The Goat OTT: ఓటీటీలో పెరగనున్న ది గోట్ రన్ టైమ్ - దళపతి విజయ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Goat OTT: దళపతి విజయ్ ది గోట్ రన్‌టైమ్ ఓటీటీలో పెరగనున్నట్లు సమాచారం. థియేటర్లలో మూడు గంటల మూడు నిమిషాల రన్‌టైమ్‌తో ఈ మూవీ రిలీజైంది. ఓటీటీలో మాత్రం మూడు గంటల ఇరవైఒక్క నిమిషాల రన్‌టైమ్‌తో ఆడియెన్స్ ముందుకు ఈ యాక్షన్ మూవీ రానున్నట్లు చెబుతోన్నారు.
దళపతి విజయ్ ది గోట్ మూవీ మిక్సడ్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తమిళనాడులో కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ది గోట్ మూవీ 280 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
అరవై కోట్ల వసూళ్లు...
ఆదివారం రోజు ది గోట్ మూవీ 58 నుంచి 60 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. తమిళ వెర్షన్ 24 కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకోగా...తెలుగు వెర్షన్‌కు ఆదివారం 2.2 కోట్ల వసూళ్లను వచ్చినట్లు చెబుతోన్నారు. ఓవర్‌సీస్‌లో దళపతి విజయ్ మూవీ అదరగొడుతోంది. ఆదివారం రోజు ఈ సినిమా 11 కోట్ల వసుళ్లను సొంతం చేసుకున్నట్లు చెబుతోన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
కాగా ది గోట్ ఓటీటీ హక్కులను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఈ సినిమా ఓటీటీ రన్‌టైమ్ దాదాపు 18 నిమిషాలు పెరగనున్నట్లు సమాచారం. ఓటీటీ వెర్షన్ కోసం ఓ యాక్షన్ ఎపిసోడ్, సాంగ్‌తో పాటు విజయ్ కామెడీ సీన్స్‌ను యాడ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తోన్నట్లు తెలిసింది.
థియేటర్లలో రన్ టైమ్ ఎక్కువుతుందని 18 నిమిషాల ఫుటేజ్‌ను మేకర్స్ కట్ చేసినట్లు చెబుతోన్నారు. ఆ సీన్స్‌ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. థియేటర్లలో మూడు గంటల మూడు నిమిషాల రన్‌టైమ్‌తో ది గోట్ మూవీ రిలీజైంది. ఓటీటీలో మాత్రం మూడు గంటల ఇరవైఒక్క నిమిషాల రన్‌టైమ్‌తో ఆడియెన్స్ ముందుకు ఈ యాక్షన్ మూవీ రానున్నట్లు చెబుతోన్నారు.
అక్టోబర్‌లో ది గోట్ మూవీ ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
విజయ్ డ్యూయల్ రోల్...
ది గోట్ మూవీలో దళపతి విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. తండ్రీ కొడుకులుగా నటించాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ది గోట్‌లో విజయ్ యాక్టింగ్, డ్యాన్సులు బాగున్నా...స్టోరీ, విజయ్ లుక్ విషయంలో దారుణంగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ఔట్‌డేటెడ్ స్టోరీతో వెంకట్ ప్రభు ఈ మూవీని తెరకెక్కించినట్లు ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తోన్నారు.
ది గోట్ కథ ఇదే...
యాంటీటెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పనిచేస్తోన్న విషయాన్ని భార్య అను ( స్నేహ) దగ్గర గాంధీ దాచిపెడతాడు.
సీక్రెట్ మిషన్‌లో జరిగిన ఎటాక్‌లో కొడుకు జీవన్‌ను (విజయ్)కోల్పోతాడు గాంధీ. భర్త జాబ్ వల్లే కొడుకు చనిపోయాడనే కోపంతో గాంధీకి దూరమవుతుంది అను. కొడుకు దూరమైన బాధలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాబ్ వదిలేస్తాడు గాంధీ. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌గా బతుకుతుంటాడు.
చనిపోయాడని అనుకున్న కొడుకు జీవన్‌ను అనుకోకుండా గాంధీ లైఫ్‌లోకి వస్తాడు. అదే టైమ్‌లో గాంధీతో కలిసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పనిచేసిన వాళ్లతో పాటు అతడి సన్నిహితులు ఒక్కొక్కరుగా హత్యలకు గురవుతుంటారు
ఈ హత్యలు చేస్తుంది ఎవరు? గాంధీ తలపెట్టిన ఓ సీక్రెట్ మిషన్ నుంచి ప్రాణాలతో బయటపడిన మీనన్(మోహన్)అతడిపై రివేంజ్ తీర్చుకోవానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? తాను వెతుకుతున్న శత్రువు కొడుకు జీవన్ అని తెలిసి గాంధీ ఏం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ.
త్రిష స్పెషల్ సాంగ్
ది గోట్ మూవీలో మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. త్రిష స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ప్రశాంత్, ప్రభుదేవా, జయరాం కీలక పాత్రల్లో నటించారు. శివకార్తికేయన్, ధోనీ గెస్ట్ పాత్రల్లో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.
టాపిక్