Prabhas Rajamouli: ప్రభాస్‌కు జెన్యూన్‌గా నచ్చితేనే అలా చేస్తారు.. రాజమౌళి రియాక్షన్ ఇదే.. కీరవాణి కొడుకు కామెంట్స్-hero sri simha about prabhas rajamouli reactions on mathu vadalara 2 teaser trailer mm keeravani son comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Rajamouli: ప్రభాస్‌కు జెన్యూన్‌గా నచ్చితేనే అలా చేస్తారు.. రాజమౌళి రియాక్షన్ ఇదే.. కీరవాణి కొడుకు కామెంట్స్

Prabhas Rajamouli: ప్రభాస్‌కు జెన్యూన్‌గా నచ్చితేనే అలా చేస్తారు.. రాజమౌళి రియాక్షన్ ఇదే.. కీరవాణి కొడుకు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 10, 2024 10:41 AM IST

Mathu Vadalara 2 Sri Simha About Prabhas Rajamouli: మత్తు వదలరా 2 సినిమాతో సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడు, యంగ్ హీరో శ్రీ సింహా. మత్తు వదలరా 2 టీజర్, ట్రైలర్‌పై ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి ఏం చెప్పారో తాజాగా ప్రమోషన్స్‌లో చెప్పాడు శ్రీ సింహా.

ప్రభాస్‌కు జెన్యూన్‌గా నచ్చితేనే అలా చేస్తారు.. రాజమౌళి రియాక్షన్ ఇదే.. కీరవాణి కొడుకు కామెంట్స్
ప్రభాస్‌కు జెన్యూన్‌గా నచ్చితేనే అలా చేస్తారు.. రాజమౌళి రియాక్షన్ ఇదే.. కీరవాణి కొడుకు కామెంట్స్

Sri Simha Prabhas Rajamouli Mathu Vadalara 2: బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మత్తు వదలరాకు సీక్వెల్‌గా 'మత్తువదలరా2' ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడు, హీరో శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్‌గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించారు.

మత్తు వదలరా 2 సినిమాలో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా నటించింది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన మత్తు వదలరా 2 టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీ సింహ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

'మత్తువదలరా2' కు ఎలా ప్రిపరేషన్ జరిగింది?

-చాలా బాగా జరిగింది. గెటప్పు, క్యారెక్టర్స్ స్టయిలింగ్ మారింది. 'హీ' టీం ఏజెంట్స్‌గా చూపించాం. ఫస్ట్ పార్ట్ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.

మత్తువదలరా2 ఆలోచన మొదటి నుంచా ఉందా?

-రిలీజ్ అయ్యాక హిట్ అయిన తర్వాత సీక్వెల్ చేద్దామని నాకు, చెర్రీ గారికి ఉండేది. డైరెక్టర్ రితిష్ లాస్ట్ ఇయర్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతాయి. డెలివరీ బాయ్స్ నుంచి ఏజెంట్స్ ఎలా అయ్యారనే లింక్ చూపిస్తాం.

రెండో పార్ట్ అంచనాలు విషయంలో ఒత్తిడి తీసుకున్నారా?

-సినిమా హిట్ అయ్యిందని పార్ట్ 2 తీస్తే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కానీ, డైరెక్టర్ రితిష్‌కి ఈ కథ ఫస్ట్ పార్ట్‌కి మ్యాచ్ అయ్యేలా ఆర్గానిక్‌గా వచ్చింది. అందుకే నేచురల్‌గా అంతా సెట్ అయింది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ దే.

పార్ట్ 2ను సైలెంట్‌గా చేయడానికి కారణం?

- ఇదొక కొత్త స్ట్రాటజీలా అనుకున్నాం. అనౌన్స్ చేస్తే బజ్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ హిట్ కాబట్టి ఆడియన్స్ ఎగ్జయిట్ అవుతారు. అయితే సినిమా పూర్తయి విడుదలకి వచ్చేసరికి దానిపై బజ్ తగ్గొచ్చు. ఎగ్జయిట్‌మెంట్ పలచబడకముందే వేడివేడిగా వడ్డించేయాలనే ఉద్దేశంలో ఇలా చేశాం. ఇప్పుడున్న బజ్ చూస్తుంటే మా స్ట్రాటజీ వర్క్ అయిందనిపించింది.

ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేశారు. రియాక్షన్ ఏమిటి

-  ప్రభాస్ గారు చాలా ఎంజాయ్ చేశారు. టీజర్ ట్రైలర్ సాంగ్ చూసి చాలా ఎగ్జయిట్ అయ్యారు. ఆయనకు జెన్యూన్‌గా నచ్చితేనే అంత సమయం స్పెండ్ చేస్తారు.

రాజమౌళి గారి రియాక్షన్ ఏమిటి?

-రాజమౌళి గారికి టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి. చాలా ఎంజాయ్ చేశారు. ప్రోడక్ట్ విషయంలో హ్యాపీగా ఉన్నారు.

ఫరియాతో వర్క్ చేయడం గురించి ?

-ఫరియా ఫన్నీ క్యారెక్టర్స్‌కి బాగా సెట్ అవుతుంది. నేచురల్‌గా తనలో ఫన్ ఉంటుంది. ఇందులో తన పాత్రకు యాక్షన్ కూడా ఉంది. ఈ క్యారెక్టర్‌కి ఫరియా అబ్దుల్లా యాప్ట్. ఈ సినిమాలో తను సాంగ్ రాయడంతో పాటు కొరియోగ్రాఫ్ చేసింది. అది ప్రమోషన్స్‌కి బాగా ఉపయోగపడింది.