Rajamouli: నా భార్య చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడిని మొక్కలేదు- ఓటీటీ సిరీస్‌లో రాజమౌళి షాకింగ్ కామెంట్స్-director rajamouli about his wife rama rajamouli accident not pray god in modern masters ss rajamouli on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli: నా భార్య చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడిని మొక్కలేదు- ఓటీటీ సిరీస్‌లో రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Rajamouli: నా భార్య చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడిని మొక్కలేదు- ఓటీటీ సిరీస్‌లో రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 08, 2024 07:39 PM IST

Director SS Rajamouli About Rama Rajamouli Accident: తన భార్య రమా రాజమౌళికి యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా తాను దేవుడికి ప్రార్థించలేదని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి షాకింగ్ విషయం చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న మోడ్రన్ మాస్టర్స్ సిరీస్‌లో పలు విశేషాలు చెప్పారు.

నా భార్య చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడిని మొక్కలేదు.. డైరెక్టర్ రాజమౌళి షాకింగ్ కామెంట్స్
నా భార్య చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడిని మొక్కలేదు.. డైరెక్టర్ రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Director Rajamouli About His Wife Accident: తెలుగు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పిన తక్కువే. గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాకు వరల్డ్ వైడ్‌ ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆస్కార్‌ సైతం వరించేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఇక ఇటీవల రాజమౌళి జీవితానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలపై నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డాక్యుమెంటరీ వచ్చిన విషయం తెలిసిందే. మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి పేరుతో వచ్చిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఆగస్ట్ 2 నుంచి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇతర భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సిరీస్‌లో తాను చేసిన సినిమాలు, ఎదుర్కొన్న సమస్యలు, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్, బాధాకర విషయాలను చెప్పుకొచ్చారు రాజమౌళి. ఈ క్రమంలోనే మగధీర షూటింగ్ సమయంలో తన భార్య రమా రాజమౌళికి జరిగిన యాక్సిడెంట్, ఆ పరిస్థితుల్లో తాను ఆలోచించిన విధానాన్ని తెలిపారు రాజమౌళి.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను "మీరంతా ఎంతో ఆధ్యాత్మిక భావన ఉన్నవారు. కానీ, రాజమౌళి గారు మాత్రం నాస్థికుడు (దేవుడిపై నమ్మకం లేనివారు)" అని చెప్పారు అని అందరినీ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ అడిగారు. "అవును. దేవుడిని చేరుకోడానికి సనాతన ధర్మంలో నాలుగు యోగా మార్గాలు ఉన్నాయని చెబుతారు" అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

అప్పుడే రాజమౌళి నాస్థికుడు అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌‌గా రమా రాజమౌళి యాక్సిడెంట్ గురించి జక్కన్న చెప్పడం చూపించారు. "జ్ఞాన యోగా, రాజ యోగా, భక్తి యోగా, కర్మ యోగా అని ఉంటాయి. వీటిలో ఒక భక్త యోగాలో తప్పా ఏ యోగాలో కూడా దేవుడి గురించి ప్రస్తావించలేదు. కేవలం భక్త యోగాలో మాత్రమే దేవుడి గురించి, సుప్రీమ్ పవర్ గురించి చెప్పారు" అని రాజమౌళి అన్నారు.

"మగధీర షూటింగ్ చేస్తున్నప్పుడు కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. అది చాలా మారుమూల ప్రాంతం. రమాకు వెనుక భాగం స్పర్శ తెలియట్లేదు. దాదాపుగా పక్షవాతం వచ్చిందని అనుకున్నాం. చుట్టూ 60 కిలోమీటర్లలో ఎక్కడా కూడా హాస్పిటల్ లేదు. అప్పుడు నాకు చాలా భయమేసింది" అని రాజమౌళి చెప్పారు.

"అప్పుడు నేను అరుస్తున్నాను, డాక్టర్స్‌ని పిలుస్తున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఏదోటి అరుస్తూనే ఉన్నాను. అదే సమయంలో నాకు సడెన్‌గా ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను దేవుడిని ప్రార్థించాలా. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని ప్రార్థించాలా అని. కానీ, నేను అలా చేయలేదు. నేను అలా చేయను. నేను అప్పుడు చాలా వణికిపోతున్నాను, ఏడుస్తున్నాను. డాక్టర్స్‌ను పిలుస్తున్నాను అంతే" అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

"ఒకానొక పాయింట్‌లో నా జీవనమార్గం ఇక కర్మ యోగా అని ఎంచుకున్నాను. నా పనే నాకు దేవుడు. నా పని సినిమా" అని కర్మ సిద్ధాంతాన్ని తాను నమ్ముకున్నట్లు, ఎలాంటి ఆధ్యాత్మికత వైపు వెళ్లనన్నట్లుగా రాజమౌళి తెలిపారు. ఏం జరిగినా కర్మ ఫలితం అని భావించాలనేలా రాజమౌళి మాటలు ఉన్నాయి.

ఆ తర్వాత "నాస్థికుడిగా ఉండేవాళ్లు ఎంతో నీతి, నిజాయతితో ఉండాలి. అలా ఉంటూ నాస్థికుడిగా ఉండేవాళ్లను నేను చాలా గౌరవిస్తాను" అని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. కాగా ప్రస్తుతం రాజమౌళి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.