The GOAT Telugu Collections: తెలుగులో దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌కు నష్టాలే.. నాలుగు రోజుల్లో వచ్చింది ఎంత?-the goat movie telugu box office collections thalapathy vijay movie staring at losses ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Goat Telugu Collections: తెలుగులో దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌కు నష్టాలే.. నాలుగు రోజుల్లో వచ్చింది ఎంత?

The GOAT Telugu Collections: తెలుగులో దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌కు నష్టాలే.. నాలుగు రోజుల్లో వచ్చింది ఎంత?

Hari Prasad S HT Telugu
Sep 09, 2024 12:48 PM IST

The GOAT Telugu Collections: దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ తెలుగులో మాత్రం బోర్లా పడినట్లే కనిపిస్తోంది. నాలుగు రోజుల్లో వచ్చింది అంతంతమాత్రమే కావడంతో ఇక్కడ ఆ సినిమాకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

తెలుగులో దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌కు నష్టాలే.. నాలుగు రోజుల్లో వచ్చింది ఎంత?
తెలుగులో దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌కు నష్టాలే.. నాలుగు రోజుల్లో వచ్చింది ఎంత?

The GOAT Telugu Collections: భారీ అంచనాల మధ్య రిలీజైన దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ తొలి రోజు నుంచే వస్తున్న నెగటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. విజయ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ తో తొలి రోజు రూ.3 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినా.. తర్వాత మెల్లగా పడిపోయాయి.

ది గోట్ బాక్సాఫీస్ కలెక్షన్లు

ది గోట్ మూవీ సెప్టెంబర్ 5న తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ లో ఇక్కడ సినిమా రిలీజ్ చేసిన వాళ్లు తెల్లవారుఝామున 4 గంటల షోలు కూడా ఏర్పాటు చేశారు. దళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో తొలిరోజు రూ.3 కోట్లతో ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.

అయితే తొలి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో తర్వాతి మూడు రోజుల్లో కలెక్షన్లు పడిపోయాయి. మొత్తంగా ఇప్పటి వరకూ నాలుగు రోజుల్లో ది గోట్ మూవీకి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది రూ.7.85 కోట్లు మాత్రమే. ఇక్కడ సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే కనీసం రూ.12 కోట్లకుపైనే రావాల్సి ఉంది.

నష్టాలు తప్పవా?

ఆ లెక్కన చూస్తుంటే ది గోట్ మూవీకి నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఆదివారం (సెప్టెంబర్ 8)తో హాలిడేస్, వీకెండ్ ముగిసింది. సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్లు భారీగా తగ్గిపోనున్నాయి. ఈ లెక్కన ఆ బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమాకు కష్టంగానే కనిపిస్తోంది.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాకు తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లు వచ్చాయి. రెండో రోజు ఒకేసారి రూ.1.35 కోట్లకు పడిపోగా.. మూడో రోజు రూ.2 కోట్లతో ఫర్వాలేదనిపించింది. ఇక నాలుగో రోజు ఆదివారం అయినా కూడా ఈ కలెక్షన్లు రూ.1.5 కోట్ల దగ్గరే ఆడిపోయాయి. మొత్తంగా తెలుగులో రూ.7.85 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఆ రెండు సినిమాల నుంచి పోటీ

తెలుగులో ది గోట్ సినిమాకు ప్రధానంగా రెండు సినిమాల నుంచి గట్టి పోటీ ఉంది. సరిపోదా శనివారం, 35 చిన్న కథ కాదు సినిమాలకు పాజిటివ్ టాక్ తో ఇప్పటికీ మంచి వసూళ్లు వస్తున్నాయి. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షలు, వరదలు కూడా ది గోట్ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పొచ్చు.

వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్లో నటించాడు. అయితే సినిమాకు అనుకున్న స్థాయిలో పాజిటివ్ రివ్యూలు రాలేదు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటిస్తునన చివరి సినిమాల్లో ఒకటిగా ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడినా.. అది కూడా పెద్దగా సాయపడలేదు.