Priyanka Chopra: దళపతి విజయ్‌తో సినిమా అనగానే ఏడ్చేసింది.. చివరికీ ఒప్పించా: ప్రియాంక చోప్రా తల్లి-priyanka chopra mother madhu chopra recalls debut movie with thalapathy vijay thamizhan priyanka chopra get tears ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyanka Chopra: దళపతి విజయ్‌తో సినిమా అనగానే ఏడ్చేసింది.. చివరికీ ఒప్పించా: ప్రియాంక చోప్రా తల్లి

Priyanka Chopra: దళపతి విజయ్‌తో సినిమా అనగానే ఏడ్చేసింది.. చివరికీ ఒప్పించా: ప్రియాంక చోప్రా తల్లి

Sanjiv Kumar HT Telugu
May 30, 2024 11:40 AM IST

Priyanka Chopra Mother About Thalapathy Vijay Movie: తమిళ దళపతి విజయ్‌తో తొలి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ప్రియాంక చోప్రా కన్నీళ్లు పెట్టుకుందని హీరోయిన్ తల్లి మధు చోప్రా తాజాగా చెప్పారు. ఆ సినిమా ఆఫర్‌ను ప్రియాంక చోప్రా చివరికీ ఒప్పుకునేలా చేసినట్లు మధు చోప్రా వెల్లడించారు.

దళపతి విజయ్‌తో సినిమా అనగానే ఏడ్చేసింది.. చివరికీ ఒప్పించా: ప్రియాంక చోప్రా తల్లి
దళపతి విజయ్‌తో సినిమా అనగానే ఏడ్చేసింది.. చివరికీ ఒప్పించా: ప్రియాంక చోప్రా తల్లి

Priyanka Chopra Mother Madhu Chopra Vijay Movie: మోడలింగ్ రంగంలో సత్తా చాటిన ప్రస్తుత గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ వెంటనే దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన తమిళన్ (Thamizhan Movie) చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. అయితే ఆ సినిమా చేయడానికి ముందుగా ప్రియాంక చోప్రాకు అస్సలు ఇష్టం లేదట.

2002లో తమిళంలో విజయ్ సరసన తమిళన్ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా మొదట ఈ సినిమాకు ఓకే చెప్పడానికి చాలా సంకోచించింది. ఈ విషయాన్ని తాజాగా ఫిల్మిగ్యాన్‌కు ఇచ్చి నఇంటర్వ్యూలో ప్రియాంక తల్లి మధు చోప్రా చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్‌తో సినిమా చేసేందుకు ప్రియాంక చోప్రా ఒప్పుకునేందుకు తను ప్రయత్నించిన తీరును వివరించారు మధు చోప్రా.

"సినిమాల్లో నటించడం ప్రియాంకకు ఇష్టం లేదు. ఎవరి ద్వారానో సౌత్ ఇండియా సినిమాలో ప్రియాంకకు ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ గురించి ప్రియాంకకు చెప్పగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నేను సినిమాలు చేయను అని తెగేసి చెప్పింది. కానీ, ప్రియాంక ఎప్పుడు క్రమశిక్షణ, విధేయత కలిగిన అమ్మాయి. అందుకే నేను సినిమా ఆఫర్‌ను ఒప్పుకోమ్మని చెప్పగానే ఒప్పుకుంది అని ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తెలిపారు.

"అలా విజయ్‌ నటించిన తమిళన్ సినిమా ఒప్పందంపై ప్రియాంక చోప్రా సంతకం చేసింది. కానీ, తర్వాత ఈ సినిమా షూటింగ్ తనకు బాగా నచ్చింది. భాష తెలియకపోయినా ఎంజాయ్ చేసింది. అన్ని విషయాల్లో ఆమెకు సినిమా టీమ్ సహాయం చేసింది. అలాగే తనను చాలా గౌరవంగా చూసుకున్నారు" అని మధు చోప్రా వెల్లడించారు.

"ఈ చిత్రంలో విజయ్ నటించారు. అతను పరిపూర్ణమైన స్టార్ హీరో. చాలా గొప్ప హీరో. ఆ సినిమాకు రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. డాన్స్‌లో ప్రియాంక ఓకే అనిపించినా మొదట్లో విజయ్‌తో సరిగ్గా స్టెప్పులు వేయలేకపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొరియోగ్రాఫర్‌తో కలిసి ప్రాక్టీస్ చేసేది. ఆ తర్వాత డ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఇది పాత్రను ఎలా చేయాలో తెలుసుకోవడంలో, కెరీర్‌గా కొనసాగించేందుకు ఉపయోగపడింది" అని మధు చోప్రా అన్నారు.

ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని గెలుచుకున్న తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట తమిళన్ (2002) అనే తమిళ మూవీతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ గూఢచారి (2003) మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ప్రియాంక చోప్రా. ఇందులో సన్నీ డియోల్‌తో జోడీ కట్టింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ప్రియాంక.

అనంతరం హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్‌గా వరల్డ్ వైడ్‌గా పేరు తెచ్చుకుంది. ఇక ప్రియాంక చోప్రా ది బ్లఫ్ (The Bluff Movie) అనే మూవీలో నటిస్తోంది. దీనికి ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీ (Heads Of State Movie) షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇందులో ఇడ్రిస్ ఎల్బా, జాన్ సీనా, జాక్ క్వైడ్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.