The GOAT Failure: తెలుగులో ది గోట్ ఫ్లాపవడానికి కారణమేంటో చెప్పిన డైరెక్టర్.. చెన్నై సూపర్ కింగ్స్ వల్లే అంటూ..-the goat thalapathy vijay movie failed in telugu because of csk says director venkat prabhu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Goat Failure: తెలుగులో ది గోట్ ఫ్లాపవడానికి కారణమేంటో చెప్పిన డైరెక్టర్.. చెన్నై సూపర్ కింగ్స్ వల్లే అంటూ..

The GOAT Failure: తెలుగులో ది గోట్ ఫ్లాపవడానికి కారణమేంటో చెప్పిన డైరెక్టర్.. చెన్నై సూపర్ కింగ్స్ వల్లే అంటూ..

Hari Prasad S HT Telugu
Sep 10, 2024 11:59 AM IST

The GOAT Failure: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.. షార్ట్ గా ది గోట్.. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తెలుగులో ఫ్లాపవడానికి కారణమేంటో చెప్పాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. దీనికి ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తో అతడు లింకు పెట్టడం విశేషం.

తెలుగులో ది గోట్ ఫ్లాపవడానికి కారణమేంటో చెప్పిన డైరెక్టర్.. చెన్నై సూపర్ కింగ్స్ వల్లే అంటూ..
తెలుగులో ది గోట్ ఫ్లాపవడానికి కారణమేంటో చెప్పిన డైరెక్టర్.. చెన్నై సూపర్ కింగ్స్ వల్లే అంటూ..

The GOAT Failure: దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీకి తెలుగులో నష్టాలు తప్పేలా లేవు. ఎంతో హైప్ క్రియేట్ చేసినా.. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. విజయ్ కి ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ది గోట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే దీనికి కారణం ఏంటో తాజాగా డైరెక్టర్ వెంకట్ ప్రభు వివరించాడు.

సీఎస్కే వల్లే ఇలా..

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ గురించి ఎక్స్ వేదికగా అభిమానులతో మాట్లాడాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఈ సందర్భంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా దారుణంగా బోల్తా పడటానికి కారణమేంటో వివరించే ప్రయత్నం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ దీనికి కారణం కావచ్చని అతడు చెప్పడం విశేషం.

ది గోట్ మూవీ క్లైమ్యాక్స్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ బ్యాక్‌డ్రాప్ లో తీశారు. స్టేడియంలో బాంబును నిర్వీర్యం చేయడానికి విజయ్ ప్రయత్నిస్తుంటాడు. ఈ సీన్ సినిమాలో బాగానే వచ్చినా.. తెలుగు, హిందీల్లో మూవీ ఫ్లాపవడానికి కారణం కూడా ఇదేనని డైరెక్టర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించేదే.

"దీనివల్లే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తున్నారు. మేమంతా సీఎస్కే అభిమానులం. అది మా రక్తంలోనే ఉంది. దానిని కాదనడం లేదు. సీఎస్కే కనెక్షన్ వల్లే ఈ సినిమా తెలుగు, హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదేమో. ఆ సీన్ ను మేము ఎంజాయ్ చేసినట్లు వాళ్లు చేయేలేదని అనిపిస్తోంది" అని వెంకట్ ప్రభు అన్నాడు.

ధోనీని తీసుకురావాలనుకున్నా..

నిజానికి ఈ మూవీ క్లైమ్యాక్స్ ను తమిళ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనిని మరింత రక్తి కట్టించడానికి సీఎస్కే మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని కూడా అతిథి పాత్రలో చూపించాలని తాము భావించామని, అయితే అది సాధ్యం కాలేదని కూడా వెంకట్ ప్రభు చెప్పాడు. అలా చేయలేకపోయామని అతడు రిప్లై ఇచ్చాడు.

ది గోట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.126 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని మేకర్స్ చెప్పినా.. నెగటివ్ టాక్ వల్ల రెండో రోజు నుంచి కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. ఐదో రోజైన సోమవారం అయితే ది గోట్ కలెక్షన్లు ఏకంగా 58 శాతం పడిపోయాయి.

ఈ మూవీ తొలి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.288 కోట్లు వసూలు చేసింది. ఇక ఇండియాలో రూ.151 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తెలుగులో ఐదు రోజుల్లో కేవలం రూ.8.45 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇవి హిందీలో రూ.9.3 కోట్లుగా ఉన్నాయి. తెలుగులో కనీసం రూ.12 కోట్లు వస్తేనే సేఫ్ జోన్ లో ఉంటుంది. కానీ ఈ మూవీకి అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

తమిళంలో మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఐదు రోజుల్లో అక్కడ ది గోట్ మూవీ రూ.133.5 కోట్లు వసూలు చేసింది. అయితే తొలి రోజు రూ.39.5 కోట్లుగా ఉన్న వసూళ్లు.. ఐదో రోజుకు వచ్చేసరికి రూ.12.5 కోట్లకు పడిపోయాయి.