటల్ బిల్ కట్టడంతో పాటు నెలకుతనకు కొంత డబ్బు ఇవ్వాలని డిమాంట్ చేస్తాడు.
లేదంటే నువ్వు కళ్యాణి అనే విషయం బయటపెడతానని బెదిరిస్తాడు. తాను కష్టాల్లో ఉన్నానని వర్ధన్‌ను రోహిణి బతిమిలాడుతుంది.మరోవైపు అత్తయ్యకు ఇవ్వాల్సిన డబ్బు కోసం పార్లర్ అమ్మాలని రోహిణి నిర్ణయించుకుంటుంది. ఈ విషయం ప్రభావతికి తెలియకుండా జాగ్రత్తపడుతుంది.
మాటిచ్చిన బాలు...
సత్యం భోజనం చేయకుండా ఇంటి గురించే ఆలోచిస్తుంటాడు. 17 లక్షలు రోహిణి తీర్చడం కష్టమేనని, ఇళ్లు ఉంటుందో అప్పుల వాళ్ల పరమవుతుందోనని కంగారు పడుతుంటాడు సత్యం. మావయ్య బాధను మీనా చూడలేకపోతుంది. ఇంటి బాధ్యతను తాను చూసుకుంటానని తండ్రికి మాటిస్తాడు బాలు. ఇంటి పరువు కాపాడుతానని మాటిస్తాడు.
డీల్ సెట్...
పార్లర్ ను 12 లక్షలకు అమ్మేస్తుంది రోహిణి. అదే పార్లర్‌లో పనిచేసేలా రోహిణితో డీల్ కుదుర్చుకుంటారు కొన్నవాళ్లు. తన లాభాల్లో వాటా కావాలని రోహిణి అడుగుతుంది. ప్రభావతికి నువ్వు ఇవ్వాల్సింది 17 లక్షలు కదా అని స్నేహితురాలు అడుగుతుంది. మా అత్త ఇచ్చింది నాకు పది లక్షలే...అవి ఇచ్చి చేతులు దులుపుకుంటాని ఫ్రెండ్‌కు బదులిస్తుంది రోహిణి.మిగిలిన డబ్బుతో నాకు సంబంధం లేదని రోహిణి అంటుంది. మీనా వల్లే పార్లర్ అమ్మాల్సివస్తుందనే కోపంతో రగిలిపోతుంటుంది రోహిణి. ఏదో ఒక తప్పు చేసి మీనా దొరికిన రోజు ఆమె అంతు చూడాలని అనుకుంటుంది.
ఏడు లక్షలు కూడా...
రోహిణి ఇంట్లో అడుగుపెట్టగానే ప్రభావతి ఆమెకు ఎదురెళ్లి డబ్బు గురించి అడుగుతుంది. మీ నాన్న డబ్బు ఇచ్చాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. పార్లర్ అమ్మేసిన సంగతి దాచిపెట్టి...నాన్న డబ్బులు ఇచ్చాడంటూ పది లక్షలు ప్రభావతికి ఇస్తుంది రోహిణి. మిగిలిన ఏడు లక్షలు కూడా మీ పెళ్లి కోసమే ఖర్చుచేశానని, అవి కూడా మీ నాన్నను అడగమని రోహిణిని బలవంతపెడుతుంది ప్రభావతి.
డబ్బు కోసం నాన్నకు ఫోన్ చేయడం నాకు ఇష్టం లేదంటూ రోహిణి అబద్ధమాడి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ ప్రభావతి వదిలిపెట్టదు. కావాలంటే ఆ డబ్బు కోసం మనోజ్ ఆఫీస్‌లో లోన్ కోసం ట్రై చేద్ధామని రోహిణి అంటుంది. మనోజ్‌కు జాబ్ లేదనే సంగతి ప్రభావతి అనుకోకుండా బయటపెడుతుంది. ఆమె మాటలు విని రోహిషి షాకవుతాడు. కోడలు కంగారు చూసి తన మాట మార్చేస్తుంది ప్రభావతి.
ఏడు లక్షలు నీకు అడగటం ఇబ్బంది అయితే మీ నాన్నతో నేను మాట్లాడుతానని, ఆ డబ్బు అడుగుతానని రోహిణితో అంటుంది ప్రభావతి. అత్త మాటలు విని రోహిణి షాకవుతుంది.ఇప్పుడే వద్దు ఓ మంచి రోజు చూసి నేనే మాట్లాడిస్తానంటూ మాట దాటేస్తుంది.
తల్లికి డెడ్‌లైన్ పెట్టిన బాలు...
డబ్బులు విసిరేస్తానని తల్లి చెప్పిన మాటను ప్రభావతికి గుర్తుచేస్తాడు బాలు. అప్పు తీర్చడానికి మూడు రోజులే డెడ్‌లైన్ ఉందంటూ టెన్షన్ పెడతాడు. అత్తయ్యను ఇబ్బంది పెట్టొద్దని భర్తతో అంటుంది మీనా. ఫైనాన్షియర్ ఇళ్లు జప్తు చేసేలోగా అమ్మతో డబ్బు కట్టించడానికి ఇదొక్కటే దారి ఉందని బాలు అంటాడు.
బంగారం తాకట్టు...
ప్రభావతికి డబ్బు ఇవ్వడానికి తన బంగారం మొత్తం తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతుంది రోహిణి. మరో రెండు లక్షలు అవసరం కావడంతో ఖాళీ బాండు పేపర్‌పై సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకుంటుంది.
ఆ తర్వాత పదిహేడు లక్షలు ఇచ్చి ఇంటిని తాకట్టు నుండి విడిపిస్తుంది రోహిణి. ఫైనాన్షియర్ నుంచి ఇంటి పేపర్స్ తీసుకుంటాడు సత్యం. ఆ పేపర్స్‌ను తాను జాగ్రత్తగా దాచిపెడతానని ప్రభావతి అంటుంది. అందుకు సత్యం ఒప్పుకోడు. మీనాకు ఇచ్చి వాటిని దాచమని అంటాడు. అతడి మాటలతో ప్రభావతి, రోహిణి షాకవుతారు.భావతి, రోహిణి షాకవుతారు.