Saripodhaa Sanivaaram Box office: సరిపోదా శనివారం చిత్రానికి అక్కడ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. జోష్‍గా కలెక్షన్లు-saripodhaa sanivaaram box office collections nani movie gets break even in north america us in 3 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Box Office: సరిపోదా శనివారం చిత్రానికి అక్కడ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. జోష్‍గా కలెక్షన్లు

Saripodhaa Sanivaaram Box office: సరిపోదా శనివారం చిత్రానికి అక్కడ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. జోష్‍గా కలెక్షన్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 01, 2024 03:39 PM IST

Saripodhaa Sanivaaram Box office Collections: నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. మంచి కలెక్షన్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‍లోనూ దుమ్మురేపుతోంది.

Saripodhaa Sanivaaram Box office: సరిపోదా శనివారం చిత్రానికి అక్కడ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. జోష్‍గా కలెక్షన్లు
Saripodhaa Sanivaaram Box office: సరిపోదా శనివారం చిత్రానికి అక్కడ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. జోష్‍గా కలెక్షన్లు

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సరిపోదా శనివారం సినిమా జోష్ కొనసాగిస్తోంది. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం వాటిని నిలబెట్టుకుంటూ సక్సెస్ దిశగా దూసుకెళుతోంది. ఆగస్టు 29న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయింది. ప్రేక్షకులను మెప్పించి పాజిటివ్ స్పందన సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు కూడా దూకుడుగా వస్తున్నాయి.

నాని సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అమెరికాలోనూ ఫుల్ క్రేజ్ ఉంటుంది. సరిపోదా శనివారం చిత్రంతోనూ ఇది మరోసారి ప్రూవ్ అయింది. ఈ చిత్రం మూడో రోజుల్లోనే నార్త్ అమెరికాలో 1.6 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది.

అప్పుడే బ్రేక్ ఈవెన్

సరిపోదా శనివారం సినిమా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 1.6 మిలియన్ డాలర్ల కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఈ మూవీకి అక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఇప్పటి నుంచి వచ్చే వసూళ్లన్నీ లాభాలే.

నార్త్ అమెరికాలో సరిపోదా శనివారం చిత్రానికి బ్రేక్ ఈవెన్ అయిందని అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగిర సినిమాస్ నేడు (సెప్టెంబర్ 1) వెల్లడించింది. 1.6 మిలియన్ డాలర్ల కలెక్షన్ల పోస్టర్‌తో పాటు ఈ విషయాన్ని ప్రకటించింది. “మాకు బ్రేక్ ఈవెన్ వచ్చేసింది! నార్త్ అమెరికాలో 1.6 మిలియన్ డాలర్లను సరిపోదా శనివారం దాటేసింది. బాక్సాఫీస్ వద్ద శివతాండవం కొనసాగుతోంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కాగా, నేచురల్ స్టార్ నానికి నార్త్ అమెరికాలో ఇది 10వ మిలియన్ డాలర్ చిత్రంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 12 సినిమాలు నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి. నాని 10 చిత్రాలతో తర్వాతి స్థానంలో ఉన్నారు. సరిపోదా శనివారం ఇంకా స్ట్రాంగ్‍గా కలెక్షన్లను సాధిస్తోంది.

రూ.50కోట్లు దాటేసి..

సరిపోదా శనివారం సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ.52.18 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (సెప్టెంబర్ 1) అధికారికంగా వెల్లడించింది.

సరిపోదా శనివారం చిత్రం మూడో రోజైన శనివారం సుమారు రూ.16కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటం కలెక్షన్లపై కాస్త ప్రభావం చూపించింది. వానలు లేకపోతే మరింత ఎక్కువ వసూళ్లు వచ్చేవనే అంచనాలు ఉన్నాయి.

సరిపోదా శనివారం చిత్రానికి నాలుగో రోజైన ఆదివారం కూడా కలెక్షన్లు భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. టికెట్ల బుకింగ్స్ భారీగా జరిగాయి. చివరి 24 గంటల్లో ఒక్క బుక్ మై షో ప్లాట్‍ఫామ్‍లోనే ఈ మూవీకి 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ట్రెండ్ బలంగా ఉండటంతో సండే ఎక్కువగానే కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి.

సరిపోదా శనివారం చిత్రంలో నానితో పాటు విలన్‍గా నటించిన ఎస్‍జే సూర్య యాక్టింగ్‍కు ప్రశంసలు దక్కుతున్నాయి. మాస్ యాక్షన్, డ్రామా, ఎలివేషన్లతో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ మూవీని తెరకెక్కించిన తీరు మెప్పిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటించారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకం ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేయగా.. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ ఇచ్చారు.