Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్‍పై బజ్.. ఆ రోజే రానుందా?
Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం సినిమా థియేటర్లలో దుమ్మురేపుతోంది. పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. అయితే, ఈ మూవీ ఓటీటీ డేట్‍పై సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తోంది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 29న రిలీజైన ఈ మూవీ ఆరంభం నుంచే దుమ్మురేపుతోంది. భారీ వర్షాలు ఉన్నా.. ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం జోరుగా వస్తున్నాయి. కాగా, సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ డేట్‍పై రూమర్లు వస్తున్నాయి.
ఓటీటీ డేట్ ఇదేనా?
సరిపోదా శనివారం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఫుల్ క్రేజ్ ఉన్న ఈ మూవీ హక్కులను రిలీజ్‍కు కొన్ని నెలల ముందే భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఆగస్టు 29న థియేటర్లలో విడుదల తేదీని మూవీ టీమ్ మార్చలేదు. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 వాయిదా పడినా.. ముందుగా రాకుండా ఓటీటీ డీల్ వల్లనే 29వ తేదీకే సరిపోదా శనివారం చిత్రం కట్టుబడిందనే టాక్ వచ్చింది.
సరిపోదా శనివారం సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుందనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా ఆ ప్లాట్‍ఫామ్ డీల్ చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ప్రస్తుతం సరిపోదా శనివారం చిత్రానికి థియేట్రికల్ రన్ ప్రస్తుతం బలంగా ఉంది. కలెక్షన్లు జోరుగా వస్తున్నాయి. ఒకవేళ లాంగ్ థియేట్రికల్ కొనసాగితే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను ఆలస్యం చేసే విషయంపై మేకర్స్ ఆలోచించే అవకాశం ఉంటుంది. మరి ఈ చిత్రం సెప్టెంబర్లోనే స్ట్రీమింగ్‍కు వస్తుందా.. ఆలస్యమవుతుందా అనేది చూడాలి.
కలెక్షన్లు ఇలా..
సరిపోదా శనివారం సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి 90 శాతం రికవరీ అయినట్టు తెలుస్తోంది. మరొక్క రోజునే లాభాల్లోకి ఈ చిత్రం అడుగుపెట్టే అవకాశం ఉంది. నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్కును దాటి ఇప్పటికే ఈ చిత్రం ప్రాఫిట్ జోన్‍లోకి వచ్చేసింది. ఇంకా ఈ మూవీ జోరు కొనసాగిస్తోంది. రూ.100 కోట్ల మార్క్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేకపోతే కలెక్షన్లు మరింత ఎక్కువగా వచ్చేవనే అంచనాలు ఉన్నాయి.
‘విజయవేడుక’ డేట్ ఇదే
సరిపోదా శనివారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకోనుంది మూవీ టీమ్. విజయ వేడుక పేరుతో సక్సెస్ ఈవెంట్‍ను నిర్వహిస్తోంది. రేపు (సెప్టెంబర్ 5) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‍లోని శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించింది.
వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సరిపోదా శనివారం మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటించారు. ఎస్‍జే సూర్య విలన్‍గా చేశారు. ఈ మూవీలో నాని, సూర్య నటన విపరీతంగా మెప్పించింది. ఈ మూవీకి జేక్స్ బెజోయ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద బలంగా నిలిచింది.