Saripodhaa Sanivaaram Runtime: ఒక్క కట్ కూడా లేకుండా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి! ఎక్కువ రన్‍టైమ్‍తోనే..-nani action thriller movie saripodhaa sanivaaram completes censor without cuts and film runtime details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Runtime: ఒక్క కట్ కూడా లేకుండా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి! ఎక్కువ రన్‍టైమ్‍తోనే..

Saripodhaa Sanivaaram Runtime: ఒక్క కట్ కూడా లేకుండా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి! ఎక్కువ రన్‍టైమ్‍తోనే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 27, 2024 06:47 PM IST

Saripodhaa Sanivaaram Runtime: సరిపోదా శనివారం సినిమా సెన్సార్ పూర్తయింది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రాన్ని సెన్సార్ ఓకే చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. రన్‍టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Saripodhaa Sanivaaram Runtime: ఒక్క కట్ కూడా లేకుండా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి! ఎక్కువ రన్‍టైమ్‍తోనే..
Saripodhaa Sanivaaram Runtime: ఒక్క కట్ కూడా లేకుండా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి! ఎక్కువ రన్‍టైమ్‍తోనే..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రిలీజ్ ఆసన్నమవుతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఫుల్ క్రేజ్ ఉంది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. ఈ క్రమంలో సరిపోదా శనివారం చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

కట్స్ లేకుండా..

సరిపోదా శనివారం సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఏ డిలీట్‍లను కూడా సెన్సార్ సభ్యులు సూచించలేదట. అయితే, నాలుగైదు చోట్ల ఓ అభ్యంతరకరమైన పదాన్ని మ్యూట్ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికేషన్ వచ్చింది.

రన్‍టైమ్ ఇదే

సెన్సార్ పూర్తవటంతో సరిపోదా శనివారం సినిమా రన్‍టైమ్ వివరాలు అధికారికంగా బయటికి వచ్చాయి. 2 గంటల 54 నిమిషాలు (174 నిమిషాలు) రన్‍టైమ్‍తో ఈ చిత్రం వస్తోంది. సాధారణంగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు వచ్చే రన్‍టైమ్ ఇది కాస్త ఎక్కువగానే ఉంది. లెన్తీ రన్‍టైమ్‍కే మేకర్స్ డిసైడ్ అయ్యారు.

సరిపోదా శనివారం సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటించారు. గ్యాంగ్‍లీడర్ చిత్రం తర్వాత వీరిద్దరూ మరోసారి జతకట్టారు. అమ్మకు ఇచ్చిన మాట కోసం శనివారం మాత్రం కోపం చూపే క్యారెక్టర్‌ను ఈ చిత్రంలో పోషించారు నాని.

సరిపోదా శనివారం చిత్రంలో ఎస్‍జే సూర్య విలన్ పాత్ర పోషించారు. పోలీస్ ఆఫీసర్‌గా ఉండే దయానంద్ (ఎస్‍జే సూర్య).. సోకులపాలెం ప్రజలను హింసిస్తుంటాడు. వారి కోసం అతడితో సూర్య (నాని) తలపడడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుందని ట్రైలర్‌తో మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.

సరిపోదా శనివారం మూవీలో నాని, ప్రియాంక, ఎస్‍జే సూర్యతో పాటు సాయికుమార్, అభిరామి, ఆదితి బాలన్, మురళీ శర్మ, అజయ్, సుప్రీత్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించారు. డిఫరెంట్ పాయింట్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. గతంలో నాని - వివేక్ కాంబోలో రొమాంటిక్ కామెడీ మూవీ అంటే సుందరానికి చిత్రం వచ్చింది. ఇప్పుడు వారి కాంబోలో సరిపోదా శనివారం యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తుండటంతో మరింత క్రేజ్ ఉంది.

సరిపోదా శనివారం చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించగా.. జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ పెద్దబలంగా నిలిచే అవకాశం ఉంది. టీజర్, ట్రైలర్లో ఇది స్పష్టంగా అర్థమైంది.

జోరుగా బుకింగ్స్

సరిపోదా శనివారం సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. జోరుగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది.

సరిపోదా శనివారం చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ అవుతోంది. తెలుగు మినహా ఇతర భాషల్లో సూర్యాస్ సాటర్‌డే టైటిల్‍తో విడుదలవుతోంది.