Nani Comments: పోతారు.. అందరూ పోతారు.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్ వైరల్
Nani Comments In Saripodhaa Sanivaaram Pre Release Event: సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పోతారు.. అందరూ పోతారు.. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం చూస్తారు అంటూ నాని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nani Comments Viral: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇంతకముందు రా అండ్ రస్టిక్ లుక్‌లో దసరా మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని ఆ వెంటనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన హాయ్ నాన్నతో మంచి విజయం సాధించాడు. ఇప్పుడు ఒక్కరోజు కోపంతో వణికించే పాత్రతో ముందుకు వస్తున్నాడు.
ఐదు భాషల్లో
నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. నానితో అంటే సుందరానికి మూవీ తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యతోపాటు కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి నానితో వర్క్ చేసిన డైరెక్టర్స్‌తోపాటు మూవీ టీమ్ పాల్గొంది. సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన కామెంట్స్ వైరల్ అవతున్నాయి.
చిన్నగా అరిచాను
"అందరికీ థ్యాంక్స్. ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ ఉంది. అది త్వరలో తెలుస్తుంది మీకు. సినిమా గురించి చాలా చెప్పేశాను. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ట్రైలర్‌లో చిన్నగా అరిశాను. ఈనెల 29న అందరూ అంతరేంజ్‌లో సక్సెస్ ఇవ్వాలి" అని నాని అన్నాడు.
"వివేక్ ఏమి తీశాడో 29న మీకే తెలుస్తుంది. వివేక్ శివతాండవం ఈ సినిమాలో చూపించాడు. ఇది వివేక్‌కు మైల్ స్టోన్‌లా ఉంటుంది. మా కష్టాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. జేక్స్ నా ఫ్యాన్. టెన్షన్ ఉన్నప్పుడు జేక్స్ ఆర్ఆర్ ఇంటే రిలీఫ్‌గా ఉంది. సినిమాటోగ్రాఫర్ మురళీ గారు చాలా కేర్ తీసుకుని టేక్ ఎన్ని అయినా కాంప్రమైజ్ కాలేదు. ఇక ఎడిటింగ్ చాలా అద్భుతంగా చేశాడు" అని నాని తెలిపాడు.
"ఈ సినిమాలో సోకుల పాలెం సెట్ అనేది రియల్ లొకేషన్‌లా ఆర్ట్ డైరెక్టర్ చేశాడు. మా నిర్మాత దానయ్యగారు ఏ సినిమాకూ కథ తెలీయదు. లొకేషన్‌కు వచ్చి అన్నీ మీరే చూసుకోండని అంటారు. కానీ, ఆయనకు అదృష్టం ఉంది. అందుకే సరిపోదా శనివారం, ఓజీ లాంటి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. వివేక్‌తో పనిచేయాలంటే టీమ్ చాలా కష్టపడాలి. ఈ సినిమా సక్సెస్‌లో అందరికి భాగం ఉంది" అని నాని చెప్పాడు.
బాబాయ్‌లా అనిపిస్తారు
"ఎగ్జిబిబటర్లు, పంపిణీదారులకు చెప్పాలంటే, కలిసివస్తే కాలం వస్తే నడిచివచ్చే సినిమా వస్తుందంటారు.. అలాంటి సినిమా సరిపోదా శనివారం. ఇక సాయి కుమార్ గారు నాకు ఫాదర్ గా చేశారు. కానీ, బాబాయ్‌లా అనిపిస్తారు. ఆయనతో నటించడం పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి. అభిరామి, అతిది తదితరులు చక్కగా నటించారు. అలీ ఇందులో భాగం అయ్యారు" అని నాని పేర్కొన్నాడు.
"ప్రియాంకతో ఆఫ్ స్క్రీన్‌లో ప్రేమలో పడతారు. ఈ సినిమాలో సూర్య, చారు పాత్రలను దర్శకుడు వివేక్ చక్కగా డీల్ చేశాడు. ఇక ఎస్‌జే సూర్య పాత్రకు మంచి పేరు వస్తుంది. దయా పాత్రకు ఆయనే సరియైన నటుడు. ఆగస్టు 29న పోతారు. అందరూ పోతారు. అందరూ థియేటర్‌కు పోతారు. 29న సరిపోదా శనివారం చూస్తారు" అని నేచురల్ స్టార్ నాని చెప్పుకొచ్చాడు.